By: ABP Desam | Updated at : 22 May 2023 09:39 AM (IST)
రోడ్డుపై డబ్బులు దొరికితే శుభమా? అశుభమా..? (Representational Image/freepik)
Money Found On Road: మీరు ఎక్కడికో వెళ్తున్నప్పుడు చాలా సార్లు మీకు రోడ్డుపై డబ్బు దొరికి ఉండవచ్చు. ఆ డబ్బు నాణేలు లేదా నోట్ల రూపంలో ఉండవచ్చు. అటువంటి పరిస్థితిలో, ఈ డబ్బును ఏమి చేయాలనే విషయంలో చాలా మంది మనస్సులో గందరగోళం తలెత్తుతుంది. కొందరు దానిని తీసుకొని తమ వద్ద ఉంచుకుంటారు, కొందరు పేదలకు ఇస్తారు లేదా ఆలయానికి విరాళంగా ఇస్తారు. అయితే రోడ్డుపై పడి ఉన్న డబ్బును తీసుకోవాలా, వద్దా అనే ప్రశ్న సర్వసాధారణం. రోడ్డుపై పడి ఉన్న డబ్బులు తీసుకోవడం మంచిదా..? కాదా?
దాదాపు ప్రతి ఒక్కరికి రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు డబ్బు దొరికే ఉంటుంది. ఏదైనా పని మీద రోడ్డుపై వెళ్తున్నప్పుడో లేదంటే ఫ్రెండ్స్ తో వెళ్తున్నప్పుడో రోడ్డుపై నాణేలు, కరెన్సీ నోట్లు దొరికిన సందర్భాలు చాలానే ఉంటాయి. రోడ్డు మీద డబ్బు దొరకడం ఒక ఊహించని అనుభవం. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడైనా, లేనప్పుడైనా డబ్బు దొరకడం సంతోషాన్ని ఇస్తుంది. రోడ్డుపై డబ్బు దొరకడం ఆధ్యాత్మికతతో ముడిపడి ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. డబ్బు దొరకడం ఎలాంటి ఫలితాన్ని ఇస్తోంది, అలా దొరకడం అదృష్టమా లేక దురదృష్టమో ఇప్పుడు తెలుసుకుందాం.
రోడ్డుపై డబ్బు కనిపిస్తే
రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూసినప్పుడు శుభం కలుగుతుంది. రోడ్డుపై పడి ఉన్న నాణెం మీకు కనిపిస్తే మీ పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఏదైనా పనిని పూర్తి శ్రమతో చేస్తే, మీరు ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు. చైనాలో అయితే, డబ్బు లేదా నాణేలు నగదు రూపంగా మాత్రమే భావించరు. వాటిని అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు.
పనిలో విజయం
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఏదైనా ముఖ్యమైన పని కోసం ఎక్కడికైనా వెళుతుండగా మార్గమధ్యంలో రోడ్డుపై పడి ఉన్న నాణెం లేదా నోటు కనిపిస్తే, మీరు చేయబోయే పనిలో తప్పకుండా విజయం సాధిస్తారని సంకేతంగా భావించాలి.
ఆర్థిక ప్రయోజనం
మీరు పని నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో డబ్బు పడి ఉంటే, మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారని సంకేతం.
ఖర్చు చేయవద్దు
మీరు రోడ్డుపై పడి ఉన్న డబ్బును చూస్తే దానిని ఆలయానికి విరాళంగా ఇవ్వండి లేదా మీరు దానిని మీ పర్సులో లేదా మీ ఇంట్లో ఎక్కడైనా భద్రపరచుకోవచ్చు, కానీ వాస్తుశాస్త్రం ప్రకారం దానిని ఖర్చు చేయకూడదు.
కొత్త పని ప్రారంభానికి సంకేతం
దారిలో పడిపోతున్న నాణేలను మీరు చూస్తే, త్వరలో మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చని, ఆ పని మీకు విజయాన్ని, ఆర్థిక లాభాన్ని తెస్తుందని సంకేతం.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక రహస్యం ఇదే
Chanakya Niti - చాణక్య నీతి: ఇలా సంపాదించే డబ్బు అస్సలు నిలవదు!
Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం
Pitru Dosha Symptoms: మీకు ఇలా జరుగుతుంటే పితృ దోషం ఉన్నట్టే !
Ganga Dussehra 2023: పది రకాల పాపాలను తొలగించే రోజు దశపాపహర దశమి ప్రత్యేకత ఇదే!
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
Samantha Chappal Cost : ద్యావుడా - పవన్ షూ కంటే సమంత చెప్పుల రేటు డబుల్!
Empty Stomach: ఖాళీ పొట్టతో ఈ ఆహారాలను తినకూడదు, అయినా చాలామంది తినేస్తున్నారు