అన్వేషించండి

Anantapur politics: అనంతపురం పార్లమెంట్ పరిధిలో ముస్లిం ఓటర్లను ఆకర్షించే పనిలో వైసీపీ ప్రభుత్వం

ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలతో హిందూపురం ఇన్చార్జ్ బాధ్యతల నుంచి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైసీపీ ప్రభుత్వం తప్పించింది. ఎం‌పిగా అవకాశం ఇస్తారా? అని పార్లమెట్ పరిధిలో ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. సాధారణంగానే ఎన్నికల సమయంలో జరిగే పార్టీ మార్పులు, అసంతృప్తులు అక్కడక్కడా మొదలయ్యాయి కూడా. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో హోరాహోరీ తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రతిపక్షాల్లో ఉన్న నేతలు కూడా సేఫ్ ప్లేస్ కోసం వేట సాగిస్తున్నారు. ఉన్న చోట గెలిచే అవకాశం ఉంటే సరి లేకపోతే పార్టీ ఫిరాయింపులకు రెడీ అవుతున్నారు.

ఈ తరుణంలో హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన ఎమ్మెల్సీ ఇక్బాల్ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా వైసీపీ అధిష్టానం హిందూపురం ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించడంతో  ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంధి.

ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రస్థానం

రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఈయన ఐజీగా రిటైర్డ్ అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి అద్వర్యం లో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలోకి చేరినప్పటి నుంచి ఈయనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పదవి ఇస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి నందమూరి బాలకృష్ణ పై పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీగా కొనసాగారు.

ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలతో హిందూపురం ఇన్చార్జ్ బాధ్యతల నుంచి వైసీపీ ప్రభుత్వం ఆయనను తప్పించింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త ప్రయోగం చేయబోతుందంటూ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముస్లిం మైనార్టీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం ఎంపీ సీటును వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు కేటాయిస్తే బాగుంటుందని ఓ సర్వే నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఎం‌పిగా అవకాశం ఇస్తారా???

అయితే అనంతపురం పార్లమెంటుకు ముస్లిం అయినా మహమ్మద్ ఇక్బాల్ ను టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సిపికి సంబంధించి మైనార్టీ లీడర్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. తాడపత్రికి చెందిన ఫయాజ్ భాషా పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. పార్టీలో తనకు అవకాశం కల్పించాలని ఫయాజ్ ముఖ్యమంత్రి వద్ద పలుమార్లు విన్నవించుకున్నారు. మరోవైపు ఉర్దూ అకాడమీ చైర్మన్ నవీన్ అహ్మద్ మరికొందరు నాయకులు పార్టీ కోసం పని చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మహమ్మద్ ఇక్బాల్ ఇప్పటికే రాజకీయంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలంగా పాతుకుపోయాడు. దీనికి తోడు అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. పలు సర్వేల్లో ఇక్బాల్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా ముస్లింలు పోటీ చేసిన సందర్భం లేదు.

ఈ ప్రయోగం వల్ల తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో సుమారు 60 వేలకుపైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. తాడిపత్రిలో 30 వేలు,  గుంతకల్లు 25వేలు, రాయదుర్గంలో 20 వేలు, కళ్యాణ్ దుర్గంలో 18 వేలు, ఉరవకొండలో 19వేలు, సింగనమలలో 10వేలకుపైగా ఓటర్లు ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటర్లకు అనుకూలంగా ఉండడంతో ముస్లిం అభ్యర్థి ఎంపిక ఎమ్మెల్యేలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.

మహమ్మద్ ఇక్బాల్ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా లేక సైలెంట్‌గా ఉంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత హిందూపురం ఇన్చార్జిగా, ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రస్తుతం ఇన్చార్జి పదవి నుంచి పార్టీ పక్కన పెట్టడంతో కాస్త మనస్థాపానికి గురైన ఇక్బాల్ పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఒకానొక సందర్భంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచన సైతం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాన్ని ముస్లింలకు కేటాయిస్తే దాని ప్రభావం మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంటుందని అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
School Holidays: విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం- ఎన్ని రోజులంటే!
విద్యార్థులకు పండగే, స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం - ఎన్ని రోజులంటే!
HMPV Cases In India : భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
భారత్ లో మరో 3 హెచ్ఎంపీవీ కేసులు - పెరుగుతున్న ఇన్ఫెక్షన్స్‌తో టెన్షన్ టెన్షన్
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
Nepal Earthquake: నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
నేపాల్‌లో 7.1 తీవ్రతతో భారీ భూకంపం, నార్త్ ఇండియాలో పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
Embed widget