అన్వేషించండి

Telangana Graduate MLC election: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సమరం ప్రారంభం - ‘ఓటర్ నమోదు’ ఆపరేషనే అసలు గెలుపు మంత్రం!

Telangana MLC election: తెలంగాణలో 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల అయింది. సెప్టెంబర్ 28 నుండి ఫారం-18 దరఖాస్తులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి?

MLC voter list:  తెలంగాణ రాష్ట్రంలో మరో ఆసక్తికరమైన రాజకీయ పోరుకు రణభేరి మోగింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ మరియు వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పదవీకాలం మార్చి 2027తో ముగియనుండటంతో, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  అధికారికంగా కొత్త ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ప్రస్తుత సభ్యులైన సురభి వాణిదేవి , తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ రెండు స్థానాల్లో ఎన్నికల కసరత్తు షురూ కావడంతో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, సీనియర్ పట్టభద్రుల పట్టున్న బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా వ్యూహాలకు పదును పెడుతున్నారు.

కొత్తగా ఓటర్ల నమోదు 

ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన మైలురాయి.. సెప్టెంబర్ 28న విడుదల కానున్న పబ్లిక్ నోటీస్,   ఫారం-18 ద్వారా ఓటర్ల నమోదు ప్రారంభం కావడం. గతంలో ఎంతమంది ఓటర్లు నమోదై ఉన్నప్పటికీ, గ్రాడ్యుయేట్ స్థానాల నిబంధనల ప్రకారం పాత ఓటర్ల జాబితా రద్దవుతుంది. ప్రతిసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. నవంబర్ 6 వరకు ఫారం-18 స్వీకరించి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అంటే, దాదాపు 7 లక్షల మందికి పైగా ఉండే అవకాశం ఉన్న పట్టభద్రుల ఓట్లలో.. ఎవరు ఎక్కువ మంది నిజమైన మద్దతుదారులను ఫారం-18 నింపి ఓటర్లుగా నమోదు చేయించగలుగుతారో, వారికే పోలింగ్ రోజు సగం విజయం ఖాయమవుతుంది.

చతుర్ముఖ పోటీ ఖాయం   

ఈసారి పట్టభద్రుల సమరం చతుర్ముఖ పోటీని తలపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, జాబ్ క్యాలెండర్,   డిఏ, పెన్షన్ అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మార్చుకుని నిరుద్యోగులు, ఉద్యోగుల ఓట్లను ఆకర్షించేందుకు ప్లాన్ చేస్తోంది. తమ బలాన్ని నిరూపించుకోవడానికి కాంగ్రెస్ యంత్రాంగం క్షేత్రస్థాయి వరకు ఫారం-18 దరఖాస్తులను చేరవేసి రికార్డు స్థాయిలో ఓటర్లను నమోదు చేయించే పనిలో పడింది. అటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీకి ఇది అతిపెద్ద అగ్నిపరీక్ష. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తర్వాత గ్రాడ్యుయేట్ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అమలులో జాప్యం వంటి అంశాలను లేవనెత్తి విద్యావంతులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. గతంలో గెలిచిన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ సీటును నిలబెట్టుకోవడంతో పాటు నల్గొండ-వరంగల్-ఖమ్మంలోనూ బలమైన పోటీ ఇచ్చేందుకు కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేసి ఓటర్ల నమోదు బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగిస్తున్నారు.

బీజేపీ కూడా గట్టిగా పోటీ పడే ప్రయత్నం

మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి మరియు నల్గొండ పట్టభద్రుల స్థానాల్లో బీజేపీకి సంప్రదాయంగా బలమైన ఓటు బ్యాంకు ఉంది. విద్యావంతులు, ఐటీ నిపుణులు, ఆర్ఎస్ఎస్ అనుబంధ వర్గాల్లో ఆ పార్టీకి మంచి పట్టు ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న మైలేజ్‌తో పాటు రాష్ట్ర సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ అర్బన్ ప్రాంతాల్లో అత్యధికంగా ఆన్‌లైన్ ద్వారా ఓట్లను నమోదు చేయించే వ్యూహంతో బీజేపీ సమాయత్తమవుతోంది. దీనికి తోడు తీన్మార్ మల్లన్న, ఇతర స్వతంత్ర, యువజన సంఘాల నాయకులు కూడా బరిలోకి దిగుతుండటంతో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు  అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి 'అభ్యర్థి ఇమేజ్' ఎంత ముఖ్యమో.. 'ఓటర్ల నమోదు డిజైన్' అంతకంటే వెయ్యింతలు ముఖ్యం. డిగ్రీ సర్టిఫికేట్లు సేకరించి, గెజిటెడ్ అటెస్టేషన్ చేయించి, గడువులోగా ఫారం-18 అధికారులకు చేరేలా ఏ పార్టీ యంత్రాంగం నెట్‌వర్క్‌ను పక్కాగా నడుపుతుందో.. ఆ పార్టీయే మార్చి 2027 పట్టభద్రుల పోరులో విజేతగా నిలుస్తుంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress InCharge: మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep- ఇంతకీ ఎవరీయన
మీనాక్షి నటరాజన్ ఔట్.. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా BM Sandeep నియామకం- ఇంతకీ ఎవరీయన
UP Elections 2027 : అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
AP Investment Protection Act: పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
పెట్టుబడిదారులపై రాజకీయ కక్ష సాధింపులకు చెక్- ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెస్తున్న చంద్రబాబు - జగనే కారణమా?
Bharat Summit Controversy: హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
హైదరాబాద్ భారత్ సమ్మిట్ చుట్టూ వివాదం.. 115 మంది విదేశీయుల వీసాలు రద్దు, రేవంత్ ఎందుకింత రిస్క్ తీసుకుంటున్నారు?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohit Ulva Heroics: ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
ఆఖరి బంతికి ఫోర్ బాది పాకిస్తాన్ నోటికాడి కప్పు తన్నుకుపోయిన టీమిండియా.. మోహిత్  వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆసియా కప్ విజేతగా నిలిచిన భార‌త్
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Srikalahasti Temple: శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడుతో భక్తుడు.. అదుపులోకి తీసుకున్న సిబ్బంది
Comedy Thriller OTT : ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ప్రతీ చిన్న విషయానికీ 'అనుమాన పక్షి'లా ఉంటే? - ఓటీటీలోకి కామెడీ థ్రిల్లర్... ఎప్పుడు ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Elon Musk Supports Jensen Huang: మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
మళ్లీ Nvidia CEO గా జెన్సన్ హువాంగ్‌‌..! ఎలాన్ మస్క్ సైతం మద్దతు
Vitamins for Hair : జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
జుట్టు పెరగాలంటే అవసరమయ్యే విటమిన్లు ఇవే.. వీటి లోపం ఉంటే హెయిర్ ఫాల్ పెరగొచ్చు
Embed widget