అన్వేషించండి

KCR National Party : బీఆర్ఎస్‌ పెడితే టీఆర్ఎస్ పరిస్థితేంటి ? విలీనమవుతుందా ? ప్రత్యేక పార్టీగానే ఉంచుతారా?

కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభిస్తే టీఆర్ఎస్‌ను ఏంచేస్తారు ? విలీనం చేస్తారా ? తెలంగాణ వరకూ టీఆర్ఎస్‌నే కొనసాగిస్తారా ?

KCR National Party :  తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి ముహుర్తం ఖరారు చేసుకున్నారు. దసరా రోజున లాంఛనంగా ప్రకటన చేయబోతున్నారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించబోతున్నారు. జాతీయ పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి లేదా..  భారతీయ రైతు సమితి .. ఏదైనా కావొచ్చు.. మొత్తంగా బీఆర్ఎస్. అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న సందేహం. కేసీఆర్ బీఆర్ఎస్‌ను ప్రకటించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి ? తెలంగాణలో ఆ పార్టీని బీఆర్ఎస్‌లో విలీనం చేస్తారా ? లేకపోతే బీఆర్ఎస్ శాఖగా టీఆర్ఎస్ కొనసాగుతుందా ? కేసీఆర్ ఎలాంటి ఆలోచనల్లో ఉన్నారు?

టీఆర్ఎస్ అంటే ఓ చరిత్ర!

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రస్తావన రాకుండా తెలంగాణ రాష్ట్రం ఉండదు. ఎందుకంటే ప్రజల్లో అడుగంటిపోయిన ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిల్చి.. ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్, టీఆర్ఎస్‌ను నడిపించిన  వారు కేసీఆర్. తెలంగాణ అంటే టీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం సాగింది. తెలంగాణ రాష్ట్ర సమితి లేని తెలంగాణను ఊహించలేము. కానీ ముందు ముందు ఈ పార్టీ ఉంటుందా అనే సందేహం ప్రారంభమైంది. ఇతర పార్టీలు రాజకీయ వ్యూహాలతో టీఆర్ఎస్‌ను నిర్వీర్యం చేయడం కాకుండా స్వయంగా కేసీఆరే టీఆర్ఎస్‌ను అంతర్థానం చేయాల్సిన పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణం. 

జాతీయ పార్టీ పెడితే తెలంగాణలో ఏ వ్యూహం అమలు చేస్తారు ?

కేసీఆర్ జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఉన్న పార్టీనే మళ్లీ ఆయన లాంచ్ చేయలేరు.పైగా తెలంగాణ కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్ర సమితి. జాతీయ పార్టీగా ఆ పేరుతో ప్రజల్లోకి వెళ్లలేదు. అందుకే బీఆర్ఎస్ పేరు తెరపైకి వచ్చింది. కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో దసరా రోజున ప్రకటన చేయడం ఖాయమనుకోవచ్చు. మరి అప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ  ప్రకటన తర్వాత అనేక సమస్యలు తెరపైకి వస్తాయి.

రెండు పార్టీలకు అధ్యక్షుడిగా ఉండలేరు!

ఓ ప్రాంతీయ పార్టీ.. మరో జాతీయ పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండలేరు. నిబంధనలు అందుకు అంగీకరించవు. అసలు అలాంటి ఆలోచన కూడా ఎవరికీ రాదు. జాతీయ  పార్టీ ప్రకటించిన వెంటనే కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలి. ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ మరో పార్టీని ప్రకటిస్తే అది నిబంధనల ప్రకారం చెల్లుబాటు కాకపోవచ్చు. అందుకే కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్ష పదవిని వదులుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. 

బీఆర్ఎస్‌లో టీఆర్ఎస్‌లో విలీనం చేస్తారా?

కేసీఆర్ జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే.. ఆ పార్టీలో టీఆర్ఎస్‌ను విలీనం చేయాలి. అప్పుడు టీఆర్ఎస్ అంతర్ధానం అయిపోతుంది. ఇలా చేయడం పార్టీకి మంచిది కాదని.. మనదైన గుర్తింపు పోతుందని టీఆర్ఎస్ క్యాడర్ ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉంది. విలీనం చేసినా అనేక సమస్యలు వస్తాయి. పార్టీ గుర్తు దగ్గర్నుంచి ప్రతీ అంశాన్ని మళ్లీ కొత్తగా చెక్కుకుంటూ రావాలి.  అంతకు మించి తెలంగాణ ప్రజల్లో మన పార్టీ అనే భావనపోతుంది. అదే జరిగితే మూలాలను పెకిలించుకున్నట్లే అవుతుంది.  

