Benefits of Wearing Rudraksha: రుద్రాక్షలు ఎన్ని రకాలు? ఏ రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితాలుంటాయి?
Benefits of Wearing Rudraksha: సాధారణంగా రుద్రాక్షల్లో 1 నుంచి 21 ముఖాలు ఉంటాయి. 1 నుంచి 12 ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా?
Benefits of Wearing Rudraksha: రుద్రుని (శివుడు) అక్షుల నుంచి జాలువారిన నీటి బిందువులు భూమి మీద పడి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారాయని చెబుతారు. ఆ వృక్షాలకు కాసిన కాయలనే రుద్రాక్షలు అంటారు. హిందువులు రుద్రాక్షలను పవిత్రంగా భావిస్తారు.
రుద్రాక్షకంకణలసత్కరదండయుగ్మః
ఫాలాంతరాలధృతభస్మసితత్రిపుండ్రః
పంచాక్షరం పరిపఠన్ వరమంత్రరాజం
ధ్యాయన్ సదా పశుపతిం శరణం వ్రజేథాః
రుద్ర+అక్ష = రుద్రాక్ష దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపమని హిందువుల నమ్మకం. రుద్రాక్షల్లో మనం చాలా రకాలను చూసి ఉంటాం. సాధారణంగా రుద్రాక్షల్లో 1 నుంచి 21 ముఖాల వరకు ఉంటాయి. ప్రతి రుద్రాక్షకు సొంతంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వివిధ రకాల రుద్రాక్షలను వాటి శక్తి, లక్షణాల ఆధారంగా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. రుద్రాక్షల్లో ప్రతి ముఖానికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఉంది. 1 నుంచి 12 ముఖాల రుద్రాక్షల పరిచయం వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
రుద్రాక్ష విభిన్న ముఖాలు, వాటి ప్రయోజనాలు
1. ఏక ముఖ రుద్రాక్ష
దీనిని గౌరీ శంకర రుద్రాక్ష అని కూడా అంటారు. ఇది పరిపూర్ణత, శ్రేష్ఠతకు చిహ్నంగా విశ్వసిస్తారు. ఇది ధ్యానం, ఆధ్యాత్మిక వృద్ధిని ప్రోత్సహిస్తుంది.
2. ద్విముఖ రుద్రాక్ష
ఇది ఆర్థిక, సామాజిక సంబంధాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
3. త్రిముఖ రుద్రాక్ష
దీనిని అగ్ని రుద్రాక్ష అని కూడా పిలుస్తారు. శారీరక, మానసిక రుగ్మతలను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
4. చతుర్ముఖ రుద్రాక్ష
జ్ఞానం, శ్రేయస్సు, ధర్మం, మోక్షాన్ని సాధించడానికి ఇది శుభప్రదంగా పరిగణిస్తారు.
5. పంచముఖ రుద్రాక్ష
దీనిని కాలాగ్ని రుద్రాక్ష అని కూడా పిలుస్తారు. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల శత్రువుల నుంచి రక్షణ పొందడంలో సహాయపడుతుంది.
6. షణ్ముఖ రుద్రాక్ష
ఇది సంపద, సంతోషకరమైన కుటుంబం పొందడానికి ధరిస్తారు.
7. సప్త ముఖ రుద్రాక్ష
జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించడానికి దీనిని ధరిస్తారు.
8. అష్ట ముఖ రుద్రాక్ష
ఇది సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యం కోసం ధరిస్తారు.
9. నవ ముఖ రుద్రాక్ష
నేర్చుకోవడం, జ్ఞానం, ధర్మం ఆచరించడం కోసం ఈ రుద్రాక్షను ధరించడం శుభప్రదమని భావిస్తారు.
10. దశ ముఖ రుద్రాక్ష
ఇది ప్రశాంతత, సమతుల్యతను పెంచడానికి సహాయపడుతుంది, నాయకత్వ శక్తిని ఇస్తుంది.
Also Read : శివుడి చిహ్నాల్లో దాగిన సృష్టి రహస్యాలివే - నెలవంక దేన్ని సూచిస్తుందంటే..
11. ఏకాదశ ముఖ రుద్రాక్ష
దీనిని ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల, విశ్వాసం కోసం ధరిస్తారు.
12. ద్వాదశ ముఖ రుద్రాక్ష
ఇది సంపద, శ్రేయస్సు,ఆరోగ్యాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
రుద్రాక్ష ధరించడం వల్ల మనకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఇష్టానుసారం రుద్రాక్షను ధరించకూడదు. రుద్రాక్ష ధరించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలు, ఆచారాల ప్రకారమే రుద్రాక్ష ధరించాలి. అప్పుడే మీరు ఆ రుద్రాక్ష ధారణ ప్రయోజనాలను పొందుతారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.