News
News
వీడియోలు ఆటలు
X

మాకేదో కొడుతోంది! సార్‌ మీరు మారిపోయారు! చంద్రబాబు పుట్టిన రోజున విజయసాయిరెడ్డిపై ట్రోలింగ్

చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్రోలింగ్‌కి గురవుతున్నారు. మీరు మారిపోయార్ సార్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టిన ఓ ట్వీట్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అదెదో పెద్ద విషయం కూడా కాదు. కేవలం పుట్టిన రోజులు శుభాకాంక్షల ట్వీటే. అది కూడా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబుకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు చెప్పారు. 

టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడుకి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా అంటూ విజయ్ సాయిరెడ్డి పెట్టిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతోంది. గతంలో ఆయన పెట్టిన ట్వీట్‌లను వెలికి తీసి మరీ మీరు మారిపోయార్‌ సార్ అంటున్నారు నెటిజన్లు. 

గతంలో చంద్రబాబుకు పుట్టిన రోజుల సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన విజయసాయిరెడ్డి వివాదాస్పద భాషను వాడారు. 2021 ఏప్రిల్‌ 20న చేసిన ట్వీట్‌ కూడా వైరల్‌గా మారుతోంది.

అయితే చాలా రోజుల నుంచి విజయసాయిరెడ్డి ట్వీట్‌లలో మార్పు కనిపిస్తోంది. ఎప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై తనదైన శైలిలో విరుచుక పడే ఆయన ఈ మధ్య కాలంలో చాలా నెమ్మదించారు. గతంలో పరుషపదజాలంతో ట్వీట్లు చేసేవారు. ఇప్పుడు ఆ వివాదాలు ఆయన ట్వీట్‌లలో కనిపించడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలపై ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై ఎక్కువగా ట్వీట్లు చేస్తున్నారు. అది కూడా హిందీలో ఎక్కువగా ట్వీట్లు కనిపిస్తున్నాయి.

రామోజీరావుపై సైలెన్స్
గతంలో రామోజీగ్రూప్  చైర్మన్ రామోజీరావు అన్నా ఈనాడు అన్నా పూనకం వచ్చేలా ట్వీట్‌లు వేసే విజయసాయిరెడ్డి ఇప్పుడు వారి జోలికే వెళ్లడం లేదు. ఈ మధ్య కాలంలో మార్గదర్శి ఇష్యూలో కూడా ఆయన ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ప్రభుత్వ పెద్దలు ఆ సంస్థపై, రామోజీరావుపై గుర్రుగా ఉన్నా సాయి రెడ్డి నుంచి ఉలుకూపలుకూ లేదు. 

Published at : 20 Apr 2023 12:46 PM (IST) Tags: Vijaya sai reddy TDP Chandra Babu HBD CBN

సంబంధిత కథనాలు

Telangana politics  : కేసీఆర్ విమర్శించకపోవడమే అసలు కష్టం - బీజేపీ సమస్యకు పరిష్కారమేది ?

Telangana politics : కేసీఆర్ విమర్శించకపోవడమే అసలు కష్టం - బీజేపీ సమస్యకు పరిష్కారమేది ?

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు - ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

AP TDP Plan : ఓటర్లకు ముందుగానే పథకాల కార్డులు -  ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్ !

Mini Jamili Elections : మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

Mini Jamili Elections :  మినీ జమిలీ ఎన్నికలకు కేంద్రం ప్లాన్ - తెలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ మారబోతోందా ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

BJP Dilemma : ఏపీ, తెలంగాణలో బీజేపీకి బ్రేకులేస్తోంది హైకమాండేనా ? - ఎందుకీ గందరగోళం ?

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

IND vs AUS Final: ఫాలోఆన్ ప్రమాదంలో టీమిండియా, ఫైనల్లో ఐపీఎల్ సింహాలకు చావుదెబ్బ

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam