Dreams : కలలో ఈ 5 వస్తువులు కనిపిస్తే దరిద్రం మిమ్మల్ని వెంటాడినట్లే
Dreams : స్వప్న శాస్త్రం ప్రకారం కొన్ని రకాల కలలు వచ్చినప్పుడు మీకు త్వరలోనే దురదృష్టం వెంట రాబోతుందని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఆ కలల గురించి తెలుసుకుందాం.
Dreams : కలలు అనేవి ప్రతి ఒక్కరికి నిద్రలో వచ్చే దృశ్యాలు. అయితే ఈ కలలు అనేది మన మెదడులో కలిగే ఆలోచనలకు ప్రతిరూపమే అని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉంటారు. అయితే చాలామంది కలల్లో విచిత్రమైన ఘటనలను చూస్తూ ఉంటారు. అవి కళ్ళముందే కదలాడుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. . కొన్నిసార్లు కలల్లో పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి..ఆ కలలు వచ్చినప్పుడు మనిషి నిద్రలో నుంచి లేచి భయపడతాడు. అయితే ఈ కలలను ఆధారంగా చేసుకుని స్వప్న శాస్త్రం కూడా ఒకటి ఉంది. కొన్ని కలలు సూచనలు శుభ శకునాలు అయితే, మరికొన్ని శకునాలు దురదృష్టం రాకను సూచిస్తాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. అయితే మీ జీవితంలో దురదృష్టం త్వరలో మీ తలుపు తట్టబోతోందని ఎలాంటి కలలు సూచిస్తాయో తెలుసుకుందాం.
పగిలిన అద్దం
పగిలిన అద్దం కలలో కనిపిస్తే దురదృష్టానికి సూచనగా చెబుతారు. ఒక వ్యక్తి ఆత్మ అద్దంలో ప్రతిబింబిస్తుందని నమ్ముతారు. పగిలిన అద్దం మీ కలలో కనిపిాంచినట్లయితే, మీకు త్వరలోనే దురదృష్టం వెంటాడుతుందని అర్థం. ముఖ్యంగా వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ కలహాలు కూడా మిమ్మల్ని చికాకు పెడతాయి. పగిలిన అద్దం మీ కలలో కనిపించినట్లయితే మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
చిరిగిన బట్టలు
చిరిగిన బట్టలు, వేలాడుతున్న దారాలు కనుక మీ కలలో వచ్చినట్లయితే ఇది కూడా దురదృష్టానికి సూచనగా పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా స్వప్న శాస్త్రం ప్రకారం చిరిగిన బట్టలు అనేవి దురదృష్టానికి చిహ్నం. కలలో కనక మీరు చిరిగిన బట్టలను చూసినట్లయితే త్వరలోనే మీరు భారీగా ఆర్థికంగా నష్టపోతున్నారు అని అర్థం. అదే విధంగా వేలాడుతున్న దారాలు కూడా దురదృష్టానికి చిహ్నంగా స్వప్న శాస్త్రం చెబుతోంది. ఒకవేళ మీరు కలలో చిరిగిన బట్టలు వేసుకున్న వ్యక్తులను చూసినట్లయితే మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం.
తుఫాను సముద్రం, జలపాతం
కలలో మీరు తుఫాను కానీ జలపాతం కానీ చూసినట్లయితే, మీరు మానసిక ఆందోళనతో ఉన్నారు అని అర్థం. స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో తుఫాను సముద్రం వచ్చినట్లయితే త్వరలోనే మీ జీవితంలో పెద్ద తుఫాను రాబోతోందని అర్థం. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అలజడలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యాపారంలో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మీ కలలో తుఫాను సముద్రం, లేదా భారీ జలపాతం కనుక వచ్చినట్లయితే వెంటనే జాగ్రత్త పడాలి అని అర్థం.
గందరగోళం లేదా తప్పిపోయిన మార్గం
అడవిలో తప్పిపోయినట్లు, లేదా ఎడారిలో మార్గం కనిపించినట్లు కనుక మీకు కల వచ్చినట్లయితే త్వరలోనే మీకు దురదృష్టం రాబోతోందని అర్థం. ముఖ్యంగా మీరు కలలో ఏదైనా ఒక అడవిలో చిక్కుకుపోయి దారి తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు అంటే త్వరలోనే మీరు ఆందోళనకు గురవుతున్నారు అని అర్థం. . అలాగే ఆర్థిక నష్టానికి కూడా ఇది ఒక సూచనగా చెప్పవచ్చు. ఇటువంటి కలలు కన్నట్లయితే మీరు వ్యాపారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అర్థం.
పళ్లు ఊడిపోవడం
కలలో మీరు పళ్ళు ఊడిపోయిన వ్యక్తిని గాని, మీ పళ్ళు ఊడిపోయినట్లుగానే కలకన్నట్లయితే దురదృష్టానికి చిహ్నంగా చెప్పవచ్చు. ముఖ్యంగా దంతాల సమస్యలు ఉన్నట్టు కలవచ్చినట్లయితే మీరు వ్యాపారంలో నష్టపోతున్నారు అని అర్థం. అందుకే ఇలాంటి కలకన్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Also Read : Friends in Dreams: కలలో స్నేహితులు కనిపిస్తే శుభమా? అశుభమా?
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.