అన్వేషించండి

Kodungallur Maa Kali Mandir: రహస్యాలు దాచిన కేరళ ఆలయం! కాళికా దేవి ఉగ్రరూపం, చరిత్ర, విశేషాలు తెలుసుకోండి!

Kodungallur KaliTemple : కొడుంగల్లూర్ కాళీ దేవాలయం కేరళలో ఉంది. ఇక్కడ పూజలందుకునేదే అసలైన కాళీ రూపం అని భక్తుల విశ్వాసం. ఆ ఆలయం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి

Kodungallur Maa Kali Mandir: దక్షిణ భారతదేశంలో పురాతన దేవతలు, రహస్య దేవాలయాలు కలిగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కేరళలో ఉన్న ఓ ఆలయంలో  దేవత తన చేతుల్లో రాక్షసుడి తలను పట్టుకుని ఉంటుంది..ఆమె కాళి అసలు రూపం అని నమ్ముతారు భక్తులు. ఆ ఆలయం గురించి తెలుసుకుందాం

కేరళలోని కొడుంగల్లూర్ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో ఉంది భగవతి అమ్మవారి ఆలయం. మలబార్‌లోని 64 భద్రకాళి ఆలయాలలో ప్రముఖమైనది కొడుంగల్లూర్ . ఈ ఆలయాన్ని శ్రీ కురుంబా భగవతి ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు భగవతి అమ్మవారిని కురుంబా లేదా కొడుంగల్లూర్ అమ్మ అని పిలుస్తారు. ఈ ఆలయంలో కాళిక రుద్ర రూపాన్ని పూజిస్తారు. 8 చేతులతో కాళికాదేవి ప్రచండ రూపం ధరించి దర్శనమిస్తుంది. ఓ  చేతిలో రాక్షసుడు  మొండెం, ఒక చేతిలో గంట, ఒక చేతిలో కత్తి  ఉంటుంది. ఈ ఆలయంలో నిత్యం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. 

కొడుంగల్లూర్ ఆలయం చరిత్ర

నమ్మకాల ప్రకారం.. పూర్వం ఈ ఆలయంలో శివుడిని పూజించేవారు. కొంతకాలం తరువాత పరశురాముడు ఆలయానికి సమీపంలో   కాళి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. కొడుంగల్లూర్ నగరం ఒకప్పుడు చేర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. మందిరంలో ఉన్న 5 'శ్రీ చక్రాలను' శంకరాచార్యులు ప్రతిష్టించారు, వీటిని దేవత శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఆలయంలో అమ్మవారికి పువ్వులు సమర్పించేది కేవలం పూజారులు మాత్రమే.  పూర్వం ఈ ఆలయంలో పక్షులు , మేకలను బలి ఇచ్చే ఆచారం ఉండేది. కానీ కేరళ ప్రభుత్వం ఆదేశించిన తరువాత ఆలయంలో పశుబలిని పూర్తిగా నిషేధించారు. ఇప్పుడు ఆలయంలో భగవంతునికి ఎరుపు రంగు ధోతీని సమర్పిస్తారు.

తమిళ భాషలో ఇలంగో అడిగల్ రచించిన "సిలప్పదికారం" మహాకావ్యంలో నాయకి కన్నకి... అమ్మన్ ఈ ఆలయంలో ప్రార్థించి మోక్షం ప్రసాదించిందని చెబుతారు.  ఇక్కడ తాంత్రిక (శాక్తేయ) ఆచారాలు పాటిస్తారు. మొదటి శాక్త పూజను మలబార్ నుంచి వచ్చిన థియ్యర్ వ్యక్తి చేశాడని చెబుతారు

కొడుంగల్లూర్ ఆలయంలో ప్రధాన పండుగలు

కేరళలోని ప్రధాన పండుగలలో భరణి పండుగ కూడా ఒకటి. ఇది ప్రతి సంవత్సరం మార్చి ,  ఏప్రిల్ నెలల మధ్య జరుపుకుంటారు. ఈ పండుగ ప్రధానంగా కోజికల్‌కు మూడల్ అనే ఆచారంతో ప్రారంభమవుతుంది, ఇందులో కోళ్లను బలిస్తారు.  

ముఖ్యమైన వివరాలు

కొడుంగల్లూర్, తృశ్శూర్ జిల్లా, కేరళ (తృశ్శూర్ నుంచి 40 కి.మీ.) 

ఆలయం ఎత్తు 32.53 మీ. (107 అడుగులు) 

సందర్శించేందుకు ఉత్తమ సమయం -  జనవరి-ఏప్రిల్ (భరణి పండుగ సమయంలో) 

నెడుంబస్సేరి అంతర్జాతీయ విమానాశ్రయం, ఇరిన్జలకుడ రైల్వే స్టేషన్, కొడుంగల్లూర్ బస్ స్టాండ్ నుంచి దాదాపు 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయం గురించి పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్  kodungallursreekurumbabhagavathytemple.org 
సందర్శించండి
 
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే ఇవ్వబడింది. ABPLive.com ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

ఆధ్యాత్మిక రహస్యం: అమ్మవారికి నల్లపిల్లి, మేకపోతు, దున్నపోతుని బలివ్వండి అంటారు? ఎందుకు? అసలు బలి అంటే ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Advertisement

వీడియోలు

Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP medical college controversy: PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
PPP అంటే ప్రైవేటీకరణే అని వైసీపీ ఫిక్స్ - అదే రాజకీయ అస్త్రం - టీడీపీ తిప్పికొట్టలేకపోతోందా?
KTR Challenge to CM Revanth: పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
పది మందితో రాజీనామా చేయిస్తావా? సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ సవాల్
Adilabad News: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అడ్డుకుంటే తిరగబడతాం; అటవీశాఖ అధికారులకు ఆదివాసీ గిరిజనుల హెచ్చరిక
T20 World Cup 2026: కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
కాసేపట్లో టి20 ప్రపంచ కప్ 2026 భారత జట్టు ప్రకటన! ముంబై సమావేశంలో ముగ్గురు క్రికెటర్లపైనే చర్చ!
Sharif Usman Hadi: కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
కాజీ నజ్రుల్ సమాధి పక్కనే షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియలు! నేడు బంగ్లాదేశ్‌ జాతీయ సంతాప దినం!
Bigg Boss Telugu Grand Finale : బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
బిగ్​బాస్​ గ్రాండ్ ఫినాలేలో మెగాస్టార్ చిరంజివీ.. నిధి అగర్వాల్ రాకతో కళ్యాణ్​కు గాయం!
Peddi Review : ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
ఆ స్టోరీకి చికిిరీ గికిరీలు అవసరమా? - వారు తిన్న కంచంలో ఉమ్మేసినట్లే... రివ్యూయర్స్‌కు విశ్వక్ స్ట్రాంగ్ కౌంటర్
Hardik Pandya : తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
తను కొట్టిన సిక్సర్‌ బంతి తగిలి గాయపడ్డ కెమెరామెన్‌ను పరామర్శించిన హార్దిక్ పాండ్యా!
Embed widget