ప్రత్యేక పార్టీగా ఉంచి కేటీఆర్‌కు అప్పగిస్తే !?

టీఆర్ఎస్‌ను ప్రత్యేక పార్టీగానే ఉంచి.. బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా చేస్తే చాలన్న వాదన కూడా వినిపిస్తోంది. కేసీఆర్ అధ్యక్ష పదవుల నుంచి వైదొలిగి.. కేటీఆర్‌కుపూర్తి స్థాయి చార్జ్ అప్పగిస్తే సరిపోతుందని.. బీఆర్ఎస్ .. తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో మాత్రమే పోటీ చేస్తుందని.. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ రూపంలో బరిలో ఉండేలా ప్లాన్ చేయవచ్చని చెబుతున్నారు. ఇలా అయినా తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి. టీఆర్ఎస్, బీఆర్ఎస్ వేర్వేరుగానే గుర్తింపు పొందుతాయి. ఎంపీలు కూటమిగానే ఉండాల్సి వస్తుందికానీ ఒకే పార్టీగా కాదు. 

మొత్తంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ అడుగులు చాలా క్లిష్టమైనవి. ఇతర రాష్ట్రాల్లో ప్రజల మనసులు గెల్చుకోవడం సంగతి ర్వాతా ముందు పార్టీ పరంగా పరిష్కరించుకోవాల్సిన సవాళ్లు చాలా ఉంటాయి. 

టాప్ హెడ్ లైన్స్

Donald Trump Impeachment Possibility: కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
కాంగ్రెస్‌పై విపక్షాల పట్టు - ట్రంప్‌కు ఇంపీచ్‌మెంట్ గండం నిజమేనా.. అమెరికా రాజ్యాంగం ఏం చెబుతోంది?
Chirala AP Municipal Election Results : చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
చీరాల మున్సిపల్ షాక్ - కాంగ్రెస్ పుంజుకుందా.. ఆమంచి చాటుకున్నది సొంత బలాన్నా?
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Vijayasai Reddy: కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?
కోటరీ తెచ్చిన కొత్త పార్టీ - జగన్‌పై విజయసాయిరెడ్డి ప్రతీకార పోరు మొదలైందా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MPTC ZPTC Election Results: ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా ఎన్నికల ఫలితాలు
ఏపీ పరిషత్ తుది ఫలితాలపై ఎస్ఈసీ ప్రకటన.. జిల్లాలవారీగా MPTC, ZPTC Results
Hyderabad News: బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
బాణసంచా ప్రమాదాలు.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన బాధితులు
Low Fibre Risks : ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
ఫైబర్ ఫుడ్స్ తినకపోతే జీర్ణక్రియ, బరువు తగ్గడంపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఏవి తింటే మంచిది?
Real World Mileage: కొత్త Honda City Hybridలో ఫుల్ ట్యాంక్‌తో 750km ప్రయాణించవచ్చా? రియల్‌ వరల్డ్‌లో ఎంత మైలేజ్ ఇస్తోంది?
2026 హోండా సిటీ హైబ్రిడ్ నిజమైన మైలేజ్ ఎంత? సిటీలో, హైవేపై 'రియల్ టెస్ట్‌'లో తెలిసిన నిజాలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Gym Beginner Guide : జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
జిమ్ మొదటిసారి జాయిన్ అయ్యేవారు చేయకూడని తప్పులు ఇవే.. ఆ మిస్టేక్స్ చేయకండి
Petrol Saving Tips: మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
మైలేజ్ పెంచుకునేందుకు ఈ టిప్స్ పాటించండి.. ఇలా చేస్తే మీ ఖర్చులు తగ్గుతాయి !
Telangana CID Dharani Land Scam : ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
ధరణి అక్రమాలపై సీఐడీ ఉక్కుపాదం - బీఆర్ఎస్ నేతల మెడకు భూ కుంభకోణం చుట్టుకోనుందా?
Embed widget