Lucky Bamboo: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే అదృష్టం తెస్తుందా?
Vastu Tips in Telugu: కొందరు ఇంట్లో వెదురు మొక్క(Lucky Bamboo)లు పెంచుతున్నారు. వాటిని ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే లక్ కలిసి వస్తుందా?
![Lucky Bamboo: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే అదృష్టం తెస్తుందా? Benefits and significance of having bamboo plant in home as per vastu Lucky Bamboo: వెదురు మొక్కను ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే అదృష్టం తెస్తుందా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/01/fa8982325e035c772d2fa45fcb2cf56a1711983403371560_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vastu Tips: వాస్తు శాస్త్రం జీవితం సజావుగా సాగేందుకు అవసరమైన అనేక విషయాలను గురించి చర్చిస్తుంది. వాస్తును అనుసరించి కొన్ని రకాల వస్తువులు జీవితంలో కష్టాలు తొలగించి జీవితాన్నిసజావుగా సాగుతుందని వాస్తు వివరిస్తుంది. లక్కీ బాంబూ(Lucky Bamboo) మొక్క అలాంటి వాటిలో ఒకటి.
లక్కీ బాంబూ(Lucky Bamboo) విశిష్టత ఇదే
Lucky Bamboo మొక్క పవిత్రమైనది. వాస్తు ప్రకారం ఇది అదృష్టాన్ని తెస్తుంది. ఇది ఆయువు, ఆరోగ్యాన్ని అందిస్తుందని నమ్మకం. Lucky Bamboo ఉన్న చోట సంపద, సౌఖ్యం ఉంటుందని శాస్త్రం వివరిస్తోంది. చాలా మంది వారి ఇంటి ఆవరణలో పొడవైన వెదురు మొక్కలు పెంచుకుంటారు. పొడవుగా పెరిగే ఈ మొక్కులు నిరంతర ఎదుగుదలకు సంకేతాలు.
వెదురు మొక్కతో కలిగే లాభాలు
- ఒక్కో వెదురు మొక్క 4, 5 వందల సంవత్సరాల పాటు జీవిస్తుంది. కనుక ఇవి దీర్ఘాయుష్షుకు సంకేతాలు. ఆరోగ్యం బాగాలేని వారి పరిసరాల్లో ఈ మొక్కను ఉంచితే త్వరగా కోలుకుంటారని నమ్మకం.
- వెదురు మొక్కలు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిలబడుతాయి. కనుక ఇవి అన్ని రకాల కష్టాలను తట్టుకునే శక్తిని ఇస్తాయి.
- వెదురు మొక్కను వ్యాపార ప్రదేశాలు, కార్యాలయాల్లో పెట్టుకుంటే లాభదాయంకంగా ఉంటుంది. పనులన్నీ కూడా ఆటంకాలు లేకుండా సజావుగా సాగిపోతాయి.
- ఈ మొక్కలు ఉన్న చోట పాజీటివ్ ఎనర్జీ ఉంటుంది. నెగెటివిటి తొలగిపోతుంది.
- వెదురు మొక్కలు మాత్రమే కాదు. వెదురు ఉపయోగించి చేసిన విండ్ షెమ్స్ వంటివి ఉపయోగించడం వల్ల కూడా పరిసరాల్లోని నెటెటివిటిని తొలగించి పాజిటివ్ గా ఉంచుతాయి.
ఎక్కడ పెడితే మంచిది?
సాధారణంగా వెదురు మొక్కను ఇంట్లో తూర్పు వైపు పెట్టుకోవచ్చు. ఆర్థిక సమస్యలు తీరేందుకు లక్కీబాంబు ఎప్పుడూ ఆగ్నేయంలో పెట్టుకోవాలి. ఆగ్నేయంలో ఉంటే లక్కీ బాంబూ సంపదను ఆకర్శిస్తుందని నమ్మకం. డైనింగ్ టేబుల్ మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. దీనికి పెద్దగా ఎండ కానీ సంరక్షణ కానీ అవసరం లేదు కనుక బెడ్ రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇంటిలోపల ముఖద్వారానికి దగ్గరగా అలంకరించుకుంటే జీవితంలోకి కొత్త అవకాశాలను ఆహ్వానిస్తుంది. వెదురు మొక్క ఇంట్లోని టాక్సిన్లను తొలగించి పరిసరాలను శుద్ధి చేస్తుంది.
ఎన్ని మొక్కలు ఉండాలి?
ఒక కుండిలో ఎన్ని వెదురు మొక్కలు ఉండాలనే విషయంలో కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. రెండు మొక్కలున్న కుండి పెట్టుకుంటే యుక్త వయసు వారైతే మీకు తగిన భాగస్వామి దొరుకుతారని అర్థం. ఐదు మొక్కలుంటే జీవితంలోకి ఆనందం వస్తుది. ఆరుంటే ఆరోగ్యం, ఎనిమిదుంటే సంపదను అందిస్తాయని ఫెంగ్ ష్యూయి చెబుతోంది. తొమ్మిది మొక్కలుంటే మంచి భవిష్యత్తు, పది మొక్కులైతే అదృష్టం తీసుకువస్తాయి. 21 మొక్కులుంటే ఆ దేవుడి కరుణకు మీకు పాత్రుతవుతారని అనేందుకు సంకేతం. అయితే నాలుగు మొక్కలున్న Lucky Bamboo తెచ్చుకోవద్దు, ఎవరికి బహుకరించవద్దు కూడా ఎందుకంటే ఈ సంఖ్య మరణాన్ని ఆహ్వానిస్తుందట.
Also Read : ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు? ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయ్!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)