Friday Rules: శుక్రవారం ఈ రంగు వస్తువులను ఎవరికీ ఇవ్వకండి, ఇస్తే చిక్కుల్లో పడేది మీరే!
Friday Rules: శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. ఈ రోజు లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం రోజు ఏ పని చేస్తే ఆర్థిక సమస్యలు వస్తాయి? ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి.
Friday Rules: శాస్త్రం ప్రకారం శుక్రవారం తెల్లటి వస్తువులను దానం చేయకూడదని చెబుతారు. సంపదలకు దేవత అయిన లక్ష్మీ దేవితో ముడిపడి ఉన్న ఈ రోజున మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే, పేదరికం మీ ఇంట్లోకి ప్రవేశించదు. ఈ తప్పులు చేయనప్పుడే పూజ పునస్కార పుణ్యం లభిస్తుంది. అయితే శుక్రవారం నాడు మీరు చేయకూడని తప్పులు ఏంటి..? శుక్రవారం ఈ తప్పులు చేస్తే మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలంటే శుక్రవారం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?
ఈ రంగు వస్తువు దానం చేయవద్దు
శుక్రుని ప్రభావం జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. శుక్రవారం పంచదార దానం చేయకూడదు, అది మీ జీవితంలోని ఆనందాన్ని తగ్గిస్తుంది. గ్రహాల సంచారం ఆధారంగా దానధర్మాలు చేస్తే జీవితంలో సుఖానికి లోటు ఉండదు. ముఖ్యంగా మీరు వ్యాపారం చేస్తుంటే శుక్రవారాల్లో చక్కెర దానం చేయడం మానుకోండి. ఈ రోజు మీరు చక్కెర సహా ఇతర తెల్లని పదార్థాలను దానం చేయకూడదు.
అపరిశుభ్రంగా ఉండనివ్వవద్దు
లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం నాడు ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఇంట్లో అమ్మవారిని పూజించాలి. శుభ్రమైన ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. ఇల్లు అపరిశుభ్రంగా ఉంచితే దరిద్రం వస్తుంది. ఈ కారణంగా ఇంటిని శుభ్రంగా, చక్కగా ఉంచండి.
శుభ్రమైన ఆహారం
శుక్రవారం మద్యం, మాంసం తినవద్దు. ఈ రోజు సాత్విక ఆహారం తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున మీరు శాకాహారం తప్ప మరే ఇతర ఆహారాన్ని తినకూడదు.
పరుష పదాలు వద్దు
ఈ రోజు మీ నోటి నుంచి ఎలాంటి పరుషమైన పదాలు లేదా చెడ్డ మాటలు రాకుండా చూసుకోండి. ఈ రోజున ఎవరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. శుక్రవారం మీరు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. చెడు మాటలు మాట్లాడే వారిపై లక్ష్మీ దేవి కోపగించుకుంటుంది. పరుష పదాలు మాట్లాడేవారెవరూ ఆమె అనుగ్రహాన్ని పొందలేరు.
Also Read : శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!
అప్పు ఇవ్వకండి
మనం శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే అది రుణదాత, రుణగ్రహీత ఇద్దరిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శుక్రవారం ఎవరికైనా అప్పు ఇస్తే మీ ఇంటి లక్ష్మిని వేరొకరి ఇంటికి పంపుతున్నట్లు అర్థం. ఈ రోజు మీరు అప్పు తీసుకుంటే మీరు వేరొకరి ఇంటి లక్ష్మిని తీసుకున్నారని అర్థం. ఇది లక్ష్మీదేవి వెళ్లే ఇంటికి గాని, వచ్చిన ఇంటికి గాని మేలు చేయదు. ఇది రుణగ్రహీతలు, రుణదాతలు ఇద్దరికీ సమస్యలను సృష్టిస్తుంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
Also Read : శుక్రవారం ఇలా చేస్తే సంపదతో పాటు ఆనందానికి లోటుండదు