అన్వేషించండి

Horoscope Today 10th March 2022: ఈ రాశివారు గతంలో చేసిన ఓ తప్పుని తలుచుకుని బాధపడతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

మార్చి 10 గురువారం రాశిఫలాలు

మేషరాశి
మీరు కొత్త వ్యాపారం కోసం రుణం తీసుకోవలసి రావొచ్చు. వేరొకరి పట్ల ఆకర్షణ వైవాహిక సంబంధాలలో ఇబ్బందులను సృష్టిస్తుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. తల్లిదండ్రులతో వివాదాలకు దూరంగా ఉండండి. కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి తగ్గుతుంది. 

వృషభం
ఉద్యోగులకు ఈ రోజంతా శుభసమయమే. ఖర్చులు తగ్గించి పొదుపుపై దృష్ట సారించండి. శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. ఇంటి పనులు పెరుగుతాయి. ఒక వ్యక్తితో అనవసరమైన గొడవలు జరగుతాయి. ఎవరి పనుల్లో జోక్యం చేసుకోకండి.

మిథునం
ఈ రోజు మీరు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసిన ఓ తప్పుని తలుచుకుని బాధపడతారు.  రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. ప్రభుత్వ వ్యవహారాలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామిని నిర్లక్ష్యం చేయవద్దు. మీ స్నేహితులతో మంచి సంబంధాలు కొనసాగించండి.

కర్కాటకం
వ్యాపారంలో కొత్త ప్రయత్నాలు చేస్తారు. గుర్తుతెలియని వ్యక్తుల వల్ల నష్టం జరగవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. కోర్టు కేసుల సమస్య తొలగిపోతుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన మొత్తం చేతికందుతుంది. అధికారులు మీ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

Also Read: సాష్టాంగ నమస్కారం స్త్రీలు ఎందుకు చేయకూడదు
సింహం
ఆర్థిక పరిస్థితి విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మికత పట్ల మక్కువ ఉంటుంది.
ఆఫీసులో ఎవరితోనూ వివాదం పెట్టుకోవద్దు. మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. స్నేహితుల మద్దతుతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. రాజకీయ నాయకులు లాభపడతారు.

కన్య 
చాలారోజులుగా నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగాలు మారే ఆలోచన చేస్తారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఆందోళనకు గురవుతారు. మీ పని విషయంలో జాగ్రత్తగా ఉండండి. సమయానికి అనుగుణంగా మీ ప్రవర్తనను మార్చుకోండి. వాదనలు పెట్టుకోవద్దు.

తులా
మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. రక్తపోటు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఏదో ఒక విషయంలో ఒత్తిడికి లోనవుతారు. ఎవ్పరికీ అప్పు ఇవ్వొద్దు. అడగకుండా సలహాలు ఇవ్వొద్దు. రావాల్సిన ఆస్తి గురించి ఆందోళన చెందుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వృశ్చికం
అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. పెళ్లికానివారికి వివాహం నిశ్చయమవుతుంది. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ప్రేమించిన వారిపై ప్రేమను ఈరోజు వ్యక్తం చేయండి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. 
 
Also Read: మీరు తినే ఆహారంపైనా నవగ్రహాల ప్రభావం ఉంటుందని తెలుసా
ధనుస్సు 
ఈరోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. మీ మాటల మీద సంయమనం పాటించండి. 

మకరం
విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు.  మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలున్నాయి. కార్యాలయంలో గొప్ప విజయం సాధించవచ్చు. మీ పనితీరుపట్ల పై అధికారులు  అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారులు లాభపడతారు. 

కుంభం
ఈ రోజు మీ పని ప్రభావితం అవుతుంది. ఎవరితోనైనా గొడవలు జరిగి మీ ప్రశాంతతను కోల్పోతారు. రిస్క్ తో కూడిన పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఎలాంటి బాధలనుంచైనా ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో వాదించకండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం
వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదరొచ్చు. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీరు పిల్లల భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మీ పనితీరుని మెరుగు పర్చేందుకు ప్రయత్నించండి. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి. మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

టాప్ హెడ్ లైన్స్

12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
12-08-2026 బుధవారం మీ రాశిఫలాలు!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget