YS Sharmila : ఏపూరి సోమన్నపై దాడి - వర్షంలోనే షర్మిల దీక్ష !
పార్టీ నేతలపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేాయలని వర్షంలోనే దీక్ష చేస్తున్నారు వైఎస్ షర్మిల. పార్టీ నాయకుడు ఏపూరి సోమన్నపై టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని షర్మిల ఆరోపిస్తున్నారు.
YS Sharmila : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్వహిస్తున్న పాదయాత్రలో ఉద్రిక్తత ఏర్పండింది. ప్రజాప్రస్థానంలో భాగంగా ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష 31వ వారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గం లక్కవరం గ్రామంలో నిర్వహించారు. దీక్ష ముగించుకుని వెళ్తుండగా.. వైఎస్ఆర్ టీపీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్నపై కొంత మంది దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఏపూరి సోమన్న పక్కనున్న మహిళా నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదానికి దిగారు.
జడివానలోనూ టీఆర్ఎస్ దాడులపై పోరాటం
— YSR Telangana Party (@YSRTelangana) July 5, 2022
– హుజూర్ నగర్ నియోజకవర్గం లక్కవరంలో షర్మిలక్క దీక్ష
– టీఆర్ఎస్ గూండాలను అరెస్టు చేసే వరకు దీక్ష ఆగదు
- నిందితులను కస్టడీలోకి తీసుకొనే వరకు ఆందోళన విరమించేది లేదు
– కండ్ల ముందే దాడులు జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదు#YSSharmila pic.twitter.com/2Yk2xGD2QP
ఈ సందర్భంగా షర్మిల పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్లపై దాడి చేస్తారా.. అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే సైదిరెడ్డే టీఆర్ఎస్ గూండాలను పంపారని ఆరోపించారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. దీక్షా స్థలానికి వచ్చిన టీఆర్ఎస్ మఠంపల్లి మండల అధ్యక్షుడు పిచ్చయ్యపై మండిపడ్డారు షర్మిల. మహిళలపై దాడి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు షర్మిల.
ఏపూరి సోమన్నపై TRS గూండాల దాడి
— YSR Telangana Party (@YSRTelangana) July 5, 2022
– పాదయాత్రలో అక్రమంగా చొరబడిన గులాబీ దుండగుల ముఠా
– దళిత నాయకుడు ఏపూరి సోమన్నపై దాడికి యత్నం
– ప్రతిఘటించిన YSRTP నాయకులు
1/2#YSSharmila #PrajaPrasthanam #apoorisomanna #huzunagar #NirudyogaNiraharaDeeksha #YSRTP #ShameOnSaidiReddy pic.twitter.com/d91iHaAsJp
వైఎస్ విగ్రహం వద్దకు చేరుకుని కార్యకర్తలతో కలసి బైఠాయించారు. పోలీసు జులుం నశించాలి.. టీఆర్ఎస్ డౌన్.. డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి ప్రయత్నించిన ఇద్దర్నీ చూశారు కదా.. చూసి కూడా ఎందుకు పట్టుకోలేదు.. వాళ్లిద్దర్నీ తీసుకుని రండి.. కేసు పెట్టి అరెస్టు చేసే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదంటూ షర్మిల తేల్చి చెప్పారు. వర్షం పడుతున్నా షర్మిల అక్కడనుంచి కదల్లేదు. మటంపల్లి మండలం టీఆరెఎస్ పార్టీ నేతలను అరెస్ట్ చెసే వరకు దీక్ష విరమించే లేదని నిందితులను కస్టడీ లోకి తీసుకొనే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు.
ప్రశ్నించే దళిత నాయకుడిపై దాడులా?
— YSR Telangana Party (@YSRTelangana) July 5, 2022
– ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న MLA సైదిరెడ్డి
– మీ బోడి బెదిరింపులకు భయపడేది లేదు
– మీకు దమ్ముంటే సమస్యలు పరిష్కరించండి
– YSRసైన్యం కదిలితే ఇంచు కూడా కదలలేవ్#PrajaPrasthanam #YSRTelanganaParty #YSSharmila #NirudyogaNiraharaDeeksha #Huzunagar pic.twitter.com/gML5xChOji