అన్వేషించండి

Atmakur Elections : ఆత్మకూరులో పోటీపై తేల్చని పార్టీలు - విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థేనా ?

ఆత్మకూరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంపై విపక్షాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జనసేనతో చర్చించకుండానే తాము పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఇప్పుడు టీడీపీ ఏ నిర్ణయం తీసుకోనుందనే చర్చ జరుగుతోంది.


Atmakur Elections : ఆత్మకూరులో ఉప ఎన్నిక జరగబోతోంది. అధికార పార్టీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలో దిగుతున్నారు. మేకపాటి గౌతంరెడ్డి మరణించడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల ఇరవై మూడో తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ఇప్పుడు అక్కడ ఎవరెవరు పోటీ చేస్తారన్న చర్చ ప్రారంభమయింది. వైఎస్ఆర్‌సీపీ తరపున మేకపాటి కుటుంబం నుంచి విక్రమ్ రెడ్డి పేరును గతంలోనే ఖరారు చేశారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎవరు ఉంటారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. 

తాము పోటీ చేస్తామంటున్న బీజేపీ !

తాము ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేస్తామని బీజేపీ నేత సోము వీర్రాజు ప్రకటించారు. అయితే అభ్యర్థి ఎవరు అన్నదానిపై స్పష్టత లేదు. బరిలో ఏ ఇతర పార్టీ లేకపోతే.. ఆత్మకూరులో కాస్త పట్టు ఉన్న ఎవరో ఓ నేత వస్తారన్న అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే భారతీయ జనతాపార్టీ తమ మిత్రపక్షం జనసేనతో సంప్రదింపులు చేయకుండానే ఈ ప్రకటన చేసింది. ఇప్పటి వరకూ వచ్చిన ఉపఎన్నికల్లో బీజేపీనే పోటీ చేస్తూ వస్తోంది. తిరుపతి పార్లమెంట్ స్థానం,  బద్వేలు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీనే పోటీ చేసింది. బద్వేలులో ముందుగానే జనసేన పోటీ లో ఉండటం లేదని ప్రకటించింది. అయితే బీజేపీ బరిలో ఉండటంతో ఆ పార్టీకి మద్దతు ఇచ్చింది. 

ఇంకా స్పందించని జనసేన !

ఇప్పుడు ఆత్మకూరులో జనసేన పోటీ చేయాలా వద్దా అన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పొత్తు ధర్మం ప్రకారం సోము వీర్రాజు.. జనసేనతో చర్చలు జరిపి ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఒక వేళ జనసేన పోటీకి సిద్ధంగా ఉంటే ఆ పార్టీ వాదనను కూడా పార్టీ హైకమాండ్‌కు వివరించాల్సి ఉంది. అయితే ఇక్కడ తామే పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించడంతో జనసేన ఏం చేస్తుందన్నది ఇంకా స్పష్టత రాలేదు. 

టీడీపీ సంప్రదాయాన్ని ఫాలో అవుతుందా ?

టీడీపీ పోటీ చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. సాధారణంగా ఓ ఎమ్మెల్యే చనిపోతే కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇస్తే పోటీ చేయని సంప్రదాయం ఉంది. టీడీపీ దాన్ని పాటిస్తోంది. అయితే ఇప్పుడు మేకపాటి గౌతంరెడ్డి భార్యకు కాకుండా ఆయన సోదరుడికి టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ పోటీ చేయాలనుకుంటే ఈ కారణం చూపించే అవకాశం ఉంది. అలాగే .. సానుభూతితో పోటీ చేయకపోతే.. పారిపోయారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాలతో అయినా పోటీ చేయక తప్పని పరిస్థితి ఉందన్న చర్చ టీడీపీలో ఉంది. మహానాడులో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

భారీ మెజార్టీపై వైసీపీ కన్ను !

తమ పాలనపై వ్యతిరేకత ఉందని విపక్షాలు ప్రచారం చేస్తున్నందున ఆత్మకూరులో భారీ మెజార్టీ సాధించి.. అందరికీ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్‌సీపీ పట్టుదలగా ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్‌ను అరికట్టడం ఎలా?
YSRCP MLA Disqualification Issue: అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
అనర్హత వేటు వేసుకోండి .. వైసీపీ పొలిటికల్ ఆఫర్ వెనుక అసలు వ్యూహమేంటి? స్పీకర్ ఏం చేయబోతున్నారు?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget