అన్వేషించండి

Chandrababu : ప్రజలకు పథకాలే ముఖ్యం - కారణాలు కాదు ! చంద్రబాబుకు రిస్కే !

Andhra Pradesh: పథకాల అమలుపై చంద్రబాబు చెబుతున్న మాటల్ని ప్రజలు నమ్ముతారా అన్న సందేహాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రజలు స్కీమ్స్ అమలు చేశారా లేదా అన్నదే చూస్తారు.

Will people believe Chandrababu words about the implementation of schemes :  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ ఇచ్చిన ఓ రిపోర్టును ప్రజల ముందు పెట్టి.. పథకాల అమలుకు తాము ఎంత కిందా మీదా పడుతున్నామో వివరించారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలుకు వెసులుబాటు దొరకడం లేదని.. దొరికినప్పుడు అమలు చేస్తామన్నట్లుగా చెప్పారు. ఇదే విషయాన్ని విపక్ష నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పథకాల అమలుపై చంద్రబాబు మోసం చేశారని అంటున్నారు. అయితే టీడీపీ మాత్రం చంద్రబాబు మాటల్ని వక్రీకరిస్తున్నారని .. హామీ ఇచ్చిన ప్రకారం.. ఖచ్చితంగా సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్నక్యాంటీన్లు, గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తు చేస్తున్నారు. 

ఆర్థిక విధ్వంసం నిజమే కానీ ప్రజలకు సంబంధం లేదు !

జగన్ మోహన్  రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఏం జరిగిందో అందరూ చూశారని..  ఆ విధ్వంసం కళ్ల ముందే ఉందని టీడీపీ అధినేత తరచూ చెబుతున్నారు. తాజాగా ఆయన డేటా రూపంలో బయట పెట్టారు.  నీతి ఆయోగ్ నివేదికే సాక్ష్యమని ప్రజల ముందు పెట్టారు.  ఎంత మందికి అర్థం అవుతుందో .. ఎంత మంది దాన్ని పట్టించుకుంటారన్నది పక్కన పెడితే..ఓ వాస్తవాన్ని ప్రజల ముందు ఉంచారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఈ కారణం చూపి..  సూపర్ సిక్స్ విషయంలో వెనుకడుగు వేయలేరు. అలా చేస్తే  పథకాల విషయంలో మోసం చేశారని వైసీపీకి నేరుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం కల్పించినట్లే అవుతుంది. 

అప్పులు చేసి, నిధులు మళ్లించి పథకాలు అమలు చేసే విధానానికి వ్యతిరేకం ! 

రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పధకాలకు వచ్చిన నిధులను మళ్లించలేమని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే అప్పులు చేసి పథకాలు అమలు చేయడం అనే విధానానికి చంద్రబాబు వ్యతిరేకం. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి ఆస్తులను సృష్టించాలన్నది ఆయన విధానం. కానీ ఇప్పుడు మరో మార్గం లేదు. సూపర్ సిక్స్ లో రెండు అత్యంత కీలక పథకాలు..  అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఈ రెండు పథకాలను ముందుగా అమలు చేస్తే..ఇతర వాటి విషయంలో సమయం తీసుకున్నా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పటికే పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్నారు. జగన్ చేసింది విధ్వంసమే కారణంగా ఆ కారణం.. ఇవ్వలేకపోతున్నామని చెప్పడాన్ని ప్రజలు హర్షించరు. అందుకే చంద్రబాబు .. అప్పులు చేసైనా ఇస్తామని అంటున్నారు. 

ప్రజలు పథకాలే కోరుకుంటారు.. కారణాలు కాదు ! 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ..జగన్ చేసిన అప్పులపై స్కీమ్స్ ప్రకటన చేసినప్పుడే తెలుగుదేశం పార్టీకి ఓ స్పష్టత ఉంది.  అలాంటి సమయంలో పథకాలను ప్రకటించకుండా  రాష్ట్రాన్ని చక్కదిద్దుతామని చెప్పి ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్న  కానీ నని అవసరమైన వారికి మాత్రం అందాల్సిన ఖచ్చితమైన సంక్షేమాన్ని  మాత్రమే ఇస్తానని ప్రకటించి ఉంటే.. ప్రజలు అర్థం చేసుకునేవారన్న అభిప్రాయం ఉంది. కానీ హామీలు ఇచ్చేశారు .. గెలిచారు కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా అమలు చేయాల్సిందే. చేయలేకపోయామని చెబితే అది పెద్ద మైనస్ అవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
UP Elections 2027 Analysis: ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
Invest Telangana Global Summit 2026: కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
YS Sharmila Invitation Controversy: పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Embed widget