kala sarpa dosha: మీకు ఇలా జరిగితే కాలసర్ప దోషం ఉన్నట్టే!
Kala Sarpa Dosha: కాలసర్ప దోషం అత్యంత ప్రభావవంతమైన దోషం. కాలసర్ప దోషం ఉన్నవారు తమ జీవితంలో ఒకదాని తర్వాత ఒకటిగా అనేక సమస్యలను ఎదుర్కొంటారు. కాలసర్ప దోషం ఉంటే ఎలాంటి కలలు వస్తాయి..? దోష నివారణలు ఏమిటి?
Kala Sarpa Dosha: సర్పమునకు రాహువు తల , కేతువు తోక అవుతుంది. జాతకంలోని జన్మ కుండలిలో రాహు, కేతువుల మధ్య మిగిలిన అన్ని గ్రహాలు వస్తే దానిని 'కాలసర్ప యోగం' అంటారు.
అగ్రే రాహు: రధౌ కేతు: మధ్యే షడ్ర్గహో
యది కాలసర్పాఖ్య యోగోయం నృపానాం సమరం ధృవం
అగ్రే కేతు: రధౌరాహు: గర్భస్తే గ్రహసప్తకే
యది అపసవ్యకాలసర్పాఖ్య దోషోయం నృపాణాo సమరం భవేత్
కాలసర్ప దోషం: రాహువు - రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని- కేతువు. అంటే రాహు, కేతువుల మధ్య మిగిలిన గ్రహాలు ఉంటాయి.
ఫలితం: కుటుంబ సమస్యలు, దీర్ఘా రోగాలు.
అపసవ్య కాలసర్ప దోషం: కేతువు - రాహువు మధ్య మిగలిన ఏడు గ్రహాలూ రావడం.
ఒక వ్యక్తికి చెడు సమయం కొనసాగుతున్నప్పుడు, అతను ఏ పనిలోనూ విజయం సాధించలేడు. ఈ కారణంగా అతనిలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా వ్యాధులు అతనిని చుట్టుముడతాయి. మరోవైపు, జ్యోతిష్యశాస్త్రంలో, జాతకంలో దోషాలు వీటన్నింటికీ కారణమని చెబుతారు. వాటిలో కాలసర్ప దోషం చాలా ముఖ్యమైనది. కాలసర్ప దోషం వల్ల మనిషికి ఎలాంటి శుభ ఫలితాలు లభించవు. అయితే కొన్ని సార్లు కాలసర్ప దోషం కూడా కొందరి జాతకంలో మంచి ఫలితాలనిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలసర్ప దోషం ఉంటే మనిషికి ఎలాంటి కలలు వస్తాయో తెలుసా?
కాలసర్ప దోషం ఉంటే, ఈ కలలు వస్తాయి
1. నిద్రపోతున్నప్పుడు పాములు కనపడటం లేదా పాము శరీరం పైకి ఎక్కినట్లు కలలు కన్నట్లయితే మీ జాతకంలో కాల సర్ప దోషం ఉందని అర్థం చేసుకోవాలి.
2. ఒక వ్యక్తికి కలలో ఒక జంట పాములు తన చేతికి లేదా కాలికి చుట్టుకున్నట్లు కలలో వచ్చినా, పాము కాటుకు గురైనట్లు కల వచ్చినా అది కాలసర్ప దోషానికి సంకేతం.
3. ఒక వ్యక్తికి కలలో తేలియాడే పాము కనిపిస్తే, అది కాలసర్ప దోషానికి సంకేతం. అంతేకాకుండా, ఒక వ్యక్తి తన కలలో పాము ఎగురుతున్నట్లు చూసినట్లయితే, అలాంటి కల కాలసర్ప దోషాన్ని కూడా సూచిస్తుంది.
4. ఒక వ్యక్తి తన కలలో లెక్కలేనన్ని పాములు కనిపిస్తే, అది ఘోరమైన కాలసర్ప దోషానికి సంకేతం. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి తన అధిష్టాన దేవతను పూజించాలి. అంటే ఇంటి దేవుడిని ఆ వ్యక్తి ఎక్కువగా పూజించాలి, స్మరించుకోవాలి.
కాల సర్పదోష నివారణ చర్యలు
1. జాతకంలో కాలసర్ప దోషం ఉన్న వ్యక్తులు ప్రతిరోజూ శ్రీమహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామాన్ని స్మరించండి.
2. కాలసర్ప దోషాన్ని నివారించడానికి, గోమేధికం లేదా వెండితో చేసిన పాము ఆకారపు ఉంగరాన్ని ధరించాలి.
3. కాలసర్ప దోషంతో బాధపడేవారు శనివారం నాడు ప్రవహించే నీటిలో కొంచెం బొగ్గును చల్లాలి. ఇది కాలసర్ప దోషం అశుభ ప్రభావాన్ని ఇస్తుంది. ఈ పరిహారంతో, ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు తగ్గుతాయి.
4. కొబ్బరికాయ, బెల్లాన్ని పారే నీటిలో వేయడం వల్ల కాలసర్ప దోషాలు తగ్గుతాయి.
మీకు కూడా పైన చెప్పినట్లుగా కలలో పాములు కనిపిస్తే లేదా పదే పదే పాములు కలలో కనిపిస్తుంటే పండితుల సలహా తీసుకోవడం మంచిది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.