Horoscope 11th July 2022: ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు మీకు అందుతుంది, జులై 11 సోమవారం రాశిఫలాలు
Horoscope 11-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…
జులై 11 సోమవారం రాశిఫలాలు (Horoscope 11-07-2022)
మేషం
మరింత కష్టపడాల్సి వస్తుంది. మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. మీరు కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు. ఎవరి నుంచు ఏమీ ఆశించవద్దు. గత తప్పుల నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. మనసులో ఏదో తెలియని భయం వెంటాడుతుంది. ఏదైనా బాధ్యతను నెరవేర్చడంలో వైఫల్యం మిమ్మల్ని బాధిస్తుంది.
వృషభం
ఈ రోజు మంచి రోజు అవుతుంది. కుటుంబ సభ్యులందరూ మీతో సంతోషంగా ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నవారికి శుభసమయం. అప్పులు తీర్చడంలో విజయం సాధిస్తారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. మీ ఆలోచనలను సానుకూలంగా ఉంచండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
మిధునం
ఈ రోజంతా మీకు బాగానే ఉంటుంది. కష్టమైన సమస్యలు పరిష్కారమవుతాయి. మీ స్వార్థం కారణంగా కొందరు మీకు దూరమవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంట్లో ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది. భావోద్వేగానికి లోనై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీరు అప్పు ఇవ్వవలసి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
కర్కాటకం
ఉద్యోగం మారాలి అనుకున్నవారు కొన్ని ప్రణాళికలు వేసుకోవచ్చు. మీలో ఉన్న అనుమానాస్పద స్వభావం కారణంగా ప్రేమ సంబంధాల్లో నష్టం జరగవచ్చు. మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అధిక పని అలసటకు కారణమవుతుంది.
Also Read: 'తొలి ఏకాదశి' మర్నాడే 'వాసుదేవ ద్వాదశి', ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే!
సింహం
మీరు ఈరోజు ఓ శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులంతా మీతో సంతోషంగా ఉంటారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు మొగ్గు చూపుతారు. రాజకీయ వ్యక్తులు కొత్త పదవిని పొందవచ్చు. మీ ఆదాయం పెరుగుతుంది.ఉద్యోగంలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
కన్యా
ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న మొత్తం చేతికందుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. మీ ఆసక్తికి అనుగుణంగా పనిని పొందడం ద్వారా మీరు సంతృప్తి చెందుతారు. మీ మనసులోని ఏ కోరిక అయినా నెరవేరుతుంది. మీ జీవిత భాగస్వామి దగ్గర ఏ విషయం దాచవద్దు. ప్రయాణానికి అనుకూలమైన రోజు.
తులా
కొన్ని పనులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవలసి ఉంటుంది. కుటుంబ బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. నడుము నొప్పితో ఇబ్బంది పడతారు. సవాళ్లను స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. వివాదాల్లో తలదూర్చవద్దు, దూషించే పదాలు వాడొద్దు.
వృశ్చికం
ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో గొప్ప విజయం సాధిస్తారు. వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. పిల్లలు చదువు విషయంలో సీరియస్‌గా ఉంటారు. మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవచ్చు. ఇంటి సౌకర్యాలు వనరుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఎవరినీ డిస్టర్బ్ చేయవద్దు.
Also Read: శ్రావణమాసంలోనే కాదు ఆషాడ మాసంలోనూ ఆ ఐదు రోజులూ గౌరీ పూజ చేస్తారు
ధనుస్సు
అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. పదోన్నతికి సంబంధించిన సమాచారం కార్యాలయంలో అందుతుంది. ఉద్యోగులకు జీతం పెరుగుతుంది. లావాదేవీల విషయంలో జాగ్రత్త. మీ జీవిత భాగస్వామి పట్ల మంచి ప్రవర్తన కలిగి ఉండండి. అహంకార ప్రవర్తన కారణంగా మీ నుంచి చాలామంది దూరమవుతారు. పాత మిత్రులను కలుస్తారు.
మకరం
వ్యాపారంలో లాభం ఉంటుంది. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. రాజకీయ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. స్నేహితులతో అనవసర ప్రయాణాలు చేయడం వల్ల సమయం వృథా అవుతుంది.దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇంటి కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచిసమయం.
కుంభం
మీ తీరు, పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కొత్తగా ఏదైనా పని ప్రారంభించేవారికి మంచి సమయం ఇది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి.
మీనం
వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పొట్ట సంబంధిత సమస్యలు ఉండవచ్చు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఎవ్వరికీ సలహా ఇవ్వకండి.
Also Read: పుట్టింట్లో అవమానాన్ని భరించలేక అగ్నిలో దూకిన పార్వతి, పరమేశ్వరుడు ఏం చేశాడంటే
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే