అన్వేషించండి

చాణక్య నీతి: జీవితంలో ఈ ముగ్గురిని ఒప్పించొద్దు! మీ సమయం వృధా.

Chanakya Niti In Telugu: కొందరి వ్యక్తులతో వాదన తగదు..అనవసరంగా వారిని ఒప్పించడం అంటే సమస్యలు కొని తెచ్చుకోవడమే అంటారు చాణక్యుడు. ఎవరా ముగ్గురు?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మొండి, తెలివితక్కువ వారితో వాదన మీ సమయాన్ని వృథా చేస్తుంది.
  • ప్రతికూల స్వభావం గల వారితో వాదన మనసుకు హానికరం.
  • జిత్తులమారి, స్వార్థపరులను ఒప్పించడం మీ శ్రమను వృథా చేస్తుంది.

చాణక్య నీతి: ఆచార్య చాణక్యుని ప్రకారం ఎప్పుడూ ఎవరితోనూ వాదన పెట్టుకోకూడదు. చాలామంది ఓ విషయంపై తమ స్నేహితులు లేదా సన్నిహితులతో వాదన పెట్టుకుని వారిదగ్గర తమ మాట నెగ్గించుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఈ ముగ్గురు వ్యక్తులను ఒప్పించడానికి ప్రయత్నించడం, వారితో వాదించడం సమయం వృధా , అవివేకం అని తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు ఆచార్య చాణక్యుడు

చాణక్య నీతి: ఇగ్నోర్ చేయడం అవసరం కాదు ఆయుధం.. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు ఇగ్నోర్ చేయాలో తెలుసుకోండి!

 మొండి , తెలివి తక్కువ వ్యక్తులు

మొండిగా వ్యవహరించేవారు,  తెలివి తక్కువ వ్యక్తులకు ఏదైనా వివరించడానికి ప్రయత్నించడం అవివేకం. అలాంటి వారిని మార్చమని ఒప్పించడానికి మీరు ప్రయత్నిస్తే, వారు అర్థం చేసుకోరు. ఇది మీ సమయాన్ని వృధా చేయడమే కాకుండా, మీ మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది. అందువల్ల, మీరు అలాంటి తప్పు  ఎప్పుడూ చేయొద్దని సూచించారు చాణక్యుడు
 
ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉండండి 

ప్రతి చిన్న విషయానికి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు అలాంటి ప్రతికూల స్వభావం గల వ్యక్తులకు దూరంగా ఉండాలి. వారితో వాదించడం లేదా గొడవపడటం మంచిది కాదు. వారితో మాట్లాడటం వల్ల మీ మనసులో కూడా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. ఈ వ్యక్తులు ఎవరి అభిప్రాయాన్ని సరైనదిగా అంగీకరించరు. వారి వాదనలో బలం లేకపోయినా అదే వాస్తవం అనే భ్రమలో ఉంటారు. అలాంటి వారితో వాదించడం లేదా వారిని ఒప్పించడానికి ప్రయత్నించడం వల్ల మీరు మీ సమయాన్ని వృధా చేసుకుంటారు.ఆ వ్యక్తులతో సహవాసం మీ జీవితంలో కొత్త సమస్యలను సృష్టించగలదు.

చాణక్య నీతి: చదువు, ఉద్యోగంలో దూసుకెళ్లాలంటే Gen Zలు ఇవి ఫాలో అయిపోండి!

మోసపూరిత , జిత్తులమారి వ్యక్తులు
 
మీ చుట్టూ స్నేహం లేదా బంధం ముసుగులో ఇలాంటి వారుంటారు. వారిని గుర్తించకపోతే మీరు ఎప్పటికీ ఉన్నత స్థానానికి చేరుకోలేదు.  మోసం చేసేవారు లేదా జిత్తులమారి వ్యక్తి  ఎవరో మీరు గుర్తించగలిగితే వారితో ఎట్టిపరిస్థితుల్లోనూ వాదించడం చేయొద్దు. ఈ వ్యక్తులు దుర్మార్గులు , స్వార్థపరులు. వారు ఎప్పుడూ తమ స్వప్రయోజనాల మీదే దృష్టి పెడతారు. వారికి ఏదైనా వివరించడానికి ప్రయత్నించడం లేదా ఏ విషయంలోనైనా వారికి సలహా ఇవ్వడం మీ సమయాన్ని వృధా చేయడమే. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని అర్థం చేసుకోరు. దానికి విరుద్ధంగా, వారు మిమ్మల్ని తమ శత్రువుగా భావించడం ప్రారంభిస్తారు.

చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!

