Vastu Tips In Telugu: కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వాస్తు పూజ ఎందుకు చేయాలి - దీని వల్ల లాభమేంటి!
Vastu tips: ఇటీవలి కాలంలో గ్రహప్రవేశ కార్యక్రమాల్లో వాస్తు పూజలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వాస్తు పూజ ఎందుకు చేయాలి, దాని వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసా?
Vastu tips: సొంత ఇంటికి వెళ్లడం అనేది జీవితంలోని సంతోషకరమైన క్షణాలలో ఒకటి. గ్రహ ప్రవేశం విషయంలో మనకు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. కొత్తగా నిర్మించిన ఇంట్లోకి ప్రవేశించడానికి పండితులను సంప్రదించిన తర్వాత ఒక శుభ దినాన్ని ఎంచుకుంటారు. నిర్ణీత ముహూర్తంలో గృహప్రవేశం చేయడం వల్ల ఆ ఇంటి సభ్యులకు శుభం, శ్రేయస్సు చేకూరుతుందని నమ్మకం. కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి శుభ దినం మాత్రమే కాదు, గ్రహ ప్రవేశ పూజ కూడా నిర్వహిస్తారు. వాస్తు నిపుణులు ఈ వేడుకకు పవిత్రమైన మహూర్తాన్ని గణిస్తారు. వసంత పంచమి, అక్షయ తృతీయ, దసరా వంటి కొన్ని రోజులు గృహ ప్రవేశ పూజకు అనుకూలమైనవిగా భావిస్తారు. ఉత్తరాయణం, అధికమాసం, హోలీ వంటి కొన్ని అశుభ దినాలు కొత్తగా నిర్మించిన గృహ ప్రవేశానికి అశుభమైనవిగా పరిగణిస్తారు.
కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వాస్తు పూజ ఎందుకు చేయాలి?
గ్రహప్రవేశాన్ని కొన్ని కఠినమైన చర్యలతో సంతోషకరమైన కర్మతో చేయాలి. వేడుకకు ముందు ఇంటిని బాగా శుభ్రం చేసి, దేవతా విగ్రహాలు లేదా ఫొటోలను తూర్పు దిశలో ఉంచండి. కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మీ కుడి పాదం ముందుకు వేసి ఇంట్లోకి ప్రవేశించండి. మొత్తం గృహప్రవేశ ప్రక్రియ పూర్తయ్యేవరకూ ఇంటి చుట్టూ ఎటువంటి ఫర్నిచర్ తరలించకూడదు. గ్రహ ప్రవేశ వేడుక తర్వాత మొదటి మూడు రోజులు ఇంటిని ఖాళీగానే ఉంచాలి.
Also Read : వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందా? దీన్ని ఎలా పెంచాలి?
గ్రహ ప్రవేశానికి సిద్ధమైన తర్వాత వాస్తు పూజ, వాస్తు శాంతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రెండు దశలను సరిగ్గా పాటిస్తే ఇంట్లో ఐశ్వర్యం స్థిరపడుతుంది. పురాతన గ్రంధాల ప్రకారం, ఒక ఇల్లు ఐదు మూలకాలతో రూపొందుతుంది. సూర్యుడు, అగ్ని, నీరు, భూమి, గాలి.. ఈ మూలకాల మధ్య వాస్తు సమతుల్యతను సృష్టిస్తుంది. ఇంటి చుట్టూ ఆనందకరమైన వాతావరణాన్ని ఆవిష్కరిస్తుంది.
వాస్తు పూజ అనేది ఒక దైవికమైన ప్రక్రియ, దీనిలో ఆ నివాసం ప్రభువు, రక్షకుడు అయిన వాస్తు పురుషుని ఆశీర్వాదం కోసం పూజ చేస్తారు. ఈ పూజతో పంచభూతాలు, ప్రకృతి మాత, ఆయా దిక్కుల అధిష్ఠాన దేవతలను గౌరవిస్తారు.
వాస్తుపూజ ఎందుకు అవసరం
- కొత్తగా కొనుగోలు చేసిన లేదా ఇప్పటికే సొంతమైన భూమి వాస్తు ప్రకారం లేకపోతే వాస్తు పూజ ద్వారా ఆ దోషం పరిహారం అవుతుంది
- నిర్మాణ సమయంలో వాస్తు నియమాలు పాటించనప్పుడు
- పాత ఇంటిని కొనుగోలు చేసినప్పుడు
- ఇల్లు లేదా భవనాన్ని పునరుద్ధరించేటప్పుడు
- మీరు 5 సంవత్సరాలకు పైగా ఒకే ఇంట్లో నివసిస్తున్నప్పటికీ, దాని సానుకూల శక్తిని కొనసాగించడానికి
ఇలాంటి దోషాలు తొలగి సానుకూల శక్తికోసం వాస్తు పూజ చేయాలి.
ఆర్థిక వృద్ధి కోసం
వాస్తు పూజ ఏదైనా నిర్మాణాన్ని లేదా నిర్మాణ స్థలాన్ని శుభ్రపరుస్తుంది. అక్కడ ప్రతికూల శక్తి నుండి పర్యావరణాన్ని విముక్తి చేస్తుంది. సానుకూల శక్తులలో ఏవైనా అడ్డంకులు.. వ్యాపార అభివృద్ధిని, ఆర్థిక పరిస్థితులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి అటువంటి ప్రతికూల శక్తుల నుంచి విముక్తి పొందేందుకు వాస్తు పూజ చాలా ముఖ్యం. ఈ పూజ ఏదైనా వ్యాపారం ఆర్థిక అభివృద్ధిని పెంచడంలో సహాయపడుతుంది. ఏదైనా నివాస స్థలంలో వాస్తు శాంతి ప్రాముఖ్యతను ఇది ఖచ్చితంగా వివరిస్తుంది.
ఇంట్లో సానుకూల శక్తి కోసం
ప్రతికూల శక్తితో నిండిన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సర్వసాధారణం. వారికి అభివృద్ధి సమస్యలు చుట్టుముట్టి, సామరస్య సంబంధాలు ఉండవు. కాబట్టి, ఈ వాస్తు పూజ ద్వారా ఇంటిని శుభ్రపరచడం వల్ల చుట్టూ సానుకూలతను కొనసాగించడంలో సహాయపడుతుంది. వాస్తు సూత్రాలు పాటించని భవనంలో నివసించడం వల్ల ధన నష్టం, మానసిక, శారీరక సమస్యలతో పాటు కొన్నిసార్లు అకాల మరణం కూడా సంభవిస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం, వేర్వేరు దేవతలు వేర్వేరు దిశలను పాలిస్తారు, ఇది ఇంటిలోని ఆయా రంగాలను పరిపాలిస్తుంది. ఉదాహరణకు, అగ్ని దేవుడు (అగ్ని మూలకం) ఆగ్నేయ దిశలో పాలిస్తాడు. ఇక్కడ వంటగదిని నిర్మిస్తే ఇంట్లోని వారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా పూజా గదికి ఈశాన్య దిశ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఇల్లు, కార్యాలయంలోని వివిధ ప్రాంతాలు వాస్తు శాస్త్ర సూత్రాలను అనుసరిస్తే, ప్రకృతి శక్తి అప్రయత్నంగానే మనకు సహకరిస్తుంది.
Also Read : వీధిపోటు ఈ దిశగా ఉంటే ఆస్తి నష్టం, కోర్టు కేసులు - ఆ 4 దిశల్లో ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం!
వాస్తు దోష పరిష్కారం
వాస్తు దోషాన్ని సరిచేయడానికి అద్దాల సర్దుబాటు, ఫర్నీచర్ అమరిక, అక్వేరియంలు, గుర్రపుడెక్క, పిరమిడ్ యంత్రాలను ఉంచడం వంటి చర్యలు ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తు శాస్త్రం మనిషిని ప్రకృతితో కలుపుతుంది, వాస్తు దోషంగా భావించే నిర్మాణ వ్యత్యాసాలను కొన్ని సాధారణ వాస్తు చిట్కాలను అనుసరించడం ద్వారా అధిగమించవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.