Horoscope Today 17th January 2022: ఈ రాశులవారు ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ చూసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
జనవరి 17 సోమవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీరు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడంలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు కార్యాలయంలో ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరు కావొచ్చు. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం ఉంది.
వృషభం
ఆఫీసు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ నిర్వహణ సామర్థ్యం పెరుగుతుంది. భూమి లేదా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీరు వ్యాపారంలో ఒప్పందాల నుంచి లాభం పొందుతారు. ఈ రోజు అనుకున్నవి నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఈరోజంతా మీకు శుభసమయమే.
మిథునం
మీరు వ్యాపారంలో రుణాలు తీసుకోవడం మానుకోవాలి. మీ నైపుణ్యంతో సమస్యలు పరిష్కరించుకోండి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయాల్సిందే. దినచర్యను మార్చుకోండి. అధికారులు మీ పని పట్ల చాలా సంతోషిస్తారు. కొత్త పనిని ప్రారంభించడంలో అదృష్టం మీకు సహకరిస్తుంది. విద్యార్థులు బాగా రాణిస్తారు.
Also Read: నీటిపై తేలియాడే రాతి విగ్రహం.. ఎప్పుడైనా విన్నారా అసలు..
కర్కాటకం
కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుది. వ్యాపారులు, విద్యార్థులు మరింత కష్టపడాలి. ఈరోజు ప్రయాణం చేయవలసి రావచ్చు.
సింహం
తలపెట్టిన పనిని జీవిత భాగస్వామి సహాయంతో పూర్తిచేస్తారు. భాగస్వామ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మీ పిల్లలతో సరదాగా గడుపుతారు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
కన్య
కార్యాలయంలో సహోద్యోగుల సహకారం మీకు ఉంటుంది. మీ ప్రవర్తన వల్ల అందరూ ప్రభావితం కావచ్చు. ఆదాయం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి సలహాను పరిగణలోకి తీసుకోండి. సమాజంలో మీ ఇమేజ్ బాగుంటుంది. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. ప్రభుత్వ పనుల్లో పురోగతి ఉంటుంది.
Also Read: ఈ టైమ్ లో చెడుమాట్లాడితే అంతే...
తుల
వ్యాపారానికి సంబంధించి ప్రయాణం చేయవచ్చు. పూర్వీకుల విషయాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలు దూరమవుతాయి. పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు. ఎప్పటి నుంచో చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. కొత్త పనిని ప్రారంభించేందుకు మంచిది.
వృశ్చికం
తప్పుడు విషయాలపై దృష్టి పెట్టవద్దు. బంధువులతో వివాదాలు ఉండొచ్చు. కొత్త వ్యాపారాన్ని ప్లాన్ చేయడం సరికాదు. అనవసర ఖర్చులు ఆపండి. మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. శరీర నొప్పితో బాధపడతారు. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు కాదు. మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. అవసరానికి డబ్బులు అందుతాయి.
ధనుస్సు
ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. కొత్త సమాచారాన్ని సేకరించేందుకు మొగ్గు చూపుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. అతిథులు వస్తారు. అవివాహితులకు సంబంధాలు కుదురుతాయి. సామాజికంగా ప్రశంసలు అందుకుంటారు. దినచర్యలో మార్పు చేసుకోండి.
Also Read: కలియుగం అంతం అయ్యేసరికి మనిషి ఆయుష్షు ఎంతో తెలిస్తే షాకైపోతారు..
మకరం
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. స్నేహితులతో వాగ్వాదం ఉండొవచ్చు. జలుబు, దగ్గు సమస్యతో బాధపడతారు. వ్యక్తిగత సంబంధాల్లో కొంత దూరం పెరుగుతుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. పిల్లలతో విభేదాలు ఉండొచ్చు.
కుంభం
కెరీర్‌లో మంచి విజయాన్ని అందుకోవచ్చు. వ్యాపారంలో చాలా లాభం ఉంటుంది. నిలుపుదల చేసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు.
మీనం
మీకు బంధువులతో విభేదాలు ఉండొచ్చు. మనసులో భారం ఉంటుంది. దినచర్యను క్రమబద్ధంగా నిర్వహించండి. అదనపు ఖర్చులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతాయి. మీ శ్రేయోభిలాషుల నుంచి సలహా తీసుకోండి.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు..
Also Read: గుడ్ల గూబను అశుభం అనుకుంటే పొరపాటే.. ఈ విషయం తెలుసా..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి