అన్వేషించండి

Bakrid 2026 Wishes: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (ఈద్ అల్-అధా) శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Bakrid 2026 Wishes in Telugu: త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ (ఈద్ అల్-అధా) సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • బక్రీద్ పండుగ త్యాగానికి, మానవత్వానికి ప్రతీక.
  • ఈద్ అల్ అధా సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
  • ప్రేమ, దయ, త్యాగం మన జీవితంలో భాగం కావాలి.
  • అల్లాహ్ దీవెనలతో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి.

Happy Eid-ul-Adha Wishes In Telugu 2026 : బక్రీద్ ( బకర్ ఈద్ ).. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండుగ అని. జంతువును ఖుర్బాని ఇచ్చే వేడుక కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా పిలుస్తారు. మహ్మదీయుల క్యాలెండర్ ప్రకారం ఏటా జిల్ హజ్ నెలలో బక్రీద్ జరుపుకుంటారు.  జిల్ హజ్ నెలలో పదో రోజు ఈ పండుగ జరుపుకుంటారు. త్యాగనిరతతోపాటు.. మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలు విడిచిపెట్టి మానవత్వాన్ని చాటాలన్నదే బక్రీద్ పండుగ వెనుకున్న ఆంతర్యం. ఈ సంవత్సరం బక్రీద్ పండుగ మే 28 గురువారం వచ్చింది. ఈ సందర్భంగా మీ బంధుమిత్రులకు, ముస్లిం సోదరులకు ఈ కొటేషన్స్ తో శుభాకాంక్షలు తెలియజేయండి

బక్రీద్ రోజు మూగజీవాలను ఎందుకు బలిస్తారు, బక్రీద్ పండుగలో ఆంతర్యం ఏంటి!

అల్లా ఆశీర్వాదంతో 
మీ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి
ఈద్ ముబారక్ 2026!

ఈ పవిత్ర సందర్భంలో అల్లా మీ త్యాగాలను గుర్తించి
మీ కోర్కెలు నెరవేర్చాలని కోరుకుంటూ ఈద్ ముబారక్!

జాలి, దయ, కరుణ, ప్రేమ, త్యాగం
ఇవన్నీ మన జీవితాల్లో భాగం
ఆ అల్లాహ్ చల్లని చూపులు
మనపై ఎప్పటికీ ఉంటాయి
హ్యాపీ ఈద్ ముబారక్

యుద్ధాలు అశాంతి రగిలిస్తాయి
త్యాగాలు ప్రేమను చిగురింపజేస్తాయి
త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్
సందర్భంగా శుభాకాంక్షలు

మీ ప్రార్థనలు, త్యాగాలూ ఎప్పటికీ వృథా కావు
ఈద్ అల్ అధా సందర్భంగా
అల్లా దీవెనలు అందుకోండి
ఈద్ ముబారక్

అల్లాహ్ చల్లని చూపులు, ప్రేమ ప్రజలను దయామయులుగా చేస్తాయి
ప్రేమను పంచి, త్యాగాలను స్మరించే ఈద్ అల్ అధా శుభాకాంక్షలు

త్యాగలకు ప్రతీక అయిన బక్రీద్ సందర్భంగా 
మీకు, మీ కుటుంబ సభ్యులకూ శుభాకాంక్షలు

ఒకే ఒక జీవితాన్ని ప్రేమ, త్యాగాలతో నింపుకోవాలి
ప్రతి క్షణాన్నీ ప్రేమించాలి..బక్రీద్ శుభాకాంక్షలు

ఈద్ అల్ అధా ముబారక్
మీరు, మీ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి

త్యాగాలకు ప్రతీక అయిన ఈద్ అల్ అధా సందర్భంగా
అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు

త్యాగాలకు సిద్ధపడే వాళ్లను ఎప్పటికీ మర్చిపోలేం
అలాంటి వారిపై అల్లాహ్ దయ ఎప్పటికీ ఉంటుంది
హ్యాపీ ఈద్ ముబారక్

ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
మీరు మరింత అభివృద్ధి చెందాలి
ఈద్ అల్ అధా ముబారక్

ఆ దేవుడి చల్లటి చూపులు భవిష్యత్తుపై ఆశల్ని పెంచుతాయి
అల్లాహ్ దయ ఎప్పటికీ నిలిచివుండాలని
కోరుకుంటూ ఈద్ ముబారక్

త్యాగం వెనక ప్రేమ ఉంటుంది
ప్రేమ వెనక దైవం ఉంటుంది
ప్రేమతో చేసే ప్రతీదీ తియ్యగా ఉంటుంది
త్యాగాల పండుగ హ్యాపీ ఈద్ అల్ అధా

మీకు మీ కుటుంబ సభ్యులకూ
ఈద్ అల్ అధా శుభాకాంక్షలు

ఈ ఈద్ మీ జీవితంలో
సరికొత్త వెలుగులు నింపాలని
కోరుకుంటూ హ్యాపీ బక్రీద్

ఈద్ సందర్భంగా ప్రియమైన వారికి
పూలగుత్తి ఇవ్వండి. ప్రేమను పంచండి.
వారి త్యాగాలను స్మరించండి.
ఆనందంగా జీవించండి.
హ్యాపీ ఈద్ అల్ అధా

మన జీవితాలు అల్లాహ్ నిర్దేశించినవే.
ఆయన చూపిన శాంతియుత మార్గం
మనల్ని ముందుకు నడిపిస్తుంది.
త్యాగం ఇచ్చే సంతృప్తి మాటల్లో చెప్పలేనిది.
అందరికీ ఈద్ ముబారక్

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Frequently Asked Questions

బక్రీద్ పండుగ అంటే ఏమిటి?

బక్రీద్ అంటే 'జంతువుల పండుగ'. ఖుర్బాని ఇచ్చే వేడుక కాబట్టి దీనిని ఈదుల్ ఖుర్బాని అని కూడా పిలుస్తారు. మహ్మదీయుల క్యాలెండర్ ప్రకారం జిల్ హజ్ నెలలో దీనిని జరుపుకుంటారు.

బక్రీద్ పండుగ వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి?

బక్రీద్ పండుగ త్యాగనిరతను, మనోవాంఛ, స్వార్థం, అసూయ, రాగద్వేషాలు విడిచిపెట్టి మానవత్వాన్ని చాటాలని బోధిస్తుంది.

బక్రీద్ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు?

మహ్మదీయుల క్యాలెండర్ ప్రకారం ఏటా జిల్ హజ్ నెలలో, ఆ నెలలో పదో రోజున బక్రీద్ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం మే 28, గురువారం నాడు వచ్చింది.

బక్రీద్ శుభాకాంక్షలు ఎలా తెలియజేయాలి?

మీరు మీ బంధుమిత్రులకు, ముస్లిం సోదరులకు పండుగ సందర్భంగా పంపిన కొటేషన్స్, శుభాకాంక్షలతో తెలియజేయవచ్చు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
అంతర్గత అంధకారాన్ని తొలగించే అమావాస్య ! ఆగష్టు 12 సూర్యగ్రహణం..ఈ రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు?
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
సూర్య గ్రహణం రోజు ఆరుద్ర నక్షత్రంలోకి కుజుడు! 3 రాశులవారికి ప్రయోజనం!
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget