అన్వేషించండి

Telangana Graduate MLC Polls : ఎమ్మెల్సీ రేసులో హస్తానికి మిత్రపక్షాల షాక్ - టీజేఎస్-కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి సిద్ధం?

MLC Elections 2026: ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరులో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. కోదండరాం, వామపక్షాలు అభ్యర్థిని నిలబెట్టాలనుకుంటున్నాయి.

Prof Kodandaram TJS MLC Candidate:   తెలంగాణలో రాబోయే రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రారంభంలోనే ఊహించని రాజకీయ సంకటం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి నడిచిన మిత్రపక్షాలను పక్కనబెట్టి, ఏకపక్షంగా అభ్యర్థుల ఖరారు వైపు అడుగులు వేయడం గాంధీభవన్‌ను  రాజకీయ  ఉక్కపోతలోకి నెట్టింది. ముఖ్యంగా, ఉద్యమాలకు ,  ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాలకు పెట్టని కోటగా ఉన్న ఉమ్మడి ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల స్థానంపై ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలోని తెలంగాణ జనా సమితి  మొదటినుంచీ భారీ ఆశలు పెట్టుకుంది. అయితే, కాంగ్రెస్ పెద్దలు ఈ ఆకాంక్షలను కాదని ఏకపక్షంగా వ్యవహరించడంపై టీజేఎస్‌తో పాటు క్షేత్రస్థాయిలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన సీపీఐ, సీపీఎంలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

అభ్యర్థిని నిలిపితే కాంగ్రెస్‌కు సమస్యే 

ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వామపక్షాలకు, విద్యావంతుల వర్గానికి దశాబ్దాల నుంచి స్పష్టమైన ఓటు బ్యాంకు , ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉన్నాయి. అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్‌తో జతకట్టి అధికార పీఠాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించిన తమ ఉనికిని, కనీస సంప్రదింపులు కూడా లేకుండా పక్కన పెట్టడాన్ని కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర ధిక్కార వైఖరిగా పరిగణిస్తున్నాయి. దీంతో, కాంగ్రెస్ పార్టీకి తమ రాజకీయ బలాన్ని రుచి చూపించేందుకు టీజేఎస్ , సీపీఐ, సీపీఎంలు సంయుక్తంగా మూడో అభ్యర్థిని  బరిలోకి దించే దిశగా వేగంగా పావులు కదుపుతున్నాయి. ఈ ఐక్య వేదిక రూపుదిద్దుకుంటే, అది కచ్చితంగా హస్తం పార్టీ విజయ అవకాశాలను దెబ్బతీసే పెద్ద అస్త్రంగా మారనుంది.

కాంగ్రెస్ ఓట్లకు గండి 

పట్టభద్రుల నియోజకవర్గాల్లో సాధారణ ఎన్నికల లాగా కేవలం పార్టీ గుర్తులతో ఓట్లు పడవు. ప్రాధాన్యత ఓటింగ్ విధానం  ఇక్కడ గెలుపోటములను శాసిస్తుంది. ఈ తరహా పోరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సంఘాల మద్దతు ఉన్న టీజేఎస్-వామపక్షాల ఉమ్మడి అభ్యర్థి బరిలో నిలబడితే, కాంగ్రెస్‌కు పడే మొదటి ప్రాధాన్యత ఓట్లలో భారీగా కోత పడటం ఖాయం. గ్రాడ్యుయేట్ స్థానాల్లో సైద్ధాంతిక స్పష్టత కలిగిన లెఫ్ట్ ,  ఐక్య పోరాటాల బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఓటర్లు అధికంగా ఉంటారు. ఈ ఓటు బ్యాంకు కాంగ్రెస్ హ్యాండ్‌బుక్ నుంచి చేజారి ఉమ్మడి అభ్యర్థి వైపు మళ్లితే, అది రేవంత్ రెడ్డి సర్కార్ ఆశించిన క్లీన్ స్వీప్ రికార్డుకు గండి కొడుతుంది.

బహుముఖ పోటీలో ప్రతి ఓటు కీలకమే 

మరోవైపు, ప్రతిపక్ష బిఆర్ఎస్ ,  దూకుడుగా ఉన్న కల్వకుంట్ల కవిత  తెలంగాణ రక్షణ సే , అలాగే జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా ఈ పట్టభద్రుల స్థానంలో గట్టి పోటీని ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఈ బహుముఖ పోటీ వాతావరణంలో కాంగ్రెస్ తన మిత్రపక్షాలను కోల్పోయి ఒంటరిగా బరిలోకి దిగడం అంటే.. ప్రతిపక్షాలకు రాజకీయ మైలేజ్ ఇవ్వడమే అవుతుంది. బిఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడి ఖమ్మం-నల్గొండ-వరంగల్‌లో ఉన్న ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను తమ వైపు తిప్పుకునేందుకు శ్రమిస్తుండగా, మిత్రపక్షాల తిరుగుబాటు కాంగ్రెస్ వ్యూహకర్తలను తీవ్రమైన ఆత్మరక్షణలో పడేసింది.  గాంధీభవన్‌లో ఇప్పటికే ఈ పరిణామంపై అత్యవసర అంతర్గత చర్చలు మొదలైనట్లు సమాచారం. 

చర్చలు జరుపుతున్న మహేష్  గౌడ్ 

పరిస్థితి చేయిదాటిపోక ముందే ప్రొఫెసర్ కోదండరామ్‌తో పాటు సీపీఐ, సీపీఎం అగ్రనేతలతో చర్చలు జరిపి, కాంప్రమైజ్ ఫార్ములాను కుదర్చాలని కాంగ్రెస్ సీనియర్లు రేవంత్ రెడ్డి , పీసీసీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ సమరాల్లో మిత్రపక్షాలను కలుపుకుని పోకపోతే రాబోయే రోజుల్లో పార్లమెంట్,  క్షేత్రస్థాయి రాజకీయాల్లో ఇబ్బందులు తప్పవనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. టీజేఎస్ ,  కమ్యూనిస్టుల ఉమ్మడి అభ్యర్థి ప్రచారం ఉమ్మడి ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల సమరంలో సరికొత్త సమీకరణాలకు తెరలేపింది. కాంగ్రెస్ పార్టీ తన పెద్దరికాన్ని ప్రదర్శించి అసంతృప్త మిత్రులను ప్రసన్నం చేసుకుంటుందా లేక తమ ఒంటరి ప్రయాణంతో ఎమ్మెల్సీ రిజల్ట్‌లో సంచలన మలుపులను ఆహ్వానిస్తుందా అనేది రానున్న రోజుల్లో జరగబోయే పొలిటికల్ చర్చలపై ఆధారపడి ఉంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MPTC and ZPTC Elections: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కొత్త తేదీలివే.. పోలింగ్, కౌంటింగ్ వివరాలు
Telangana El Nino Water Crisis : ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
ఎల్‌నినో రాజకీయం - కాళేశ్వరం అస్త్రంతో బీఆర్‌ఎస్ దాడి.. రేవంత్ కౌంటర్! ప్రజలు ఎవరి వైపు?
AP Local Body Elections: ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
ఏపీ స్థానిక పోరులో కంట్రోల్ తప్పిన పొత్తులు - పరిషత్, పంచాయతీల్లో ఫ్రెండ్లీ కాంటెస్ట్ తప్పదా?
Telangana Congress: కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
కాంగ్రెస్‌లో బిల్లుల మంటలు - ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆమరణదీక్ష హెచ్చరికలు - రేవంత్ ప్రభుత్వం ఎలా చక్కబెడుతుంది?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget