అన్వేషించండి

గుడ్లగూబ వస్తే మరణం, కాకి అరిస్తే చుట్టాలొస్తారు, కొంగ ఓ కాలిపై నిల్చుంటే వర్షం! పక్షుల గురించి 10 నమ్మకాలు!

Common Myths about Birds: గుడ్లగూబ ఇంట్లోకి వస్తే మరణం, కాకి అరిస్తే చుట్టాలొస్తారు, కొంగ ఓ కాలిపై నిల్చుంటే వర్షం పడుతుంది... పక్షుల గురించి ప్రచారంలో ఉండే 10 నమ్మకాలు ఇవే!

Superstitions About Birds : పక్షుల గురించి ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు సహా వివిధ సంస్కృతులలో చాలా నమ్మకాలు, కొందరికి మూఢనమ్మకాలు ఉన్నాయి. ఈ  నమ్మకాలు తరచుగా స్థానిక సంప్రదాయాలు, జానపద కథలు...ఆధ్యాత్మిక నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. అలాంటి 10 పక్షులకు సంబంధించి ఉన్న ప్రచారాలు గురించి తెలుసుకుందాం.
 
గుడ్లగూబ రాత్రివేళ అరిస్తే దురదృష్టం

గుడ్లగూబ రాత్రిపూట అరవడం దురదృష్టం లేదా మరణ సంకేతంగా చాలా సంస్కృతులలో, ముఖ్యంగా గ్రామీణ భారతదేశంలో నమ్ముతారు.  దీనిని తరచూ చెడు శకునంగా భావిస్తారు.

కాకి ఇంటి పైకప్పుపై కూర్చుంటే అతిథుల రాక

కాకి ఇంటి పైకప్పుపై కూర్చుని కావ్ కావ్ అని అరిస్తే..ఇంటికి అతిథులు వస్తారని నమ్ముతారు. ఇప్పటికీ ఈ నమ్మకం చాలాప్రాంతాల్లో ఉంది. అది నిజం అయినా కాకపోయినా.. కాకి అరిచిన వెంటనే చుట్టాలొస్తారేమో అనే మాట అప్రయత్నంగా వచ్చేస్తుంది
 
పక్షి ఇంట్లోకి ఎగిరితే శుభవార్త

ఒక పక్షి ఇంట్లోకి ఎగురుకుంటూ వస్తే అది శుభవార్తను తెస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇది చెడు శకునంగా కూడా పరిగణిస్తారు. వచ్చిన పక్షి బయటకు వెళ్లకపోతే అది దురదృష్టంగా భావిస్తారు
 
నీలి పక్షి (బ్లూ జే) శుభసూచనం

నీలి రంగు పక్షిని చూడటం సంతోషానికి, అదృష్టానికి సంకేతంగా భావిస్తారు. ఇలాంచి పక్షులను పవిత్రంగా భావిస్తారు.

కొంగ ఒక కాలుపై నిలబడితే వర్షం

కొంగ ఒక కాలుపై నిలబడి కనిపిస్తే త్వరలో వర్షం వస్తుందనే సూచన అంటారు గ్రామీణులు. 

పక్షి తలపై రెట్ట వేస్తే దురదృష్టం

పక్షి తలపై రెట్ట వేస్తే అది చెడు శకునంగా లేదా అనారోగ్య సమస్యల సూచనగా భావిస్తారు.

వుడ్‌పెక్కర్ శుభం

వుడ్‌పెక్కర్ శబ్దం శుభసూచనగా భావిస్తారు. ముఖ్యంగా ఉదయాన్నే ఈ శబ్ధం వినిపిస్తే అదృష్టం కలిసొస్తుందని నమ్ముతారు
 
రెండు కాకులు కలిసి ఎగిరితే సంతోషం

రెండు కాకులు కలిసి ఎగరడం చూస్తే అది సంతోషం వివాహ సూచనకు సంకేతంగా నమ్ముతారు. ఒక కాకి కనిపించినా, ఎగురుతున్న రెండు కాకులు చెరో దిక్కు ఎగిరినా అది ఒంటరితనం లేదా దుఃఖానికి సంకేతంగా భావిస్తారు.

గుడ్లగూబ ఇంటిలోకి వస్తే మరణం

గుడ్లగూబ ఇంటిలోకి రావడం చాలా అరుదైన సంఘటన కానీ ఇది జరిగితే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని కొందరు నమ్ముతారు.

పక్షి గూడు వదిలివేయడం అశుభం
 
 పక్షి ఇంటి సమీపంలో గూడు కట్టి, ఆ తర్వాత దాన్ని వదిలివేస్తే అది ఇంట్లో సమస్యలు లేదా ఆర్థిక నష్టానికి సూచనగా భావిస్తారు.

గమనిక:   ఇవన్నీ సాంస్కృతిక , సాంప్రదాయిక నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. వీటికి శాస్త్రీయ ఆధారం ఉండకపోవచ్చు.  ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

పాలగిన్నె మూత తీసినా, కుక్క ఏడ్చినా ఆత్మలకు ఆహ్వానం పలికినట్టే! తరచూ వినిపించే 7 మూఢనమ్మకాలు - వాటి వెనుకున్న ఆశ్చర్యపోయే వాస్తవాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
బుధుడు అస్తమయం: ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నారా? ముందుగా ఈ విషయాన్ని తెలుసుకోండి!
Guru Gochar 2026: నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!
నిద్రలేవగానే మొబైల్ చూసే అలవాటుందా? మీపై గురుగ్రహం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసా!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget