అన్వేషించండి

Balapur Ganesh Laddu Auction 2024: వేలంలో లక్షలు వెచ్చించి కొన్న గణేషుడి లడ్డూని ఏం చేస్తారు - దానివల్ల ఏం ఉపయోగం!

Balapur Ganesh Laddu: ఆర్థికంగా ఊహించని స్థాయిలో ఉన్నాను..మానసిక ప్రశాంతత కలిగింది. అందుకే లక్షలు వెచ్చించైనా వేలంలో గణేష్ లడ్డూ ప్రసాదం దక్కించుకోవాలి అనుకుంటాం అంటున్నారు గడిచిన వేలంలో విజేతలు

Balapur Ganesh Laddu Auction 2024:  ఆర్థికంగా ఊహించని స్థాయిలో ఉన్నాను..మానసిక ప్రశాంతత కలిగింది..అందుకే లక్షలు వెచ్చించైనా వేలంలో గణేష్ లడ్డూ ప్రసాదం దక్కించుకోవాలి అనుకుంటాం అని చెబుతున్నారు గడిచిన వేలంలో విజేతలు.. ఇంతకీ ఆ లడ్డూ ఏం చేస్తారు..

గణేషుడి ఉత్సవాలంటే ఊరూ వాడా సంబరమే. చిన్న చిన్న పల్లెల నుంచి మహా నగరాల వరకూ పండుగ వాతావరణమే.  ఉత్సవాల పేరుతో అందర్నీ ఓ చోటుకి చేర్చి ఘనంగా పూజలందుకుని గంగమ్మ ఒడికి తరలివెళతాడు వినాయకుడు. మళ్లీ వచ్చే ఏడాది వరకూ ఈ సంబరాన్ని గుండెల్లో నింపుకుంటారు భక్తులు. నవరాత్రులు ముగిసి..నిమజ్జనానికి తరలివెళ్లేముందు అత్యంత ముఖ్యమైన క్రతువు లడ్డూ వేలం. 

ఇప్పుడంటే ప్రతి గణేష్ మండపం వద్దా లడ్డూ వేలం నడుస్తోంది కానీ...అసలు లడ్డూ వేలాన్ని ప్రారంభించిందే బాలాపూర్ గణేషుడి దగ్గరే. పార్వతీ తనయుడికి లడ్డూ నివేదించే సంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైంది కానీ...1994 నుంచి వేలం పాట ప్రారంభించారు. మొదటిసారిగా 450 రూపాయలు పలికిన లడ్డూ  ధర ఏటికేడాది పెరుగుతూ గతేడాది 27 లక్షలకు చేరుకుంది. అందుకే ఈ ఏడాది లడ్డూ వేలంలో పాల్గొనేవారు ముందుగా గతేడాది లడ్జూ ధర అయిన 27 లక్షలు డిపాజిట్ చేయాలనే ఆంక్షలు విధించారు. ఇలా అయితే వేలంపాటలో రద్దీ నివారించొచ్చు.. పైగా లెక్క తొందరగా ముందుకెళుతుంది..ఎక్కువ సమయం పట్టకుండా వేలం పాట క్లోజ్ అవుతుంది.  ఈ ఏడాది (2024) 30 లక్షల ఒక వెయ్యి రూపాయలకు పలికింది...

Also Read: రూ. 450 నుంచి రూ. 27 లక్షల వరకు- బాలాపూర్ లడ్డూ వేలం విజేతల పూర్తి జాబితా

వినాయకుడికి నివేదించే లడ్డూని వేలంలో దక్కించుకుంటే ఏం లాభం?

లక్షల రూపాయలు వెచ్చించి కొన్న ఆ లడ్డూని ఏం చేస్తారు?

ఇదే విషయాన్ని గతంలో వేలంలో లడ్డూ దక్కించుకున్న భక్తులను ప్రశ్నిస్తే.. వాళ్లు చెప్పిన సమాధానాలివే..

బాలాపూర్ గణేషుడి లడ్డూ వేలంలో దక్కించుకుంటే ఆర్థికంగా వృద్ధి చెందాం. ఆ ఏడాది ఆస్తులు, కొనుగులో అమ్మకాలు ఏం చేసినా మంచి లాభాలు ఆర్జించాం...

వేలంలో లడ్డూ దక్కించుకుంటే కుటుంబంలో కొన్నేళ్లుగా వెంటాడుతున్న వివాదాలు సమసిపోయి ప్రశాంతత లభించింది. మానసికంగా ఉండే గందరగోళం నుంచి ఉపశమనం దొరికింది...

దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారు బాలాపూర్ లడ్డూని వేలంలో కొనుగోలు చేసి ఆ ప్రసాదం స్వీకరించి ...అందరకీ పంచితే ఆరోగ్యం మెరుగుపడింది

ఏడాది మొత్తం ఏం పని ప్రారంభించినా అపజయం అనే మాటే వినిపించదు..కుటుంబంలో సంతోషం, వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగంలో ఉన్నతి లభించింది..

ఈ లడ్డూని కొందరు ప్రసాదంగా అందరకీ పంచుతారు... మరికొందరైతే వ్యవసాయ పొలంలో కొంత చల్లితే ఆ ఏడాది ఎలాంటి విపత్తులు సంభవించినా వేసిన పంట చేతికందడమే కాదు..ఊహించని లాభాన్నిస్తుందని నమ్మకం..

Also Read: బాలాపూర్ గణేష్ లడ్డూకు రికార్డు ధర- 30 లక్షల ఒక వెయ్యికి సొంతం చేసుకున్న దయానందరెడ్డి

ఇక వేలంలో లడ్డూ దక్కించుకున్నవారి సంగతి సరే.. అంత మొత్తాన్ని నిర్వాహకులు ఏం చేస్తారనే సందేహం వచ్చి ఉండొచ్చు. ఏటా  గణేష్‌ వేలం పాట ద్వారా వచ్చే లక్షల రూపాయల మొత్తాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. అదే సమయంలో కొన్నేళ్లుగా జరుగుతున్న వేలంలో ఎవరెవరు ఎంత మొత్తానికి లడ్డూ దక్కించుకున్నారో వారి వివరాలను భక్తులకు తెలియజేసేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు బాలాపూర్ ఉత్సవసమితి. ఈ మొత్తంతోనే వివిధ ఆలయాల అభివృద్ధికి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు అండగా ఉండేందుకు ఉపయోగిస్తున్నారు...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget