అన్వేషించండి

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?

Viveka Case Supari Money: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈడీ విచారణ ఎందుకు వేగవంతమైంది? రూ. 40 కోట్ల సుపారీ నిధుల మూలాలను తవ్వుతున్న ఈడీ.. అసలు సూత్రధారులు దొరికిపోతారా?

YS Viveka Murder Case ED Investigation:  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో అనూహ్య మలుపు తిరిగింది. ఒకవైపు సీబీఐ ఇప్పటికే పలు ఛార్జ్‌షీట్లు దాఖలు చేసి, కేసు ట్రయల్  దశకు చేరుకున్న తరుణంలో.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  రంగంలోకి దిగి దూకుడు పెంచడం చర్చనీయాంశమవుతోంది. ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తదితరుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన ఈడీ, ఇప్పుడు ప్రధాన నిందితులను వరసగా పిలిచి గంటల తరబడి విచారిస్తోంది. సీబీఐ క్రిమినల్ కోణంలో విచారణ జరిపి నిందితులను తేల్చగా, ఈడీ మాత్రం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్  కింద హత్య వెనుక ఉన్న కోట్ల రూపాయల సుపారీ నెట్‌వర్క్‌పై దృష్టి సారించింది.

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ 

సీబీఐ ఛార్జ్‌షీట్ ప్రకారం.. వివేకానందరెడ్డిని అంతమొందించేందుకు ఏకంగా రూ. 40 కోట్ల సుపారీ ఒప్పందం జరిగిందనే   ఆరోపణలు ఉన్నాయి. అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా.. అతనికి అందులో రూ. 5 కోట్లు ఇస్తామని ఆశ చూపారని, ముందస్తుగా రూ. 1 కోటి చేతులు మారిందని సీబీఐ పేర్కొంది. అంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డబ్బును ఎవరెవరు బదిలీ చేశారు? హవాలా ద్వారా నగదు లావాదేవీలు జరిగాయా? అనే కోణంలో సీబీఐ కంటే ముందుకెళ్లి ఈడీ విచారిస్తోంది. ఈ ముసుగులో జరిగిన అక్రమ ఆర్థిక లావాదేవీల   మూలాలను పక్కా ఆధారాలతో పట్టుకోవడమే ఈడీ ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది.

మనీ ట్రయల్ బలమైన సాక్ష్యం 

వాస్తవానికి, హత్య కేసులలో కేవలం భౌతిక సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలు మాత్రమే కోర్టులో నిలవడం కొన్నిసార్లు సవాలుగా మారుతుంది. కానీ, పక్కాగా నమోదైన  మనీ ట్రయిల్ నిరాకరించలేని బలమైన సాక్ష్యంగా మారుతుంది. సీబీఐ కేవలం హత్య వెనుక ఉన్న హంతకులను, ప్రాథమిక కుట్రదారులను గుర్తించగలిగితే.. ఈడీ ఇప్పుడు ఆ హత్యకు నిధులు సమకూర్చిన  ఫైనాన్షియల్ మాస్టర్‌మైండ్స్  లేదా అసలు సూత్రధారులు ఎవరో తేల్చేందుకు ప్రయత్నిస్తోంది. రూ. 40 కోట్ల సుపారీ నిధులను సమకూర్చడం ఒకరిద్దరితో అయ్యే పని కాదని, దీని వెనుక పెద్ద ఫైనాన్షియల్ నెట్‌వర్క్ ఉందనే అనుమానాలు ఈడీ విచారణతో మరింత బలపడుతున్నాయి.

కీలక నిందితులందర్నీ ప్రశ్నించిన ఈడీ 

ఇప్పటికే ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిలతో పాటు ఇతర కీలక నిందితులను ఈడీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణల్లో హంతకులకు నిధులు ఎలా చేరాయి, ఎవరి బ్యాంక్ ఖాతాల నుంచి లేదా ఏ హవాలా మార్గాల ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చారనే అంశాలపై బ్యాంక్ స్టేట్‌మెంట్లు, డిజిటల్ సాక్ష్యాలను ముందరబెట్టి ఆధారాలు రాబడుతున్నారు. సీబీఐ సేకరించిన ప్రాథమిక సమాచారానికి ఈడీ వెలికితీసే ఆర్థిక సాక్ష్యాలు తోడైతే, ఈ కేసు తీరుతెన్నులే మారిపోయే అవకాశం ఉంది.  సీబీఐ సేకరించిన ఆధారాలకు ఈడీ జరిపే మనీ లాండరింగ్ విచారణ ఒక పెద్ద  సపోర్టింగ్ పిల్లర్ గా మారనుంది.

ఈడీ ఆధారాలు బయటపెడితే సంచలనమే

ఒకవేళ వివేకా హత్యకు వాడిన డబ్బు అక్రమ మార్గాల్లో వచ్చిందని లేదా ఒక రాజకీయ వ్యవస్థ ద్వారా నిధులు మళ్లించారని  ఈడీ ఆధారాలతో నిరూపిస్తే, సుపారీ ఇచ్చిన పెద్దలకు చట్టపరంగా తప్పించుకోవడం సాధ్యం కాదు. నిందితుల ఆస్తుల జప్తుతో పాటు, కుట్రలో భాగస్వాములైన ప్రత్యక్ష, పరోక్ష పెద్దల పేర్లను ఈడీ తన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో చేర్చే అవకాశం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.  వివేకా హత్య కేసు ట్రయల్ ప్రారంభమవుతున్న వేళ ఈడీ ఎంట్రీ ఇవ్వడం కేవలం ఒక సాధారణ ప్రక్రియ కాదని.. ఈ కేసును లాజికల్ ఎండ్‌కు తీసుకెళ్లే వ్యూహాత్మక అడుగు అని స్పష్టమవుతోంది. సీబీఐ ఛేదించలేకపోయిన   ఆర్థిక మూలాలను  ఈడీ బయటకు తీస్తే.. ఇన్నాళ్లూ తెరవెనుక ఉండిపోయిన అసలు పెద్ద తిమింగలాలు  వెలుగులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తాయో వేచి చూడాల్సిందే!

 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Kavitha vs Harish Rao : హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
హరీశ్ రావుపై కవిత ఆరోపణలు - రేవంత్ స్క్రిప్ట్ అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కౌంటర్.. కాంగ్రెస్‌కు లాభం చేకూరే రాజకీయమా?
Telangana Phone Tapping Case: ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
ఏ1గా కేసీఆర్, ఏ2గా కేటీఆర్ పేర్లతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఛార్జ్‌షీట్ రెడీ? - తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సెగ!
Delimitation Bill 2026: పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
పార్లమెంట్ సీట్ల పునర్విభజనపై మారిన రాజకీయ సమీకరణాలు - ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఒంటరి - మిత్రపక్షాలు సై !
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
ఎల్‌నినో, వరుస తుపాను నష్టాలకు కేంద్రం సాయం కోరిన ఏపీ సీఎం చంద్రబాబు
MLA Anirudh Reddy: రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజకీయ నాయకులు కాదు, ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతిపరులు: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
Cheap Liquor Scam: ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
ఫారిన్ బ్రాండ్ అని బిల్డప్.. జానీ వాకర్ బాటిల్స్‌లో చీప్ లిక్కర్- మందుబాబుల జేబులకు చిల్లు
Ranu Bombai Ki Ranu Lyrics : రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
రాను ముంబయికి రాను న్యూ రికార్డ్ - 100 కోట్లకు చేరువలో రాము రాథోడ్ ఫోక్ సాంగ్... హుషారెత్తించే లిరిక్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
The Odyssey OTT : రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
రెండు ఓటీటీల్లో న్యూ వరల్డ్ 'ది ఒడిస్సీ' – 16 వేల కోట్ల రికార్డ్ మూవీ తెలుగులోనూ చూడొచ్చు
Travis Head Exit:  SRH అభిమానులకు హెడ్ షాక్ .. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
SRH అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చిన హెడ్.. ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆసీస్ ఓపెనర్ దూరం, విడిపోనున్న విధ్వంసకర ట్రావిషేక్ జోడీ
Embed widget