అన్వేషించండి

Andhra Politics : జనసేన పొత్తులు పెట్టుకుంటే వైఎస్ఆర్‌సీపీకి ఆందోళన ఎందుకు ? పవన్ టీడీపీతో కలిస్తే ఏం జరుగుతుంది ?

జనసేన పార్టీ టీడీపీతో కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందేనా ? ఒంటరిగా పోటీ చేయాలని పవన్‌ను ఎందుకు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది ?

Andhra Politics :  పవన్ కల్యాణ్ 175 సీట్లలో పోటీ చేస్తే ప్యాకేజీ స్టార్ అనబోమని వైఎస్ఆర్‌సీపీ నేత పేర్ని నాని ఆఫర్ ఇచ్చారు. "అన్ని సీట్లలో పోటీ చేసే సత్తా లేని పవన్.."  " దమ్ముంటే అన్ని చోట్లా పోటీ చేస్తానని ప్రకటించాలి" .. అనే డైలాగులు వైఎస్ఆర్‌సీపీ నేతల నుంచి తరచూ వినిపిస్తూంటాయి. రోజుకు ఇద్దరు, ముగ్గురైనా ఇలాంటి కామెంట్స్ చేస్తూంటారు. అయితే జనసేన పార్టీ రాజకీయ పార్టీ.. ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉండాలో ఆ పార్టీ అధినేత నిర్ణయించుకుంటారు. మరి వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు ? ఒంటరిగా పోటీ చేస్తేనే సరే...లేకపోతే విమర్శల దాడి చేస్తామని ఎందుకు అంటున్నారు ? జనసేన.. టీడీపీతో కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్‌సీపీకి వచ్చిన ఇబ్బందేమిటి ?

ఒంటరిగా పోటీ చేయాలని జనసేనానికి వైఎస్ఆర్‌సీపీ సవాల్ !

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ముక్త ఏపీని సాధిస్తామని.. అందు కోసం ఓట్లు చీలకుండా చూసుకుంటామని పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటి నుంచి వైఎస్ఆర్‌సీపీ తీరులో మార్పు వచ్చింది. పవన్ కల్యాణ్ చంద్రబాబుతో కలుస్తున్నారని విమర్శించడం ప్రారంభించారు. చంద్రబాబుతో కలవడం అంటే.. జనసైనికులకు ద్రోహం చేసినట్లేనని.. ప్యాకేజీ తీసుకునే ఇలా చేస్తారని ఆరోపించడం ప్రారంభించారు. ఆ ఆరోపణలు సవాళ్లుగా మారాయి. చివరికి పవన్ కల్యాణ్ .. ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటే ఓకే కానీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం మాత్రం తప్పేనని వైఎస్ఆర్సీపీ నేతలు వాదించడం ప్రారంభించారు. అయితే తమ పార్టీ విధానపరమైన నిర్ణయాలు తాము తీసుకుంటామని.. మీకేం ఇబ్బందని జనసేన వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి. అయితే జనసేన అడుగులపై వైఎస్ఆర్‌సీపీనే ఎక్కువ ఉత్కంఠకు గురి అవుతోందని ఆ పార్టీ నేతల స్పందనను బట్టి సులువుగా అర్థం చేసుకోవచ్చు. 

టీడీపీ - జనసేన కలిసి పోటీ చేస్తే ఇబ్బందని వైఎస్ఆర్‌సీపీ అనుకుంటోందా ?