ఎప్పుడూ కూడా ఎవరినైనా ఒప్పించడానికి ప్రయత్నిస్తూ మీ శక్తిని వృధా చేసుకోకూడదు. అవతలి వ్యక్తి ఒక విషయాన్ని అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేకపోతే, వారితో వాదించే బదులు మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. మీ ఆలోచనలను వినడానికి, అర్థం చేసుకోవడానికి , అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నవారితో మాత్రమే ఏ విషయం గురించైనా చర్చించండి. 

వివాహం, బంధాలు, రాజనీతి, విద్య సంపద ప్రాముఖ్యత, స్నేహాలు సహా జీవితంలో ఉన్నతి కోసం వివిధ అంశాలపై చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్న విషయాలు గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి...

Frequently Asked Questions

ఆచార్య చాణక్యుడు ఎవరితో వాదించవద్దని సూచించారు?

మొండి, తెలివి తక్కువ, ప్రతికూల స్వభావం గల, మోసపూరిత వ్యక్తులతో వాదించవద్దని చాణక్యుడు సూచించారు. వారితో వాదించడం సమయం వృధా, అవివేకం.

మొండి, తెలివి తక్కువ వ్యక్తులతో వాదించడం వల్ల నష్టమేంటి?

మొండి, తెలివి తక్కువ వ్యక్తులకు వివరించడానికి ప్రయత్నిస్తే వారు అర్థం చేసుకోరు. ఇది సమయం వృధా చేయడమే కాకుండా, మీ మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది.

ప్రతికూల స్వభావం గల వ్యక్తులతో ఎందుకు వాదించకూడదు?

వారితో మాట్లాడటం వల్ల మీ మనసులో ప్రతికూల ఆలోచనలు వస్తాయి. వారు ఎవరి అభిప్రాయాన్ని అంగీకరించరు, వారితో సహవాసం కొత్త సమస్యలను సృష్టిస్తుంది.

మోసపూరిత, జిత్తులమారి వ్యక్తులతో వాదించడం ఎందుకు వృధా?

ఈ వ్యక్తులు దుర్మార్గులు, స్వార్థపరులు. వారికి ఏదైనా వివరించడానికి ప్రయత్నిస్తే మిమ్మల్ని శత్రువుగా భావించవచ్చు. వారికి సలహా ఇవ్వడం సమయం వృధా.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 10 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్ 10 రాశి ఫలాలు: ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వారికి ఎలా ఉండబోతోంది?
నవంబర్ 10 రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఊహించని మలుపులు!
నవంబర్ 10 రాశిఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు ఊహించని మలుపులు!
నవంబర్ 10 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశులవారికి కార్తీకమాసం మొదటిరోజు ఎలాంటి ఫలితాలు?
నవంబర్ 10 రాశిఫలాలు: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం రాశులవారికి కార్తీకమాసం మొదటిరోజు ఎలాంటి ఫలితాలు?
Karthika Masam 2026 Start and End Date: కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? కార్తీక పౌర్ణమి,క్షీరాబ్ధి ద్వాదశి సహా ముఖ్యమైన రోజులివే!
2026 కార్తీకమాసం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? కార్తీక పౌర్ణమి,క్షీరాబ్ధి ద్వాదశి సహా ముఖ్యమైన రోజులివే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranga Reddy Collector: రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు 6 నెలల జైలు శిక్ష.. హైకోర్టు సంచలన తీర్పు!
Telangana Politics: కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సమరం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్!
CM Chandrababu: 2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
2024 ఎన్నికల కంటే అత్యుత్తమ ఫలితాలు, మెరుగైన స్ట్రైక్ రైట్.. కూటమి విజయంపై సీఎం చంద్రబాబు
Nerella Sharada: హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
హైదరాబాద్‌కు యువతులను రప్పిస్తున్నది ఎవరు? అక్రమ అండాల దందాపై మహిళా కమిషన్ ప్రశ్నలు
Census In Telangana: తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణలో జనగణన నిర్వహణకు తేదీలు ఖరారు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
This Week OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీల్లో 12 సినిమాలు స్ట్రీమింగ్ - జైలర్ 2 To రణబాలి... ఇవి డోంట్ మిస్
Software Engineer Murder: పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
పూజ చేసి బలిచ్చింది! సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను హత్య చేసిన ప్రియురాలు.. ఆమెతో పాటు తల్లి అరెస్ట్
Comedy Drama OTT : ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సరికొత్త కామెడీ ఎమోషనల్ మూవీ - 'హ్యాపీ జర్నీ' ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget