Horoscope 1st July 2022: ఈ రాశివారు స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే శుభసమయం, మీ రాశిఫలితం తెలుసుకోండి
Horoscope 01-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 1 శుక్రవారం రాశిఫలాలు (Horoscope 01-07-2022)
మేషం
చంద్రుడు నాలుగో స్థానంలో, పన్నెండో స్థానంలో ఉన్న గురడు, పదకొండో స్థానంలో ఉన్న శని లాభాలనిస్తాడు. ఆధ్యాత్మికత వైపు మీ మనసు మళ్లుతుంది.ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచిసమయం. ఎరుపు, పసుపు మీకు కలిసొచ్చే రంగులు.
వృషభం
చంద్రుడి సంచారం మీ రోజుని శుభప్రదంగా మారుస్తాడు. ఉద్యోగులు మరింత బిజీగా మారిపోతారు. వ్యాపారాలు బాగా సాగుతాయి. శుభస్థానంలో ఉన్న కుజుడు ఆర్థిక స్థితి మెరుగుపరుస్తాడు. మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. నీలం, ఆకుపచ్చ మంచి రంగులు
మిథునం
పన్నెండో స్థానంలో ఉన్న చంద్రుడు రాజకీయాల్లో ఉన్నవారికి లాభాలనిస్తాడు. వ్యాపారానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వైవాహిక జీవితం ఆహ్లాదరకంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై మరింత దృష్టి సారించాలి. ఆకుపచ్చ, తెలుపు మీకు కలిసొచ్చే రంగులు.
Also Read: అమ్మవారికి ఆషాడమాసంలోనే బోనాలు ఎందుకు సమర్పిస్తారు, అసలు బోనం అంటే ఏంటి!
కర్కాటకం
ఈ రోజు మీకు బావుంది. తలపెట్టిన పనులు పూర్తిచేయడంతో పాటూ పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతంగా ఉంటుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శ్రీ మహావిష్ణువును పూజించండి. పసుపు, నారింజ రంగులు శుభప్రదం.
సింహం
పదకొండవ ఇంట ఉన్న సూర్యుడి సంచారం ప్రతి పనిలోనూ విజయాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. బ్యాంకింగ్, మేనేజ్‌మెంట్ రంగాల విద్యార్థులకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పసుపు, ఎరుపు మంచి రంగులు.
కన్యా
చంద్రుడు, సప్తమంలో ఉన్న గురువు మీకు శుభఫలితాలు ఇస్తాడు. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని ఏదైనా పని ప్రారంభించండి. నారింజ, ఆకుపచ్చ మంచి రంగులు.
Also Read: జులై 1న పూరీ జగన్నాథుడి రథయాత్ర, అక్కడ సగం చెక్కిన విగ్రహాలే ఎందుకుంటాయి!
తులా
వ్యాపారంలో పురోగతి ఆనందంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ పనితీరుతో మీరు సంతృప్తి చెందుతారు. ఆరోగ్యం, ఆనందం కోసం ఆంజనేయుడిని పూజించండి. స్నేహితుల నుంచి మంచి సహకారం అందుతుంది. ఎరుపు మరియు తెలుపు మంచి రంగులు.
వృశ్చికం
తొమ్మిదో స్థానంలో ఉన్న చంద్రుడు, నాలుగో స్థానంలో ఉన్న శని కారణంగా ఉద్యోగులకు మంచి రోజు. వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. పోటీ పరీక్షలు రాసిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. కోపం తగ్గంచుకోండి. వైలెట్, ఆకాశం రంగు మంచివి.
ధనుస్సు
ఎనిమిదో ఇంట ఉన్న చంద్రుడు, పదకొండో స్థానంలో ఉన్న సూర్యుడి వల్ల శుభవార్త వింటారు. చాలా కాలాంగా నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. విద్యార్థులు లేనిపోని గొడవల్లో చిక్కుకోవద్దు. వ్యాపారులు, ఉద్యోగులకు సాధారణంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషం సమయం గడుపుతారు ఎరుపు, నీలం రంగులు శుభప్రదం.
Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!
మకరం
ఏడో స్థానంలో సంచరిస్తున్న సూర్య, చంద్రులు మీకు ఆర్థిక ప్రయోజనాలనిస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.ఆధ్యాత్మిక యాత్రలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. ఆకుపచ్చ, ఊదా రంగులు మీకు మంచివి.
కుంభం
రాజకీయ నాయకులకు మంచి సమయం. ఉద్యోగం మారాలి అనుకుంటే ఆ దిశగా నిర్ణయం తీసుకోవచ్చు. వ్యాపారం బాగానే సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం వద్దు. వైలెట్, తెలుపు రంగులు శుభప్రదమైనవి.
మీనం
ఈ రోజు ద్వాదశంలో ఉన్న శని, నాలుగో స్థానంలో ఉన్న సూర్యుడి కారణంగా ఆర్థికంగా కలిసొస్తుంది. ఐదో స్థానంలో ఉన్న చంద్రుడి వల్ల వ్యాపారంలో లాభాలుంటాయి. మీ పిల్లల విజయంతో మీరు సంతోషంగా ఉంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. తెలుపు,ఎరుపు రంగులు మీకు శుభప్రదం.
Also Read: ఏడు జన్మలకు గుర్తుగా ఏడు ద్వారాలు, అజ్ఞానాన్ని పోగొట్టి ముక్తిని ప్రదర్శించే శక్తి స్వరూపం