అన్వేషించండి

BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!

BRS Revival Telangana: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న పరిణామాలు చూస్తే.. రాజకీయం టూ పార్టీ వార్ గా మారిపోయింది. బీజేపీ ఉనికి ప్రశ్నార్థకం అవుతోంది. రెండు పార్టీల మధ్యే పోరు ఉండేలా సాగుతోంది.

Revanth Reddy vs KCR Assembly 2026:  తెలంగాణలో  మూడు రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య యుద్ధాన్ని సూచిస్తున్నాయి. బీజేపీ ఎక్కడా కనిపించడం లేదు.  పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ దాదాపు 16-18 శాతానికి పడిపోవడం, కాంగ్రెస్ - బీజేపీ చెరో 8 స్థానాలు గెలుచుకోవడంతో.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రత్యామ్నాయం తామేనని కమలనాథులు భావించారు. కానీ, గత కొన్ని రోజులుగా అసెంబ్లీ లోపల, బయట చోటుచేసుకున్న హైవోల్టేజ్ పరిణామాలను గమనిస్తే.. తెలంగాణ రాజకీయం మళ్లీ పాత రోజుల్లా  కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్  గానే మారిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేస్తున్న రాజకీయ వ్యూహాలు, బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు, అరెస్టులు, కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై దర్యాప్తులు మొత్తం పొలిటికల్ స్పేస్‌ను ఆక్రమించేశాయి. ఈ హోరాహోరీ పోరు మధ్య బీజేపీ తీవ్రంగా వెనుకబడి, రేసులో లేనట్లే కనిపించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది.

దూకుడుగా బీఆర్ఎస్ 

పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు జాతీయ అంశాల ప్రాతిపదికన వచ్చినవి తప్ప, స్థానిక రాజకీయాల్లో బీజేపీ బలం పెరిగినట్లు కాదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో క్షేత్రస్థాయి యంత్రాంగం, నిలకడైన కేడర్ ఇప్పటికీ బీఆర్ఎస్ వద్దే ఉంది. శాసనసభ వేదికగా ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలోని గులాబీ దళం దూకుడుగా ముందుకెళ్తోంది. అదే సమయంలో, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి కాంగ్రెస్‌తో నేరుగా తలపడుతున్నది కూడా బీఆర్ఎస్ మాత్రమే. దీంతో సహజంగానే మీడియా ఫ్రేమ్‌లో, ప్రజల చర్చల్లో బిఆర్‌ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా నిలుస్తోంది.

బీజేపీని రేసులోకి రానివ్వని కాంగ్రెస్ 

మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలివిగా బీజేపీని రేసులోకి రానివ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి టార్గెట్ ఎప్పుడూ కేసీఆర్ మరియు బీఆర్ఎస్ నాయకత్వమే. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలు, శాసనసభలో దళిత స్పీకర్ అవమాన ఉదంతం, ఎర్రవల్లి ఫామ్‌హౌస్ కుట్రలంటూ చర్చ అంతా తమకూ-బీఆర్ఎస్‌కూ మధ్యే పరిమితమయ్యేలా కాంగ్రెస్ నెరేటివ్‌ను సెట్ చేయగలిగింది. కాంగ్రెస్ వ్యూహంలో కేసీఆర్ విలన్‌గా, రేవంత్ నాయకుడిగా కనిపిస్తున్నప్పుడు, మూడో పక్షంగా ఉన్న బీజేపీకి ఎలాంటి  పొలిటికల్ స్పేస్ లేదా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ రచ్చ అంతటిలోనూ బీజేపీ సొంతంగా ఒక బలమైన నెరేటివ్‌ను తయారు చేసుకోవడంలో ఘోరంగా విఫలమవుతోంది.

బీజేపీ నాయకత్వం వైఫల్యం

ఢిల్లీ నాయకత్వం,  లోక్‌సభ విజయాలను మాత్రమే నమ్ముకుంటే స్థానిక రాజకీయాల్లో మనుగడ కష్టమని కమలనాథులు గ్రహించలేకపోతున్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీజేపీకి లభించే అవకాశం చాలా పరిమితంగా ఉండటంతో పాటు, వీధుల్లో కాంగ్రెస్‌ను ఢీకొట్టే ఆందోళన కార్యక్రమాలను సృష్టించడంలో పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దీంతో బీజేపీ ఇచ్చే నిరసన ప్రకటనలు బీఆర్ఎస్-కాంగ్రెస్ దాడుల ముందు కొట్టుకుపోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తదుపరి మైలేజ్‌ను నిలబెట్టుకోవడంలో బీజేపీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్‌ను ఢీకొట్టగల ఏకైక శక్త్య బీఆర్ఎస్ మాత్రమే  అనే నమ్మకం మళ్లీ బలపడితే, బీజేపీ సాధించిన 8 లోక్‌సభ సీట్ల విజయం ఒక తాత్కాలిక బబుల్‌గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బీజేపీ ఇదే రకమైన సైలెంట్ రోల్ పోషిస్తే.. రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్-బీఆర్ఎస్ ద్విముఖ పోరే కంటిన్యూ అవ్వడం ఖాయం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Parivarthana Rajaneethi Party Launch: పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
పరివర్తన పోరుతో మూడో శక్తిగా విజయసాయిరెడ్డి - వైసీపీ ఓటు బ్యాంకుకే పెద్ద దెబ్బ కానుందా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Investment Protection Act : పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
పెట్టుబడిదారులకు చంద్రబాబు సావరిన్ గ్యారెంటీ .. ప్రభుత్వాలు మారినా రక్షణ - సీఐఐ సమ్మిట్‌లో కీలక ప్రకటన
AP Local Body Elections: ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
ఏపీలో 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఈ నెల 26న పోలింగ్
Ramayana Collections : రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
రామాయణ న్యూ రికార్డ్ - వెయ్యి కోట్లకు చేరువలో విజువల్ వండర్
Pat Cummins Sandpapergate: శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
శాండ్ పేపర్ గేట్ పై  ఖవాజా పుస్త‌కంతో ఆస్ట్రేలియా క్రికెట్‌లో పెను ప్రకంపనలు.. ఎట్టకేలకు మౌనం వీడనున్న పాట్ కమిన్స్, మీడియా ముందుకు రానున్న‌ ఆసీస్ కెప్టెన్
Alcohol Release Date : అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లరి నరేష్ ఆల్కహాల్ - ఏడాది తర్వాత న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
Srikalahasti Temple Fire Accident: శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో చెలరేగిన మంటలు
UP Elections 2027 : సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
సామాజిక్ పరివర్తన్ మోర్చా - యూపీలో దళిత్, ముస్లిం ఫ్రంట్ - కొత్త కూటమి ప్రారంభించిన ఓవైసీ !
ReNew Power Investments: ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
ఏపీలో రూ.29,500 కోట్ల భారీ పెట్టుబడులు.. మంత్రి లోకేష్ సమక్షంలో రెన్యూ రెండు కీలక ఒప్పందాలు
Embed widget