News
News
X

Ambajipeta News : అంబాజీపేటలో విజయ బేతాళస్వామి ఉత్సవాలు, 56 ఏళ్లుగా వాహన మహోత్సవం

Ambajipeta News : అంబాజీ పేటలో దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా విజయ బేతాళ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తారు.

FOLLOW US: 

Ambajipeta News : కోనసీమ జిల్లా అంబాజీపేట అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది జగ్గన్న తోట సంక్రాంతి ప్రభల తీర్థం.  అయితే ఇక్కడ దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా మరొక విశేషమైన ఉత్సవం ఉంది. అంబాజీపేటలో 13 ప్రాంతాల నుంచి సుందరంగా అలంకరించిన 13 ప్రత్యేక వాహనాలపై దేవుని విగ్రహాలను తీసుకొచ్చి, ఒక చోట కలిపే అపురూప దృశ్యం ఈ నెల 11న అంబాజీపేటలో ఆవిష్కృతం కానుంది. ఏటా దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత విజయ బేతాళ స్వామి వాహన మహోత్సవాన్ని పట్టణంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అంబాజీపేటలో ఈనెల 11న ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. అనుకున్న లక్ష్యాల్ని సాధించేందుకు విజయ బేతాళుడిని పూజించడం అనాదిగా వస్తోన్న సంప్రదాయం. సుమారు 56 ఏళ్లుగా ఇక్కడ విజయబేతాళస్వామి వారి వాహన మహోత్సవాన్ని నిర్వహిస్తుండడం విశేషం.

వివిధ ప్రాంతాల నుంచి  

అంబాజీపేటలోని శ్రీనివాస నగర్ నుంచి గరుత్మంతుడు, పెచ్చెట్టివారిపాలెం నుంచి గరుత్మంతుడు, మాచవరం శ్రీరామ నగర్ నుంచి విజయ దుర్గమ్మ, దొమ్మేటివారిపాలెం పోస్టువీధి నుంచి కృష్ణుడు, దొమ్మేటివారిపాలెం మహిళల ఆసుపత్రి వీధి నుంచి ఆంజనేయ స్వామి, పోతాయిలంక నుంచి ఆంజనేయ స్వామి, గంగలకుర్రు మలుపు నుంచి విజయ గణపతి స్వామి, మాచవరం ఇటికాలమ్మ వారిపాలెం నుంచి రాజహంస, కొత్తపాలెం నుంచి హంస, చప్పిడివారి పాలెం నుంచి షిర్డీ సాయిబాబా, గుత్తుల వారి పాలెం నుంచి సింహ వాహనం, నందంపూడి నుంచి రాజరాజేశ్వరీ అమ్మవారు, శ్రీనివాసనగర్ నుంచి ఏనుగు విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి వేడుక జరిగే ప్రదేశానికి తీసుకొస్తారు. మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు విజయబేతాళస్వామి వారి తీర్థం జరుగుతుంది.

ఇదీ నేపథ్యం 

News Reels

ఇక్కడ ఏటా విజయదశమి అనంతరం వాహన మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 1967లో అంబాజీపేటలో ఏర్పాటైన అభ్యుదయ  సంక్షేమ సంఘం, ఉత్సవ కమిటీల నేతృత్వంలో అయిదున్నర దశాబ్దాలుగా ఈ వాహన మహోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఇక్కడి 13  గ్రామాలకు చెందిన ప్రజలు ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలపై దేవుళ్ల విగ్రహాలను ఉంచి ఊరేగింపుగా అంబాజీపేట కూడలికి తీసుకొస్తారు. ఈ దృశ్యాలను తిలకించేందుకు వేలాది మంది ప్రజలు అర్ధరాత్రి వరకు వేచి చూస్తుంటారు. విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించిన దేవుళ్ల విగ్రహాలను వాహనాలపై అమర్చి ఆయా ప్రాంతాల నుంచి డప్పు వాయిద్యాలు, గరగ నృత్యాలు, చెడీ తాళింఖానాల నడుమ అత్యంత వైభవంగా స్థానిక చౌరస్తాకు తీసుకొస్తారు. ఈ ఉత్సవంలో చెడీ తాళింఖానా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

Published at : 06 Oct 2022 09:52 PM (IST) Tags: AP News Konaseema news Ambajipeta Vijaya betalaswami Vahana mahotsavam

సంబంధిత కథనాలు

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Christmas Tree: క్రిస్మస్‌ పండుగలో క్రిస్మస్‌ చెట్టును ఎందుకు ఉంచుతారో తెలుసా ?

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Subramanya Swamy Temple: 300 ఏళ్ల నాటి కుమార సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

SS Rajamouli: ఇందుకే రాజమౌళి నంబర్‌వన్ డైరెక్టర్ - శైలేష్, నానిలకి ఏం సలహా ఇచ్చారంటే?

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు