అన్వేషించండి

Vijayashanti For BRS : బీఆర్ఎస్‌కు సపోర్టుగా విజయశాంతి - మారిన రాములమ్మ రాజకీయం

Telangana Politics : బీఆర్ఎస్ ఉండదంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. ప్రాంతీయ భావోద్వేగాలు దక్షిణాదిన సహజమని అన్నారు.

Vijayashanti Fire On Kishan Reddy : రాజకీయాల్లో కొంత  కాలంగా సైలెంట్ గా ఉన్న విజయశాంతి హఠాత్తుగా బీఆర్ఎస్‌కు మద్దతుగా తెరపైకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్  ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమననారు.  ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం అని చెప్పుకొచ్చారు.   

 నిజానికి ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఉండదని బీజేపీ నేతలే కాదు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే విజయశాంతి కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకుందని.. బీజేపీ నేతలే అర్థం చేసుకోలేదన్నట్లుగా సోషల్ మీడియాలో స్పందించారు. ప్రస్తుతం విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆమె బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆమెను పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె పేరు పరిగణనలోకి తీసకోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పట్టించుకోలేదు. కనీసం ప్రచారానికి కూడా పిలువలేదు. 

కాంగ్రెస్ తీరుపై ఆమె అసంతృప్తిలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి  సొంత పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ తర్వాత తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున ఎంపీగా గెలిచారు. పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ లో పోరాడారు. తెలంగాణ ఇస్తే.. టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత అలా చేయలేదని విజయశాంతి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరపున మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.                 

ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనకపోయినప్పటికీ.. కాంగ్రెస్ లోనే కొనసాగారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరినా ఎన్నికల వరకూ ఉండలేదు. బీఆర్ఎస్ ను ఓడించే పార్టీ కాంగ్రెస్సేనని అనుకుని మళ్లీ ఆ పార్టీలో చేరారు. ఇన్ని పార్టీలు మారడం వల్ల ఆమెకు రాజకీయాల్లో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ కు మద్దతుగా మాట్లాడుతూండటం ఆసక్తికరంగా మారింది.                                 

టాప్ హెడ్ లైన్స్

Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
Modi Cabinet Expansion | దీపావళికి ముందే మోదీ క్యాబినెట్ ప్రక్షాళన!  తెలంగాణ, ఏపీ కోటాలో మార్పులు?
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
SIRపై తెలంగాణ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. హైదరాబాద్‌లో భారీ సభకు రెడీ..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Holidays: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా 4 రోజులు సెలవులు, ట్విస్ట్ ఏంటంటే..
Congress Politics: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్.. 77 మంది ఇంఛార్జిల నియామకం!
Indrakeeladri Dasara: కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు.. మూలానక్షత్రం కావడంతో పోటెత్తిన భక్తజనం
Gade Sai Krishna CBI Investigation: సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
సీబీఐ చేతికి గాదె సాయికృష్ణ కేసు.. తల్లికి రూ.25 లక్షల పరిహారం- హైకోర్టు కీలక తీర్పు
Google Search: గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
గూగుల్ సెర్చ్‌లో కీలక మార్పులు.. AI ఓవర్ వ్యూస్‌తో పాటు వెబ్‌సైట్ లింక్‌లకు చోటు
AP Local Body Elections: బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
బెడిసికొట్టిన క్రేజీ కళ్యాణం.. పదవి కోసం హడావుడిగా టీడీపీ నేత పెళ్లి.. ఊహించని ట్విస్ట్
CJP Protest: అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న సీజేపీ నేత
అభిజీత్ దీప్కే ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. జైలుకైనా సరే వెళ్తామన్న CJP నేత
Narnia Telugu Trailer : నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
నార్నియా సరికొత్త ప్రపంచం - లేటెస్ట్ విజువల్ వండర్ తెలుగు ట్రైలర్ రివ్యూ
Embed widget