అన్వేషించండి

YS Jagan Pulivendula: వైసీపీ హయాంలో ఏకగ్రీవాలు మంచివి .. ఇప్పుడు చెడ్డవా? జగన్ వాదన తేలిపోతోందా?

Pulivendula Unopposed Elections: పులివెందుల, కడప మున్సిపాలిటీల్లో వైసీపీ నిరాశ. జగన్ హెచ్చరించినా చాలా చోట్ల పార్టీ నేతలు నామినేషన్లు వేయలేదు. పోలీసులు అడ్డుకున్నారని వాదిస్తున్నారు.

Kadapa Municipal Elections YSRCP Failure:  ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఊహించని భారీ రాజకీయ ముప్పును ఎదుర్కొంటున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండకూడదు, ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునేది లేదు, అభ్యర్థులు ఓడిపోయినా సరే ధైర్యంగా నిలబడి పోటీ చేయాల్సిందే అని నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు జగన్ కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. కానీ, ఆయన హెచ్చరికలను క్షేత్రస్థాయి నేతలు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పాటు, ఏకంగా కడప జిల్లాతో పాటు వైఎస్సార్ కుటుంబానికి శతాబ్దకాలంగా కంచుకోటలాంటి పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోనే భారీగా వార్డులు ఏకగ్రీవం కావడం వైఎస్సార్‌సీపీ శ్రేణులను కోలుకోలేని దెబ్బ తీసింది.

గతంలో వైసీపీ మినహా ఇతర పార్టీల వాళ్లు నామినేషన్లు వేయలేకపోయేవాళ్లు!

గతంలో ఏవైనా ఎన్నికలు వచ్చాయంటే పులివెందుల, ఒంటిమిట్ట, జమ్మలమడుగు, మైదుకూరు వంటి ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలు కనీసం నామినేషన్లు వేయడానికి కూడా భయపడే పరిస్థితులు ఉండేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి వైఎస్సార్ కుటుంబం ఇక్కడ ఏకచక్రాధిపత్యం చెలాయించింది. కానీ, గడిచిన అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత ఏపీ రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. గతంలో ఏకపక్షంగా వైసీపీ కైవసం చేసుకున్న కడప జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, వార్డుల్లో ఇప్పుడు ఏకంగా వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు. దీంతో అధికార కూటమి  అభ్యర్థులు  సునాయాసంగా  ఎన్నికవుతున్నారు.

జగన్‌కు ఎదురు దెబ్బ

ఈ పరిణామం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తీవ్రమైన పొలిటికల్ సెట్‌బ్యాక్ అని  భావిస్తున్నారు. పార్టీ అధినేత పదే పదే సమీక్షలు నిర్వహించి, నామినేషన్లు వేసి పోరాటం చేయమని ఆదేశించినప్పటికీ సొంత జిల్లాలోని నాయకులు కనీసం డిపాజిట్ దాఖలు చేయడానికి కూడా ముందుకు రాకపోవడం ఆయన కమాండ్ అండ్ కంట్రోల్ పై ప్రశ్నలను రేకెత్తిస్తోంది. జగన్ ఆదేశాలను సైతం లెక్కచేయని స్థాయిలో క్షేత్రస్థాయి నాయకత్వం నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిందనడానికి,  అధికార కూటమి రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక చేతులెత్తేసిందనడానికి ఈ ఏకగ్రీవాలే ప్రత్యక్ష నిదర్శనంగా మారాయి.

పోలీసులు అడ్డుకున్నారని వాదన

పోలీసుల అణచివేత, బెదిరింపులు, భౌతిక దాడుల వల్లే తమ నేతలు నామినేషన్ కేంద్రాలకు వెళ్లలేకపోయారని వైసీపీ రాష్ట్ర నాయకత్వం గగ్గోలు పెడుతోంది. అయితే, 2019-2024 మధ్య కాలంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాల్టీల్లో వేలాది ఏకగ్రీవాల  వైసీపీ నమూనా నే ఇప్పుడు తమకు తిరగతోడుతోందని పొలిటికల్ సర్కిళ్లలో ప్రచారం సాగుతోంది. నాడు మీరు చేసిన పనులనే నేడు కూటమి ప్రభుత్వం రిపీట్ చేస్తోంది, నాడు మీరు ఏకగ్రీవాలను ప్రజామోదమన్నారు, నేడు అరాచకం అంటున్నారు  అని టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. దశాబ్దాలుగా వైఎస్సార్ కుటుంబ గుప్పిట ఉన్న పులివెందుల, కడప ప్రాంతాలు ఇకపై క్రమంగా చేజారిపోతాయా అన్న ఆందోళన వైసీపీ శ్రేణుల్లో ముదురుతోంది. ప్రతిపక్షంలోకి రాగానే ఆర్థిక మద్దతు నిలిపివేసి, పూర్తి భారాన్ని ఇన్‌చార్జ్‌లపై నెట్టేయడం వల్ల ధనిక నాయకులు సైతం మున్సిపల్ ఎన్నికల్లో నిధులు కుమ్మరించడానికి ఇష్టపడటం లేదు. దీంతో దిగువ స్థాయి కార్యకర్తలు ఒంటరిగా మిగిలిపోయి రాజకీయంగా అనాథలవుతున్నారు. ఒకప్పుడు పార్టీకి ప్రాణవాయువులా నిలిచిన రాయలసీమ నెట్‌వర్క్ ఇప్పుడు శరవేగంగా బలహీనపడుతోంది.