జనసేన మద్దతుతో టీడీపీ 2014లో పోటీ చేసినప్పుడు టీడీపీ విజయం సాధించింది. 2019లో జనసేన విడిగా పోటీ చేసింది. వైఎస్ఆర్‌సీపీ గెలిచింది. ఇప్పుడు మళ్లీ టీడీపీకి దగ్గరవుతోంది. రెండు పార్టీలు కలిస్తే విజయం ఏకపక్షమన్న విశ్లేషణలు కొన్ని వర్గాల నుంచి వచ్చాయి. దీనికి కారణం ఉంది. స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీలకు చెందిన స్థానిక నేతలు ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో నేతలు ఎక్కడివక్కడ సర్దుబాటు చేసుకుని మంచి ఫలితాలు సాధించారు.  ఇది రెండు పార్టీల నేతల్ని ఆలోచనల‌లో పడేస్తోంది. బీజేపీతో కలిసి ఉండటం వల్ల జనసేనకు వచ్చే ప్లస్ పాయింట్లేమీ లేకపోగా మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే టీడీపీతో కలిస్తే ఖచ్చితంగా గెలుస్తారు అన్న ఫీలింగ్ వస్తుందన్న అభిప్రాయం బలపడుతోంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి జిల్లాలో ఫలితాలు జనసేన చీల్చిన ఓట్లతో మారిపోయాయి. అదే సమయలో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఆ పార్టీ ఎలాగూ గెలవదన్న కారణంగా ప్రత్యామ్నాయంగా ఓట్లు వేసిన ఓటర్లు కూడా ఉన్నారు. ఖచ్చితంగా జనసేనకు లాభిస్తుంది అనుకున్నప్పుడు ఆ పార్టీకి ఓటు వేసేవారి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందన్న అభిప్రాయం ఉంది. ఇదే అభిప్రాయం వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉందని తెలుస్తోంది. 

అధికార వ్యతిరేక ఓట్లన్నీ పోలరైజ్ అయితే అధికార పక్షానికి కష్టమే !

అధికారంలో ఉన్న పార్టీకి.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు చీలిపోతే లాభం. ఎంత చీలిపోతే అంత లాభం. మనది మెజార్టీ ప్రజాస్వామ్యం. వంద మందిలో యాభై ఒక్క మంది ఓట్లు తెచ్చుకోవాల్సిన పని లేదు.  ముఫ్పై మంది ఓట్లు తెచ్చుకున్నా చాలు..  అయితే తమ కంటే ఇతరులకు ఒక్క ఓటు కూడా ఎక్కువ రాకుండా చూసుకోవాలి. అంటే ఎవరికీ 31 రానివ్వకూడదు. అలా జరగాలంటే ఎక్కువ మంది పోటీలో ఉండాలి. వంద ఓట్ల కోసం ఐదుగురు పోటీ పడి... ఒకరు 21.. ఒకరు 19.. మిగతా ముగ్గురు ఇరవై తెచ్చుకున్నా గెలుపు 21 తెచ్చుకున్న వారిదే. అధికారం అంతా అతనికే దఖలు పడుతుంది. ఈ రాజకీయం తెలుసు కాబట్టి.. విపక్షాల్ని ఏకం కానీయకుండా చూసుకుంటాయి అధికార పార్టీలు. కానీ ఏపీలో ఆ వ్యూహం ఫలించడం లేదు. జనసేన పార్టీ విడిగా పోటీ చేసే ఆలోచనలే లేదు. ఓట్లు చీలకుండా చేసి వైఎస్ఆర్‌సీపీని ఓడించాలని నిర్ణయించుకుంది. 

పొత్తులు పార్టీల ఇష్టం...విమర్శలు రాజకీయమే !

జనసేన అధనేత తమ బలాన్ని..బలగాన్ని అంచనా వేసుకుని  ఒంటరిగా పోటీ చేయాలా.. పొత్తులు పెట్టుకోవాలో డిసైడ్ చేసుకుంటారు. అది ఆయన ఇష్టం. వైఎస్ఆర్‌సీపికి సంబంధం లేదు. ఆ పార్టీకి మేలు చేసేలా పవన్ నిర్ణయాలు తీసుకోరు. కానీ అలా తీసుకునేలా విమర్శలతో ఒత్తిడి చేయగలమని ఆ పార్టీ అనుకుంటోంది. కానీ పవన్ మాత్రం క్లారిటీగానే ఉన్నట్లుగా కనిపిస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
AP Local Body Elections: కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం
కొలిక్కిరాని చర్చలు.. నేడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీ నేతల భేటీ- చంద్రబాబుతో మాధవ్‌ సమావేశం

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
Jagan Cases ED Speed Up: జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
జగన్, వివేకా కేసుల్లో ఈడీ దూకుడుకు రాజకీయ మార్పులు కారణమా? వైఎస్ఆర్‌సీపీ వ్యూహం ఏమిటి?
Tamil Nadu Politics Shift: గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
గో బ్యాక్ మోదీ నుంచి వెల్కమ్ మోదీ దాకా - తమిళ రాజకీయాల్లో చెరిగిపోతున్న కాషాయ ద్వేషం !
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
Embed widget