అన్వేషించండి

Bheti Subhash Reddy : బీఆర్ఎస్‌కు షాకిచ్చిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే - బీజేపీకి సపోర్ట్ చేస్తానని ప్రకటన

Telangana News : బీజేపీకి మద్దతివ్వాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు.

Uppal former MLA Bheti Subhash Reddy Resigns BRS : బీఆర్ఎస్ పార్టీని ముఖ్యనేతలు వీడుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కారు దిగేశారు. కొందరు కాంగ్రెస్‌లోకి, మరికొందరు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉన్న కొద్దీమంది నేతలు కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు వెళ్లిపోవాలని డిసైడ్ అయిపోయారు. తాజాగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు పంపారాయన. మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి రాజీనామా వెనుక కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ విషయంలో పార్టీ హైకమాండ్ ఎవరినీ సంప్రదించకుండానే లక్ష్మారెడ్డికి కేటాయించడమే కారణం.        

తన  రాజీనామాకు కారణాలు వివరిస్తూ సుభాష్ రెడ్డి ఓ లేఖను కేసీఆర్ కు పంపారు. 'నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ అభివృద్దికి కోసం పాటుపడ్డాను. నాపై ఎటువంటి మచ్చలేకున్నా.. గత ఎన్నికల్లో నన్ను కాదని బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇచ్చారు. అయినా మీ మీద విశ్వాసంతో పార్టీకి విధేయుడిగా ఉంటూ ఆయన గెలుపు కోసం కృషి చేశారు. ఎంపీ ఎన్నికల్లోనైనా అవకాశం వస్తుందని ఆశించాను. మాటమాత్రం చెప్పకుండా, ఎటువంటి చర్చ లేకుండానే రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ మాత్రం నా తోటి ఉద్యమ సహచరుడు ఈటల రాజేందర్‌కు టికెట్ ఇచ్చింది. బీఆర్ఎస్ అవకాశవాద ఎంపీలను గెలిపించటం కంటే.. ఉద్యమ సహచరుడు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. కావునా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తునా.' అని సుభాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.                      

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కనీసం నియోజకవర్గాల నేతలను సంప్రదించకుండా  సొంతంగా నిర్ణయం తీసుకోవడంపై ఆయన కాసింత ఆగ్రహంగా ఉన్నారు. దీనికితోడు ముఖ్యనేతలంతా కారు దిగిపోవడంతో ఇక ఆ పార్టీ పనైపోయిందని భావించారు. చివరకు రాజీనాామా ద్వారా తన నిర్ణయాన్ని వెల్లడించారు.  బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి.                                 

2018లో ఉప్పల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుభాష్ రెడ్డికి గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు. చివరి నిమిషం వరకు ప్రయత్నించినా.. ఆయనకు నిరాశే దక్కింది. బండారు లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వటంతో అప్పట్నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఆయన పార్టీని వీడుతారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతుండగా.. తాజాగా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు.ఉద్యమ కారుడు ఈటెల రాజేందర్‌కు కమలం పార్టీ టికెట్ ఇచ్చిందని, ఆయనను గెలిపించేందుకు నిర్ణయించు న్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. బేతి బాటలోనే మరికొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారంలో మరికొందరు నేతలు కారు దిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.  

టాప్ హెడ్ లైన్స్

CM Vijay And Chandrababu Meeting: చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్కంఠ, చర్చించిన అంశాలివే
AP Local Body Elections: గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
గెజిట్ నోటిఫికేషన్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్.. ఆన్‌లైన్‌లో నామినేషన్ల విజ్ఞప్తి పరిశీలన: ఏపీ ఎస్ఈసీ
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Telangana SIR Electoral Roll Purge: ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!
ఓట్ల తొలగింపుపై గల్లీ మౌనం - రికార్డు స్థాయి కోతలు జరుగుతున్నా రోడ్డెక్కని బాధితుల పోరాటాలు!

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget