అన్వేషించండి

Ayodhya Ram Mandir Inauguration : రాముడికి కలువ పూలతో మోదీ పూజ - ఈ పూలు ఎందుకు ప్రత్యేకమో తెలుసా!

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పూజచేసిన ప్రధాని మోదీ పూజలో కలువ పూలు ఉపయోగించారు...ఈ పూల ప్రత్యేకత ఏంటంటే...

Ayodhya Ram Mandir Inauguration : దేశవ్యాప్తంగా రామనామం మారుమోగిపోతోంది. అందరి చూపూ అయోధ్య వైపే. గర్భగుడిలో కొలువుతీరిన బాలరాముడిని చూసి భక్తులు పులకరించిపోతున్నారు. 500 ఏళ్ల ఎదురు చూపులకు తెరపడిందన్న ఉద్విగ్న క్షణాల మధ్య రాముడి  ప్రాణ ప్రతిష్ఠ వేడుక   వైభవంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసింది. సరిగ్గా మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య కాలంలో ఈ క్రతువు నిర్వహించారు. వేదమంత్రోఛ్చారణల మధ్య ఈ ఘట్టం పూర్తైంది. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన స్క్రీన్స్‌లో ప్రాణ ప్రతిష్ఠ తంతుని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ప్రధాని మోదీతో పాటు 14 జంటలు ఈ క్రతువులో పాల్గొన్నాయి. ఈ ముహూర్తాన ఆలయ ప్రాంగణంతో పాటు అయోధ్య అంతా జైశ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది. అయితే పూజ సమయంలో మోదీ...శ్రీరాముడికి కలువ పూలతో పూజ చేశారు. పూజకు ఎన్నో పూలు ఉపయోగిస్తాం..కానీ...కలువ పూలు మరింత ప్రత్యేకం ఎందుకు...

Also Read: వైభవంగా ముగిసిన అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ, మందిరంలో కొలువు దీరిన బాల రాముడు

ఆధ్యాత్మిక వృద్ధికి సూచన

హిందువులు క‌లువపూవును పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ పువ్వు స్వచ్ఛత, జ్ఞానం, ఆధ్యాత్మిక వృద్ధిని సూచిస్తుంది. బురద నీటి నుండి ఉద్భవించే ఈ పూలు ఆధ్యాత్మిక జ్ఞానోదయం, అంతః సౌంద‌ర్యం అభివృద్ధి చెందడానికి సూచనగా భావిస్తారు. కలువ పూలతో పూజ చేస్తే కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని, చేపట్టిన పనులు నిర్వఘ్నంగా పూర్తవుతాయని చెబుతారు. 

Also Read: అయోధ్యలో రామ భక్తులకు ఇచ్చే ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా!

హిందూ ధ‌ర్మంలో క‌లువకు ప్రాధాన్యం

హిందూధ‌ర్మంలో క‌లువ‌ పువ్వుకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఇది వివిధ దేవతలతో సంబంధం కలిగి ఉంటుంది. సాధారణంగా మతపరమైన వేడుకలు, ప్రార్థనల సమయంలో భ‌గ‌వంతునికి ఈ పుష్పాన్ని సమర్పిస్తారు. హిందూ పురాణాలలో, సరస్వతీ దేవి, లక్ష్మీ దేవి  కలువ పూలపై కూర్చుని ఉన్నట్టు చెబుతారు. కలువ పూలు ఆయా దేవతల ఉనికిని, ఆశీశ్సులను సూచిస్తుంది. మనిషిలో జ్ఞానం, కరుణ, ప్రేమ వికసించడాన్ని ప్ర‌తిబింబిస్తుంది కమలం. 

Also Read: శ్రీరామచంద్రుడికి సూర్య తిలకం - దర్శనభాగ్యం ఎప్పుడంటే!

సృష్టి ఉనికి కొనసాగింపు సూచన కలువ

కొన్ని సంస్కృతులలో క‌లువ‌ పువ్వును సంతానోత్పత్తి, పునరుత్పత్తి, జీవిత చక్రానికి సూచనగా భావిస్తారు. తామర పువ్వు స్వచ్ఛత కారణంగా, ఈ పువ్వును మతపరమైన విధులు, శుభ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.ఈ కలువ పువ్వును ఎక్కువగా సరస్వతీ లక్ష్మీదేవి పూజల్లో ఉపయోగిస్తారు. 

Also Read: అయోధ్యలో అతిపెద్ద దీపం 'దశరథ్ దీప్‌' ఎప్పుడు వెలిగిస్తారంటే!

శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే

Also Read: మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక - శుభ స్వాగతం ప్రియ పరిపాలకా!

 శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ||

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
OLA EV Showroom: ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
ఓలా ఈవీ షోరూంకు చెప్పులదండ - కస్టమర్ వినూత్న నిరసన
Embed widget