News
News
X

దేవుత్తని ఏకాదశి రోజున ఈ పనులు అస్సలు చేయొద్దు

కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి ఎంతో ప్రత్యేకమైనది. ఈ రోజు ఉపవాసం చేస్తే ఎన్నో ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. అయితే, కొన్ని పనులను మీరు అస్సలు చేకూడదు. అవేంటో చూడండి.

FOLLOW US: 

కార్తిక మాసం లోని ప్రతి రోజు పవిత్రమైనదే. ఏకాదశి తిధికి ప్రత్యేకత లేకుండా ఉండదు కదా. ఈ రోజును దేవుత్తని ఏకాదశి అంటారు. లోక నాయకుడైన మహా విష్ణు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్లి కార్తీక ఏకాదశి రోజున తిరిగి మేల్కొన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశిని హరిప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు ఉపవాసం చేసి మహావిష్ణు ఆరాధన చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని ప్రతీది.

ఈ సంవత్సరం నవంబర్ 4, శుక్రవారం నాడు దేవుత్తుని ఏకాదశి జరుపుకుంటున్నారు. ఈరోజున తులసి కళ్యాణం కూడా జరిపిస్తారు. అంతేకాదు భీష్ముడు అంపశయ్యను చేరి అస్త్ర సన్యాసం చేసింది కూడా కార్తిక ఏకాదశి రోజునే. తొలి ఏకాదశి రోజున ప్రారంభించిన చాతుర్మాస్య వ్రతం ఈరోజునే ముగుస్తుంది. ఈ రోజున విష్ణు మూర్తికి చేసే హారతి సేవ అకాల మృత్యు దోషం తొలగి ఆయుష్షును ప్రసాధిస్తుందనేది నమ్మకం. స్కంద పురాణంలో కూడా ఈ రోజు వైశిష్ట్యం వివరించారు.

దేవుత్తుని ఏకాదశి వంటి పవిత్రమైన రోజున ఉపవాసం చేసిన వారు, చెయ్యని వారు ఎవరైనా సరే మధ్యాహ్నం వేళ నిద్ర పోకూడదు. మహా విష్ణువు యోగ నిద్ర నుంచి మెళకువలోకి వచ్చిన సందర్భంలో ప్రపంచమంతా మెళకువగా ఉండాలని నమ్మకం. ఈరోజు నుంచి అన్ని శుభ దినాలు మొదలవుతాయి. అందుకే ఈరోజు మధ్యాహ్నాలు చురుకుగా గడపాలి. పగటి పూట విష్లు ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ దేవి కరుణ కూడా దొరకుతుంది.

పగటి నిద్ర కూడదు

ప్రభోధిని ఏకాదశి రోజున బియ్యంతో తయారు చేసిన ఆహారం అసలు తినకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. వీటితో పాటు ఉల్లి, వెల్లుల్లి, వంటి వాటి కూడా కూడా తినకూడదట. చెడు ఆలోచనలు లేకుండా పవిత్రంగా సమయం గడపాలి. ఎవరికీ హానీ కలిగించొద్దు. ప్రశాంత చిత్తంతో ఉండాలి. భక్తి భావంతో శరణాగతి తెలిపిన వారి పూజకు తగిన ఫలితం లభిస్తుంది.

News Reels

విష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైంది. ఈరోజున విష్ణుమూర్తి లోకపాలనా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ రోజు తులసి మొక్క నుంచి ఆకులు తియ్య కూడదు. అది విష్ణు ఆగ్రహనికి కారణం కావచ్చు.

విష్ణు మూర్తి యోగ నిద్రలోకి వెళ్లగానే హిందువులు శుభకార్యాలన్నింటిని వాయిదా వేసుకుని మంచి రోజుల కోసం వేచి ఉంటారు. ఈ రోజు విష్ణువు మేల్కొన్న తర్వాత తిరిగి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. అందువల్ల శుభకార్యాలన్ని మొదలవుతాయి. ఈ మాసంలో శ్రీహరి నీటిలో కొలువై ఉంటాడని నమ్మకం.

ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణు నామ స్మరణ అంటే అష్టాక్షరిని జపిస్తూ నేతి దీపాలతో దీపారాధన చెయ్యాలి. ఈరోజు పగలంతా ఉపవాసం చేసి సంధ్యా సమయంలో దీపారధన చేసి ఉపవాస విరమణ చెయ్యవచ్చు.  పండితులకు వస్త్రం, పండు, దక్షిణ తాంబూలాలు సమర్పించిన వారికి జీవిత పర్యంతం ఎలాంటి కష్టాలు ఉండవని శాస్త్రం చెబుతోంది.

Also Read: కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు, వాటివెనుకున్న ఆంతర్యం ఏంటంటే!

Published at : 04 Nov 2022 12:03 PM (IST) Tags: Pooja Upavasam karthika ekadashi chaturmasya vratam

సంబంధిత కథనాలు

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

Weekly Horoscope 27 November to December 3: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది,  మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

27 November to 3rd December 2022 Weekly Horoscope:  ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి