Horoscope Today 19th March 2022: ఈ రాశి దంపతుల మధ్య అయోమయ పరిస్థితులుంటాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
మార్చి 19 శనివారం రాశిఫలాలు
మేషం
కోపం ప్రభావం మీ పనిపై పడుతుంది. మీ స్నేహితుల విషయంలో మంచిగా ప్రవర్తించండి. వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు. న్యాయపరమైన విషయాలు పరిష్కారమవుతాయి.మీ వృత్తికి సంబంధించిన పనిలో విజయం సాధిస్తారు. ఎవరికీ సలహా ఇవ్వకండి.
వృషభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. ఇతరుల విషయాల్లో బలవంతంగా జోక్యం చేసుకోకండి. బంధువులు రావొచ్చు. మీరు ప్రేమ వ్యవహారాలను ఆనందిస్తారు. కుటుంబ సభ్యులతో ఓ సీరియస్ ఇష్యూపై మాట్లాడతారు. కష్టపడి పనిచేస్తేనే ఫలితం అందుకుంటారు.
మిథునం
తల్లిదండ్రులు, పెద్దల ఆశీస్సులు పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. ఆఫీసులో బాగా రాణిస్తారు. అధిక పని కారణంగా, మీరు పిల్లలకి పూర్తి సమయం ఇవ్వలేరు. దంపతుల మధ్య అయోమయ పరిస్థితులు నెలకొంటాయి.
Also Read: వాళ్లకు కళ్లు లేవు, సమ్మక్క సారలమ్మ ఇష్యూపై చిన జీయర్ రియాక్షన్
కర్కాటకం
ఉద్యోగుల మధ్య సాన్నిహిత్యం ఉంటుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త. దగ్గర్లోని ప్రదేశానికి వెళ్తారు. ఒంటరితనం మంచి అనుభూతిని ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. షుగర్ పేషెంట్లు జాగ్రత్త.
సింహం
వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. రాబోయే రోజుల్లో అప్రమత్తంగా ఉండండి. కొన్ని సమస్యల వల్ల ఇబ్బంది ఉంటుంది. ఈ రోజు ఒత్తిడికి లోనవుతారు. ఎవరి మాటల్లోనూ జోక్యం చేసుకోవద్దు. అనవసర వాగ్ధానాలు చేయొద్దు. ఉద్యోగులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. కెరీర్‌లో మంచి అవకాశాలు ఉంటాయి.
కన్య
వ్యాపారంలో భాగస్వాముల మధ్య సమన్వయ లోపాన్ని అధిగమిస్తారు. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న ఓ పని పూర్తవుతుంది. న్యాయపరమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి. వచ్చిపోయే సమస్యల గురించి ఎక్కువ ఆలోచించకండి. చికాకు తగ్గించుకోండి.
తుల
ఈరోజంతా మీకు శుభసమయమే. అతి విశ్వాసం మంచిది కాదు. కోపంతో ఎవరితోనూ మాట్లాడవద్దు. పోటీ పరీక్షల్లో ఊహించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. సోమరితనం వీడండి. రాజకీయ వ్యక్తులకు వివాద సూచనలున్నాయి జాగ్రత్త. మీ మాటలు,అభిప్రాయాలు ఎవ్వరిపైనా రుద్దకండి.
వృశ్చికం
ఈరోజు మీరు ప్రయాణాలను ఎక్కువగా ఇష్టపడతారు. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది. ప్రియమైన వారు మీ కెరీర్‌లో ముందుకు సాగడానికి మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. మీ పిల్లల ప్రవర్తన మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. ఆర్థిక సమస్య తీసుకుంది.
ధనుస్సు
ఈ రోజు మీరు సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్యూలకు వెళ్లేందుకు మంచిరోజు. ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఇంటి పనులకు ఖర్చు చేస్తారు.
Also Read: పాఠశాలలో ఇక భగవద్గీత తప్పనిసరి- ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
మకరం
ఖర్చులను అదుపులో ఉంచుకోగలుగుతారు. వైవాహిక బంధం మధురంగా ఉంటుంది. ఒకరి మాటల వల్ల బాధపడతారు. ప్రయాణాలు వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. షేర్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులు కలిసొస్తాయి. మీరు కొన్ని విచారకరమైన వార్తల వల్ల ఇబ్బందిపడతారు.
కుంభం
ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు, ధనం దూబరా తగ్గించండి. తలపెట్టిన కొన్ని పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి.. కష్టపడితే ఫలితం సాధించవచ్చు. అనారోగ్య సూచనలున్నాయి. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఈ రోజు కొత్త పనులు ప్రారంభించకండి.
మీనం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వూలో విజయం సాధిస్తారు. ప్రేమ సంబంధాలు వివాహ సంబంధాలకు దారితీస్తాయి. చాలా రోజులుగా చేతికి అందాల్సిన డబ్బు అందుతుంది. తెలియని వ్యక్తులను నమ్మొద్దు.