Horoscope Today 25th March 2022: ఈ రోజు ఈరాశుల వారిపై మహాలక్ష్మి ఆశీస్సులుంటాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 మార్చి 25 రాశిఫలాలు
మేషం
గృహావసరాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. సన్నిహితుల సలహాలను పాటించండి.ఎవరినీ దుర్భాషలాడవద్దు.దూకుడుగా వ్యవహరించవద్దు. వివాహ సంబంధ విషయాలు పరిష్కారమవుతాయి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. కార్యాలయంలో శుభవార్త వింటారు.
వృషభం
తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కువ నీళ్లు తాగండి. వైవాహిక సంబంధాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.ఒకేసారి రెండు మూడు పనుల్లో వేలు పెట్టకండి. పెద్ద బాధ్యతను నిర్వర్తించలేకపోవడం వల్ల ఒత్తిడికి గురవుతారు.
మిథునం
వ్యాపారంలో లాభాలొస్తాయి.తలపెట్టిన ప్రతి పనిలోనూ మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు.కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉన్నతాధికారుల నుంచి సహాయం పొందుతారు. పెద్ద లక్ష్యాన్ని సాధించాలనే కోరిక ఈరోజు నెరవేరుతుంది. రోజు ప్రారంభం అద్భుతంగా ఉంటుంది.
కర్కాటకం
మిత్రులను కలుసుకుంటారు. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడతారు.గొంతు నొప్పితో బాధపడతారు. ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి రావొచ్చు. వ్యాపారంలో మందగమనం ఉంటుంది.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
సింహం
శ్రమాధిక్యత వల్ల అలసిపోతారు.త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.ప్రేమ వ్యవహారాలు అంత అనుకూలంగా ఉండవు. వివాహ ప్రతిపాదనలతో తొందరపడకండి. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయి.
కన్య
చర్మ సమస్యలు రావొచ్చు. పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించండి. మీ జీవిత భాగస్వామితో ఆలోచనలను పంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. టెక్నాలజీని ఉపయోగించడం నేర్చుకోండి.ఈ రోజు బంధువులు మీ ఇంటికి రావొచ్చు.
తుల
స్నేహితులను కలుస్తారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుభవజ్ఞులైన వ్యక్తులతో చర్చిస్తారు. మీ ప్రతిభను అంతా మెచ్చుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశసంలు అందుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం
మీరు ఉద్యోగంలో మార్పును అంగీకరించాల్సి ఉంటుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు చేసుకోవచ్చు. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాయామాన్ని దినచర్యలో భాగం చేయండి. గుర్తు తెలియని వ్యక్తితో వాగ్వాదం జరగొచ్చు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ధనుస్సు
కుటుంబ సభ్యులతో అనవసర వివాదం ఉండొచ్చు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తారు. పూర్వీకుల విషయాల్లో మీరు పైచేయి సాధిస్తారు. ప్రియమైన వ్యక్తి ప్రవర్తన వల్ల మీరు బాధపడతారు. అనవసర కార్యకలాపాలకు దూరంగా ఉండండి.
మకరం
మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు.ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. బంధువుల కోసం ఖర్చు చేయాల్సిన అవసరం రావొచ్చు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చండి. అసిడిటీ సమస్యతో ఇబ్బంది పడతారు. పిల్లల వైపు నుంచి విజయం సాధిస్తారు.
కుంభం
మీరు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు తక్కువ శ్రమతో విజయం సాధిస్తారు. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. ప్రయాణానికి అనుకూల సమయం. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి.
మీనం
వ్యాపారంలో లాభాలను పొందవచ్చు. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. తలపెట్టిన పని పూర్తిచేయడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. ఎప్పటినుంచో చేతికందాల్సిన మొత్తం అందుతుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. రాజకీయ వ్యక్తులను కలుస్తారు