Vijayasaireedy Twitter Language : ట్విట్టర్‌లో విజయసాయిరెడ్డి దారుణమైన భాష - టీడీపీ నేత అయ్యన్నపై తిట్ల వర్షం !
ట్విట్టర్‌లో టీడీపీ నేతలను విమర్శించే భాష విషయంలో విజయసాయిరెడ్డి అన్ని గీతలూ దాటేశారు. తాజాగా ఆయన అయ్యన్న పాత్రుడిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.
Vijayasaireedy Twitter Language : తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నేను రెండు అంటా అని రాజకీయ నేతలు హద్దులు దాటిపోతున్నారు. ఏపీ రాజకీయ నేతలు అయితే... ఇలా కూడా విమర్శించుకోవచ్చా అని రోజు రోజుకూ ప్రజల్ని ఆశ్చర్య పరుస్తున్నారు. రాజకీయ నాయకుల భాష ఇంత కంటే ఎక్కువ దిగజారరులే అనుకున్న ప్రతీ సారి మరింతగా దిగజారిపోతోంది. ప్రెస్‌మీట్లలో మీడియా ముందు మాట్లాడే భాషలో కొడాలి నాని, వల్లభనేని వంశీ , అంబటి రాంబాబు వంటి వారు ప్రత్యేకత సాధించగా... సోషల్ మీడియాలో వారి స్థాయిలో ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఆయన అయ్యన్నపాత్రుడు గురించి చేసిన ట్వీట్లు ఇవి.
బాయ్య లోకెల్లా అతి పెద్ద బాయ్య... వాడి పేరు చింతకాయ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) May 31, 2022
ఈ కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్గాడు, తాగేది మందు... దూరేది సందు... చెప్పేది శ్రీరంగనీతులా? ఈ అడ్డగాడిద మత్తు అడ్డంగా దింపేసే టైమ్ దగ్గర పడింది…
రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడం అనేది సహజం. కానీ ఇక్కడ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్లను విమర్శలు అనడం కన్నా తిట్లు అనడమే కరెక్ట్‌గా ఉంటుంది. ఇలాంటి తిట్లు ఎవరూ బహిరంగంగా తిట్టుకోరు.
కనకపు సింహాసనం మీద అయినా, కలియుగ వైకుంఠంలో అయినా కుక్కది ఒకటే బుద్ధి...వీడు తిరుమలలోను అదేలా కాలెత్తి పోశాడు. pic.twitter.com/DUBM3ULOea
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 1, 2022
విజయసాయిరెడ్డి విద్యాధికుడు. ఆయన అందర్నీ గౌరవించి.. గౌరవం పుచ్చుకుంటారని చెబుతారు. అయితే ఇదంతా ఆయన రాజకీయాల్లోకి రాక ముందే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ వదిలేయాలనే ఓ సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మారేమో కానీ.. ఆయన మాట తీరు మారిపోయింది. అది రాను రాను దిగజారిపోతూ వస్తోంది. చివరికి.. ఆయన చేస్తున్న ట్వీట్ల గురించి ఫీడ్ బ్యాక్ తెలుసుకోండి అని ఇతరులు సలహాలివ్వాల్సిన పరిస్థితి వచ్చింది.
.@VSReddy_MP గారు,
— Bandaru Appala Naidu (@BandaruTDP) June 1, 2022
మీ ఖాళీ సమయంలో ఒకసారి సోషల్ మీడియాలో మీరు వాడుతున్న భాషను ఒకసారి మీరే చదువుకోండి!! లేదా మీ సన్నిహితులతో చదివించండి, మీరు రాజకీయాలకు రాక ముందు మీ మీద వాళ్లకున్న అభిప్రాయం ఏంటో ఇప్పుడు వాళ్లకి వస్తున్న అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకోండి!!
అనడానికి మాటలే. అందరికీ నోళ్లుంటాయి. ఎవరైనా ఒక తిట్టు తిడితే ఎదుటి వాళ్లు నాలుగు తిడతారు. ఆ లాంగ్వేజ్ఒకరి సొత్తు కాదు. విజయసాయిరెడ్డి అలా తిట్లను ట్వీట్లుగా పెడితే అంత కంటే దారుణంగా ఆయనను ఆయన కుటుంబసభ్యులను కూడా విమర్శిస్తూ సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు పోస్టులు పెడుతూనే ఉన్నారు.
ఇలా ఒకరినొకరు దారుణంగా విమర్శించుకుంటున్నట్లుగా తిట్టుకోవడం వల్ల... ఒకరిపై ఒకరు అసహ్యం పెంచుకోవడం.. ఇలాంటి భాష మాట్లాడతారా అని ప్రజల్లోనూ ఆశ్చర్యం కలిగించడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రజల్లో విలువ పోగొట్టుకోవడం తప్ప . కానీ ఈ విషయాన్ని రాజకీయ నేతలు గుర్తించలేకపోతున్నారు.