అన్వేషించండి

YSRCP Defence : వైఎస్ఆర్‌సీపీ డిఫెన్స్ పాలిటిక్స్ - విపక్షాల మూకుమ్మడి దాడుల్ని తిప్పికొట్టలేకపోతోందా ?

వైఎస్ఆర్‌సీపీ డిఫెన్స్ పాలిటిక్స్ - విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టలేకపోతోందా ?

 

YSRCP Defence :   ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మూడున్నరేళ్ల వరకూ ఓ లెక్క..  ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్‌సీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఏం చేసినా చెల్లుతుందనే రాజకీయ వాతావరణం ఏర్పడింది. దాన్ని ఆ పార్టీ ఎలా ఉపయోగించుకుందన్న సంగతిని పక్కన పెడితే... రాజకీయంగా మాత్రం ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మూడున్నరేళ్ల పాటు టీడీపీ పై ఆరోపణలు.. విచారణలు.. కేసులతో హోరెత్తించింది. దీంతో అనేక మంది టీడీపీ సీనియర్లు  బయటకు రాలేకపోయారు.  కానీ ఇప్పుడు క్రమంగా పరిస్థితి రివర్స్ అయింది. 

అప్పట్లో వైసీపీ ఆరోపణలు - టీడీపీ వివరణలు

ప్రభుత్వం మారిన మూడున్నరేళ్ల పాటు.. వైఎస్ఆర్‌సీపీ .. ఎదురుదాడి చేస్తూనే ఉంది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అని.. మరొకటని ఆరోపణలు జోరుగా చేశారు. అరెస్టులు చేయించారు. వీటన్నింటిపై వివరణ ఇచ్చుకోవడానికి టీడీపీ తంటాలు పడేది. ఇక మూడు రాజధానుల విషయంలోనూ ఫిక్స్ చేసినంత పని చేశారు. గట్టిగా విశాఖ రాజదానికి వ్యతిరేకమని చెప్పలేని పరిస్థితిని  కల్పించి.. మూడు రాజధానులపై వీలైనంత తక్కువ వాయిస్ ఉండేలా చేయగలిగారు.  వైసీపీ అఫెన్సివ్ రాజకీయాలతో టీడీపీ డిఫెన్స్ ఆడుతూ వచ్చింది. వివరణలు ఇచ్చుకుంటూ.. ధర్నాలు  చేసుకుంటూ రాజకీయాలు చేసింది. 

ఏడాది నుంచి మరిపోయిన పరిస్థితులు !

కారణం ఏదైనా ఏడాది కిందటి నుంచి పరిస్థితులు ఒక్క సారిగా మారిపోయాయి. చంద్రబాబునాయుడు రాయలసీమ నుంచి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి  పేరుతో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత  పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కర్నూలు వెళ్లి అమరావతే మన రాజధాని అని ప్రకటించి వచ్చారు. తర్వాత విశాఖలోనూ అదే చెప్పారు. దీంతో ఇక టీడీపీ వాయిస్ పూర్తిగా మారిపోయింది. అదే సమయంలో   వైసీపీ సర్కార్ కు మూడు రాజధానుల విషయంలో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రభుత్వం పారదర్శకంగా లేకపోవడంతో ప్రజల్లోనూ ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఇక లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఆరోపణలు  చేయడం.. వైసీపీ వివరణ ఇచ్చుకోవడం కామన్ గా మారిపోయింది. విపక్షాలు  చేస్తున్న ఆరోపణలకు మిస్ లీడింగ్, ఫ్యాక్ట్ చెక్ పేరుతో వివరణలు ఇచ్చుకోవడానికి ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. 

ఇప్పుడు ఎటు చూసినా విపక్షాల ముప్పేట దాడి -  !

ఇప్పుడు ఏపీలో ఓ వైపు చంద్రబాబునాయుడు పర్యటిస్తున్నారు. మరో వైపు లోకేష్ పాదయాత్ర నడుస్తోంది. మరో వైపు పవన్ కల్యాణ్ వారాహి యాత్ర చేస్తున్నారు. ముగ్గురూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. దీంతో .. రోజుకు నలుగురు, ఐదుగురుమంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేయాల్సి వస్తోంది. ఆ ముగ్గురు లేవనెత్తిన అంశాలపై ఎదురుదాడి చేస్తున్నారు కానీ..  ఎజెండా విపక్షాలు సెట్ చేస్తే వైసీపీ వివరణ ఇచ్చుకున్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇలా ఎందుకు మారిపోయిందో వైసీపీ నేతలకూ అర్థం  కావడం లేదు. రోజూ విపక్షాలు ఆరోపణలు చేయడం.. తాము వివరణ ఇచ్చుకోవాల్సి రావడంతో..  పొలిటికల్‌గా ఫిక్స్ అయ్యామన్న అభిప్రాయంతో వైసీపీ నేతలున్నారు. 

 

 

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget