News
News
X

YSRCP Observers : పరిశీలనలోనే "పరిశీలకుల" నియామకం - వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ పునరాలోచన చేస్తోందా ?

నియోజకవర్గానికో పరిశీలకుడ్ని నియమించాలనుకున్నారు వైఎస్ఆర్‌సీపీ అధినేత. దసరాకు వస్తుందనుకున్న జాబితా విడుదల కాలేదు.

FOLLOW US: 

YSRCP Observers : దసరాకు అన్ని నియోజకవర్గాలకు వైఎస్ఆర్‌సీపీ తరపున ఓ పరిశీలకుడ్ని నియమిస్తారు. వారు వీరు అనే తేడా లేదు. అన్ని నియోజకవర్గాలకూ పార్టీ నేతల నుంచే పరిశీలకులుగా నియమిస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. సీఎం జగన్ కూడా అంతర్గత సమావేశాల్లో పార్టీ నేతలకు ఇదే విషయాన్ని చెప్పారు కూడా.  ఇప్పుడు దసరా వెళ్లిపోయింది. ఇప్పుడు పరిశీలకుల నియామకం  గురించి పెద్దగా ఎక్కడా స్పందించడం లేదు. ఎవరూ మాట్లాడటం లేదు. దీంతో పరిశీలకుల నియామకంపై జగన్ పునరాలోచన చేస్తున్నారన్న అభిప్రాయం వైఎస్ఆర్‌సీపీలో వినిపిస్తోంది 

పరిశీలకుల నియామకంపై కసరత్తు చేసి మరీ సైలెంట్ అయిన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ !

వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారే ఇంచార్జులు ఉన్నారు. లేని చోట్ల ఓడిన వారు కొంత మంది..  కొత్తగా నియమితులైన వారు కొంత మంది ఇంచార్జులుగా ఉన్నారు. ఇటీవల నియోజకవర్గాలకు పరిశీలకుడ్ని నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు.  ప్రతి నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించాలని.. నిర్ణయించి  జాబితారె డీ చేశారు.  ప్రస్తుతం ఉన్న నియోజకవర్గ ఇంఛార్జ్‌కు అదనంగా పరిశీలకుడు ఉంటారు.   ఇప్పటికే ప్రతి ఎమ్మెల్యే.. ఇంచార్జిని ఐ ప్యాక్ టీం ఫాలో చేస్తోంది. వారేం చేస్తున్నారో పరిశీలిస్తోంది. నివేదికలిస్తోంది. అందుకే  జగన్... ఎమ్మెల్యేలు గడప గడపకూ వెళ్లడం లేదని జగన్‌కు రిపోర్టులు వెళ్తున్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లోనూ కొత్తగా పరిశీలకుడ్ని నియమించాలని జగన్ అనుకున్నారు. కసరత్తు చేసి మరీ ఆగిపోయారు. 

ప్రత్యామ్నాయ నాయకత్వం ఉండాలనుకుంటున్న హైకమాండ్ !

News Reels

పరిశీలకుల నియామకంగా కొత్త సమస్యలు వస్తాయని కొంత మంది పార్టీ నేతలు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే సీఎం జగన్ మాత్రం నియోజకవర్గంలో ఒకే నేత పెత్తనం ఉండటం వల్ల పార్టీ బలోపేతం కావడం కన్నా.. వ్యక్తిగతంగా లీడర్ బలోపేతం అవుతున్నారని ఇలాంటి పరిస్థితిని నివారించడానికి ప్రత్యామ్నాయ నాయకత్వం అవసరం అని భావించినట్లుగా తెలుస్తోంది. అందుకే పరిశీలకుడు లేదా అదనపు సమన్వయకర్త పేరుతో మరొకరిని ప్రోత్సాహించాలని నిర్ణయించుకున్నారు.  ఐ ప్యాక్ టీం కూడా ఈ విషయంపై స్పష్టమైన సూచనలు చేయడంతో జగన్ కూడా అంగీకరించారు. అయితే ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గారన్నది మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

ఎమ్మెల్యేలు, ఇంచార్జుల అసంతృప్తిని కట్టడి చేయలేమనుకున్నారా ? 

ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి పని చేస్తున్న తమకు పోటీగా మరో పరిశీలకుడ్ని నియమించడంపై ఎమ్మెల్యేలు, ఇంచార్జులు అసంతృప్తి వ్యక్తం చేయడం ఖాయం.  తాడికొండకు అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాదరావును నియమించడంతో చెలరేగిన చిచ్చు ఇప్పటికీ ఆరలేదు. నియోజకవర్గ వైఎస్ఆర్‌సీపీ క్యాడర్  మొత్తం రెండు వర్గాలుగా విడిపోయింది. ఇదే పరిస్థితి ఇతర నియోజకవర్గాల్లో వస్తే అనకున్నదొక్కటి.. అయిందొక్కటి అయిన చందంగా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలన జరిపిన తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.  ఇప్పటికైతే పరిశీలకుల నియామకం హోల్డ్‌లో పెట్టినట్లే...!

Published at : 10 Oct 2022 06:00 AM (IST) Tags: YSRCP YCP chief Jagan YCP Observers Controversy

సంబంధిత కథనాలు

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Kavitha vs Revanth: సీఎం కేసీఆర్‌ది దొంగ దీక్ష అన్న రేవంత్ - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ సంచలన కామెంట్స్ !

Ys Vijayamma Comments : ఆ రాష్ట్రంతో మనకేంటి ? - ఏపీ గురించి వైఎస్ విజయమ్మ  సంచలన కామెంట్స్ !

AP Minister Appalraju : ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు - కీలక ప్రకటన చేసిన మంత్రి అప్పలరాజు !

AP Minister Appalraju :  ఏపీలో ఏ క్షణమైనా ఎన్నికలు - కీలక ప్రకటన చేసిన మంత్రి అప్పలరాజు !

AP CM Jagan Security : ఏపీ సీఎం ఇంటి వద్ద టైర్ కిల్లర్స్ - రూ.2 కోట్లతో పెట్టిన కొత్త రక్షణ వ్యవస్థ గురించి తెలుసా ?

AP CM Jagan Security : ఏపీ సీఎం ఇంటి వద్ద టైర్ కిల్లర్స్  - రూ.2 కోట్లతో పెట్టిన కొత్త రక్షణ వ్యవస్థ గురించి తెలుసా ?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

టాప్ స్టోరీస్

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Tirumala Update: భక్తులకు టీటీడీ అలర్ట్ - డిసెంబర్ 1 నుంచి తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Ram Gopal Varma Tweet పుట్టినరోజు ఆయనదైతే నాకు దండేశారేంటి : వైరల్ అవుతోన్న ఆర్జీవి ట్వీట్

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Chandrababu On Viveka Case : సొంత బాబాయ్ హత్య కేసు వేరే రాష్ట్రానికి బదిలీ, తలెక్కడ పెట్టుకుంటావ్ - చంద్రబాబు

Kishan Reddy Fires on KCR: "ప్రజా సమస్యలను పక్కన పడేసిన టీఆర్ఎస్ - బీజేపీపై దాడులు చేస్తోంది"

Kishan Reddy Fires on KCR: