Horoscope Today 21June 2022: ఈ రాశివారికి అనుకోని ధనం చేతికందుతుంది,మిగిలిన రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
horoscope today : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జూన్ 21 మంగళవారం రాశిఫలాలు (Horoscope Today 21-06-2022)
మేషం
ఈ రోజు ఉద్యోగులు ప్రశాంతంగా ఉంటారు.వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. పోటీపరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. పసుపు, తెలుపు రంగులు మీకు కలిసొస్తాయి. సుందరకాండ చదవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు.
వృషభం
ఈ రోజు రియల్ ఎస్టేట్,బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు లేదా ప్రమోషన్ కి సంబంధించిన సమచారం పొందుతారు. తెలుపు, నీలం మీకు కలిసొచ్చే రంగులు.
మిథునం
ఈ రాశివారు ఈ రోజు అత్యవసరం అయితే తప్ప ప్రయాణం చేయవద్దు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి. నీలం, ఊదా రంగులు మీకు మంచివి.
కర్కాటకం
ఈ రోజంతా ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. ఆంజనేయుడిని పూజించడం వల్ల మీకు మనశ్సాంతి లభిస్తుంది . పని ఒత్తిడి తగ్గించుకోండి. కుటుంబానికి సమయం కేటాయించండి. ఆధ్యాత్మిక పుస్తకాలను దానం చేయండి. ఎరుపు, పసుపు మీకు మంచి రంగులు.
Also Read: ఇక్కడ దేవుడికి పేడ పూస్తే వర్షాలు కురుస్తాయి, ఇంకెన్నో మహిమలున్న ఆలయం
సింహం
ఈ రోజు వ్యాపార ప్రణాళికలు వాయిదా వేసుకోవడం మంచిది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి అంత మంచిది కాదు. ఉద్యోగులు పని విషయంలో శ్రద్ధ చూపించాలి. విద్యార్థులు కష్టపడితే కానీ ఫలితాలు అందుకోలేరు. పసుపు, ఆకుపచ్చ రంగులు మీకు మంచివి.
కన్యా
ఉద్యోగులు ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారం బాగా సాగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇదే మంచి సమయం. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఎర్రటి పూలతో ఆంజనేయుడిని పూజిస్తే గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకాశం, ఊదా రంగులు శుభప్రదం.
తుల
ఉద్యోగం విషయంలో కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు. నిరుద్యోగులు మరింత స్ట్రాంగ్ గా ప్రయత్నించాలి. వ్యాపారంలో పెద్దగా లాభ నష్టాలేమీ ఉండవు. స్నేహితుల మద్దతు మీకు లభిస్తుంది. ఎక్కువగా మాట్లాడకండి..వేరేవారి మాటల్లో తలదూర్చకండి. ఆకుపచ్చ, ఊదా రంగులు మీకు మంచివి.
వృశ్చికం
పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఈ రోజు రాజకీయ నాయకులకు విజయవంతమైన రోజు అవుతుంది. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. వారినుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి.వ్యాపారం బాగానే సాగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలొస్తాయి. తెలుపు,నారింజ రంగులు శుభప్రదం.
Also Read: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా
ధనుస్సు
ఈ రోజు ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులు శుభవార్త వింటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందం కుదుర్చుకునేందుకు, కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు ఇదే అనుకూలమైన రోజు. ఉద్యోగులకు సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. ఆకుపచ్చ, నీలం మీకు మంచి రంగులు.
మకరం
ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయకండి. విద్యలో పురోగతి ఉంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఆరెంజ్, ఆకాశం రంగులు మీకు కలిసొస్తాయి.
కుంభం
ఆరోగ్యం విషయంలో టెన్షన్ ఉంటుంది. ఉద్యోగంలో కొత్త పనులు ప్రారంభమవుతాయి. వ్యాపారం బాగా సాగుతుంది. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆకుపచ్చ , ఎరుపు రంగులు మీకు మంచివి. శ్రీ మహావిష్ణువుని పూజించండి.
మీనం
ఈ రాశిలో బృహస్పతి, చంద్రుడు శుభప్రదుడు.ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది. బుధుడు,శుక్రుల ప్రభావం శుభప్రదం. నిలిచిపోయిన డబ్బు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలుంటాయి. పసుపు, ఎరుపు మీకు శుభప్రదం.
Also Read: అనారోగ్యం, శనిబాధలు తొలగిపోవాలంటే మంగళవారం ఇలా చేయండి