By: ABP Desam | Updated at : 10 May 2022 05:26 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మే 10 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. ఆలయాలను సందర్శిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడంతో ఉత్సాహంగా ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనసులో ఆందోళన ఉంటుంది. ఉద్యోగస్తులు తమ పనుల పట్ల అంకితభావంతో ఉంటారు. కార్యాలయంలోని అడ్డంకులు తొలగిపోతాయి.
వృషభం
ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి వివాదాలు రావొచ్చు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగ పరిస్థితి మీకు చాలా అననుకూలంగా ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. తెలివైన వ్యక్తుల దగ్గర మీ అతితెలివి ప్రదర్శించకండి. విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మిథునం
అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. వృత్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్లాన్ చేయవచ్చు. ఈరోజు మీకు కలిసొచ్చే రోజు. కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. బంధువులను కలుస్తారు.
Also Read: ఈ రాశివారు ఈ వారం ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు, ఈ వారం మీ రాశిఫలితం తెలుసుకోండి
కర్కాటకం
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్లు లభిస్తాయి. ఎవరి మాటల్లో తలదూర్చవద్దు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. కెరీర్‌లో ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.
సింహం
కర్మాగారాల్లో పనిచేసేవారు జాగ్రత్త. రిస్క్ తీసుకోకండి. బాధ్యతలను సులభంగా నిర్వర్తిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. అనుభవజ్ఞుల నుంచి మార్గదర్శకత్వం అందుకుంటారు. మీ ప్రతిభను నిరూపించుకునేందుకు మంచి సమయం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
కన్యా
పనిలో సహోద్యోగులు సహకరిస్తారు.కుటుంబ సభ్యులతో సామరస్యం ఉంటుంది. స్నేహితుల నుంచి పెద్దగా సహాయం ఆశించవద్దు. విచారకరమైన వార్తలు వినాల్సి ఉంటుంది. ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఈ రోజు మీరు కొన్ని అనవసరమైన పనిలో Also Read: ఈ ఫలం ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టేనట
తులా
అధిక పని వల్ల అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ రోజు మీరు కెరీర్ గురించి ఆహ్లాదకరమైన సమాచారాన్ని పొందుతారు. కొత్త ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఉద్యోగంలో అనుకూలమైన నియామకం పొందడం పట్ల మీరు ఉత్సాహంగా ఉంటారు. మీరు ఇంటికి అవసరమైన కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల అనుభవాల నుంచి ప్రయోజనం పొందుతారు.
వృశ్చికం
మీ స్నేహితులతో కలిసి షికారు వెళ్తారు. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ రోజు ఒక ముఖ్యమైన రోజు అనిపిస్తుంది. మీ సృజనాత్మకతతో అందర్నీ మెప్పిస్తారు. మీ బలహీనతలను అధిగమించడానికి ప్రయత్నించండి. జాగ్రత్తగా ప్రయాణం చేయండి.
ధనుస్సు
ఈ రోజు మీరు కష్టపడి చేసినా ఫలాలు పొందలేరు. ఏ సమస్య వచ్చినా ఆందోళన చెందుతారు. ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. పిల్లల పట్ల మీ ప్రవర్తన బావుంటుంది. ఒకరి సలహాను అనుసరించడానికి తొందరపడకండి. మీ విలువైన వస్తువులను జాగ్రత్త చేయండి.
మకరం
ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో అలసత్వం వహించవద్దు. ఈరోజు క్రెడిట్ లావాదేవీలు అస్సలు చేయకండి. పిల్లల కార్యకలాపాలు, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీ సమస్యను సన్నిహితులతో పంచుకుంటారు. ఒకరిని సంతోషపరిచేలా నటించవద్దు. మీపై ప్రతికూలత పెరుగుతుంది.
Also Read: సర్ప దోషాలన్నీ తొలగించే ఆలయం, ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే తెరిచి ఉంటుంది
కుంభం
మిత్రులతో ఫలవంతమైన చర్చలు ఉంటాయి. బంధువుల నుంచి కాల్ రావొచ్చు. కాల్ రావచ్చు. భవిష్యత్ ప్రాజెక్ట్ కోసం నిధులు సేకరిస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు.పెండింగ్ మనీ అందుతుంది. ఉద్యోగంలో లాభం ఉంటుంది. పదోన్నతులు, బదిలీలు జరగవచ్చు.
మీనం
శత్రువుల అడ్డంకుల వల్ల పనులు దెబ్బతింటాయి. మనస్సును ఏకాగ్రతగా ఉంచడానికి ప్రయత్నించండి. కొన్ని పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయొద్దు. కోపం తగ్గించుకోండి. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. విదేశాల్లో ఉంటున్న బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.
Today Panchang 22 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, భానుసప్తమి ప్రత్యేక శ్లోకం
Horoscope Today 22 May 2022: ఈ రాశివారు దూకుడు తగ్గించుకోవాల్సిందే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 22 May 2022: భానుసప్తమి ఈ రాశులవారికి చాలా ప్రత్యేకం, మీరున్నారా ఇందులో ఇక్కడె తెలుసుకోండి
Panakala Swamy Temple :ప్రసాదం తాగే స్వామి, కష్టాలు తీరేందుకు అమృతాన్నిచ్చే దైవం
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా
Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?
IND vs SA, T20 Series: టీ20 కెప్టెన్గా కేఎల్ రాహుల్ - సఫారీ సిరీస్‌కు జట్టు ఎంపిక
Minister Harish Rao : పెట్రోల్, డీజిల్ సుంకాల తగ్గింపుపై స్పందించిన మంత్రి హరీశ్ రావు, ఏమన్నారంటే?