ఇతర చోట్ల పార్టీని ఎలా కాపాడుకోగలరు? 

సొంత జిల్లాలో, సొంత అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకగ్రీవాలను అడ్డుకోలేకపోయిన జగన్ మోహన్ రెడ్డి, ఇకపై కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పార్టీని ఎలా కాపాడుకోగలరనేది  పెద్ద  ప్రశ్నగా మారింది. కేవలం బెదిరింపులు, తాడేపల్లి ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా, జగన్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి నామినేషన్ కేంద్రాల వద్ద కార్యకర్తలకు ధైర్యం చెప్పి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని ద్వితీయ శ్రేణి నేతలు భావిస్తున్నారు. నాయకుడు ముందు నిలబడకపోతే కార్యకర్తలు సుదీర్ఘకాలం పోరాటం చేయలేరని ఈ ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి. పులివెందుల కోటలోనే ఏకగ్రీవాల రూపంలో జెండా పాతిన అధికార కూటమి వ్యూహం విజయవంతమవ్వగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి తన సొంత సీమ రాజకీయాలను పునర్నిర్మించుకోకపోతే.. రాబోయే ప్రధాన ఎన్నికల నాటికి వైఎస్సార్‌సీపీ తన శాశ్వత చిరునామాను కోల్పోయే ప్రమాదం పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Krishna Water War: కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?
కృష్ణా జలాల వేడి - కుప్పం దాకా నీళ్లు.. మహబూబ్‌నగర్‌కు మొండిచెయ్యి - రికార్డులు చెబుతున్న నిజాలేంటి?
Church Aid Row: చర్చిలకు రూ.30 వేల సాయం.. రేవంత్ సర్కార్‌కు లాభమా? బీజేపీకి అస్త్రమా?
చర్చిలకు రూ.30 వేల సాయం.. రేవంత్ సర్కార్‌కు లాభమా? బీజేపీకి అస్త్రమా?
Delimitation Bill: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వేడి - ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్లు మారతాయా? చట్టపరమైన లెక్కలివే!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Panchayat Polls: జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
జనసేన, బీజేపీకి తొలి విడతలో నిరాశేనా? సోషల్ మీడియా హైప్ తేలిపోతుందా?
Akash Deep Fifer:  ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
ఆకాశ్ దీప్ ఫైఫ‌ర్ వృథా.. పేసర్ల ధాటికి కుప్పకూలిన భారత బ్యాటింగ్ లైనప్,  రెండోటెస్టులో పీకల్లోతు కష్టాల్లో టీమిండియా
Delimitation Bill: డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
డీలిమిటేషన్‌పై మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. కొత్త బిల్లులో భారీ మార్పులు.. సీట్లపై దక్షిణాదికి హామీ?
Hyderabad Crime News: కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
కార్తీక దీపం అంటుకుని యువతి మృతి.. కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం
Aakasamlo Oka Tara Review : తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
తంబీ నువ్ మావోనివి - మహానటి సావిత్రిలా సాత్విక... 'ఆకాశంలో ఒక తార'పై రాజమౌళి ప్రశంసలు
Ujjwal Nikam On Ajmal Kasab: కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
కసబ్ నోరు విప్పేందుకు సిగరెట్ ఆశ చూపా.. బిర్యానీ వార్తల్లో నిజం లేదు- ఉజ్వల్ నికమ్
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
శనివారం కొనుగోలు చేయకూడని 5 వస్తువులు ఇవే!
349cc ఇంజిన్‌తో Triumph Bonneville T40 నిజమైన మైలేజ్ ఇదే.. 195 కిలోల బరువు ప్రభావం ఎంత?
ట్రయంఫ్ బోన్నెవిల్ T40 రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో, హైవేపై లీటర్‌కు ఎంత ఇస్తుందో తెలుసా?
Embed widget