Maha Shivaratri 2022: శివరాత్రి, గ్రహణాల సమయంలో ఈ మంత్రాలు జపిస్తే మహారుద్రయాగం చేసినంత ఫలితం, విజయం
శివ మంత్రోచ్ఛారణ ద్వారా తాము పొందిన ఫలితాన్ని కొందరు మహర్షులు పురాణాల్లో తెలియజేశారు. వాటిలో అత్యంత విశిష్టమైనవి ఏకాదశ రుద్ర మంత్రాలు. వీటిని నిత్యం జపిస్తే మహారుద్రయాగం చేసినంత ఫలితం దక్కుతుందట.
![Maha Shivaratri 2022: శివరాత్రి, గ్రహణాల సమయంలో ఈ మంత్రాలు జపిస్తే మహారుద్రయాగం చేసినంత ఫలితం, విజయం Maha Shivaratri 2022: Most powerful mantras of maha shiva ratri Maha Shivaratri 2022: శివరాత్రి, గ్రహణాల సమయంలో ఈ మంత్రాలు జపిస్తే మహారుద్రయాగం చేసినంత ఫలితం, విజయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/01/1e265f485211ced2bd16c0a746944083_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మంత్రం అంటే పరివర్తనం కలిగించేది అని అర్థం. మంత్రోచ్చారణ వల్ల ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి వచ్చినట్టు ఉంటుంది. ఓ క్రమపద్ధతిలో మంత్రాన్ని ఉచ్ఛరించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది.
'పంచాక్షరీ మంత్రం':
'ఓం నమః శివాయః'.
మహామృతుంజయ మంత్రం
ఓం త్రయంబకం యజమహే సుగంధీమ్ పుష్తి-వర్ధనం|
ఉర్వరుకం-ఇవా బంధనన్ మృత్యోర్ముక్షియా మమృతత్ ||
శివ గాయత్రి మంత్రం
ఓం తత్పురుషాయి విద్మహే మహాదేవయ్ దీమాహి తన్నో రుద్ర ప్రచోదయత్
Also Read: మిగిలిన దేవుళ్లకన్నా శివుడు ఎందుకు ప్రత్యేకం
'శివధ్యాన శివ మంత్రం':
'కర్చరాంకృతం వా కాయజం కర్మజం వా
శ్రవన్నయనజం వా మానసం వా
పరధాం విహితం విహితం వా
సర్వ మేతత క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహదేవ్ శంభో'
శివ స్తోత్రం
విశ్వేశ్వరాయ మహాదేవాయ
త్రయంబకాయ త్రిపురంతకాయ
త్రికాలాగ్ని - కాలాయ
కాలాగ్ని - రుద్రాయ
నీలకాంఠాయ- మృత్యుంజయాయ
సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమాన్ మహాదేవాయ నమ
Also Read: శివం పంచభూతాత్మకం అని ఎందుకు అంటారు
వీటన్నింటితో పాటూ ఏకాదశ రుద్ర మంత్రాలైన ఈ పదకొండు జపిస్తే జీవితంలో ఎదురైన ఆటంకాలు తొలగిపోయి విజయం వరిస్తుంది.
ఏకాదశ రుద్ర మంత్రాలు
కపాలీ- ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్
పింగళ- ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమ:
భీమ- ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం
విరూపాక్ష- ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమ:
విలోహిత- ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం
శశస్త- ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమ:
అజపాద- ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం
అహిర్బుధన్య- ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం
శంబు- ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమ:
చంద- ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్
భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ:
ఈ మంత్రాలను కేవలం శివరాత్రి రోజు మాత్రమే కాదు..శివరాత్రి మొదలు కనీసం 40 రోజుల పాటూ నిత్యం జపిస్తే విశేష ఫలితం పొందుతారు. మరీ ముఖ్యంగా ఏకాదశ రుద్ర మంత్రాన్ని రోజుకి 108 సార్లు జపిస్తే శత్రునాశనం జరిగి విజయం మీ సొంతం అవుతుందని పండితులు చెబుతారు., శివరాత్రి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం రోజున జపిస్తే ఇవి అత్యంత పవర్ ఫుల్ అంటారు పండితులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)