అన్వేషించండి

BRS vs Congress Assembly Protest: అసెంబ్లీ యుద్ధం - పోరాడింది బీఆర్ఎస్.. పాయింట్లు కొట్టేసింది కాంగ్రెస్! దళిత కార్డుతో రేవంత్ అడ్వాంటేజ్ సాధించారా?

Telangana Assembly clash 2026: అసెంబ్లీ గేట్ల వద్ద బీఆర్ఎస్ ఆందోళనలు, తాతా మధు కామెంట్స్, పసుపు నీళ్ల వివాదం ఏ పార్టీకి ప్లస్ అయ్యాయి? సామాజిక కోణంలో తిప్పికొట్టి కాంగ్రెస్ ఎలా పైచేయి సాధించిందా?

Dalit Dappu protest Erravalli Farmhouse:  తెలంగాణ శాసనసభ వేదికగా ఇటీవల జరిగిన రాజకీయ ఉద్రిక్తతలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, తామే అసలైన ప్రజాపక్షమని నిరూపించుకోవడానికి బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో పోరాటం చేసింది. అసెంబ్లీ గేట్ల వద్ద ఆందోళనలు, తోపులాటలు, అరెస్టులు.. ఇలా హంగామా అంతా బీఆర్ఎస్ చుట్టూనే తిరిగింది. కానీ, ఈ రచ్చ ముగిసేసరికి మైలేజ్ ఎవరికి దక్కింది? రాజకీయంగా ఎవరు పైచేయి సాధించారు? అంటే.. పోరాడిన బీఆర్ఎస్ బాధితుడిగా మారకపోగా, చివరకు కాంగ్రెస్ పార్టీయే పక్కా వ్యూహంతో అడ్వాంటేజ్ కొట్టేసింది.

 బీఆర్ఎస్ ఆందోళనలు.. తిరగబడిన పాచిక 

అసెంబ్లీ ముట్టడి, పోలీసులతో వాగ్వాదాలు, రాత్రికి రాత్రే కేసులు నమోదవ్వడం వంటి పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు విపక్ష పాత్రలో దూకుడుగా కనిపించాలనుకున్నారు. అయితే, ఆ ఆవేశంలో జరిగిన చిన్న చిన్న పొరపాట్లు మొత్తం   మార్చేశాయి. ముఖ్యంగా అసెంబ్లీ గేటు వద్ద నిరసన సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఆవేశంలో మాట్లాడిన మాటలు బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లో పడేశాయి. పోలీసులతో తోపులాటలో ప్యాంటు లాగారన్న ఆక్రోశంతో ఆయన చేసిన వ్యాఖ్యలు.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను ఉద్దేశించినవేనంటూ వివాదం రాజేసింది. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చి మాట వెనక్కి తీసుకున్నప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

 సామాజిక కార్డును పక్కాగా వాడిన కాంగ్రెస్ 

ఇక్కడే కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ చతురతను ప్రదర్శించింది. సాధారణ రాజకీయ గొడవగా మారాల్సిన అంశాన్ని కాంగ్రెస్ అత్యంత చాకచక్యంగా  సామాజిక ఆత్మగౌరవ పోరాటం గా మలిచింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ దళిత వర్గానికి చెందిన నాయకుడు కావడంతో, ఆయనపై చేసిన వ్యాఖ్యలను మొత్తం దళిత సమాజానికి జరిగిన అవమానంగా కాంగ్రెస్ ప్రాజెక్ట్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కలతో పాటు కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలంతా ఏకతాటిపైకి వచ్చి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  దళితుడు స్పీకర్ స్థానంలో ఉండటం బీఆర్ఎస్ సహించలేకపోతోంది  అనే నరేటివ్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది.

 పసుపు నీళ్ల స్వయంకృతం.. బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ 

ఈ వివాదం అంతటితో ఆగకుండా తదుపరి ఘట్టానికి చేరుకుంది. స్పీకర్‌ను అవమానించారంటూ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద దళిత సంఘాలు, కాంగ్రెస్ నేతలు డప్పు కొట్టి నిరసన తెలిపారు. అయితే, వారు వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ శ్రేణులు పసుపు నీళ్లతో కడిగి  శుద్ధి  చేశారన్న వార్త రావడం బీఆర్ఎస్‌కు మరో పెద్ద సెల్ఫ్ గోల్‌గా మారింది. దళితులు నిరసన తెలిపిన చోట పసుపు నీళ్లు చల్లడం అస్పృశ్యతా భావనను రుద్దడమేనంటూ కాంగ్రెస్ పాయింట్ టు పాయింట్ ఎండగట్టింది. అసెంబ్లీలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రత్యేక విచారణకు కూడా ఆదేశించారు. దీనికితోడు 'ఫామ్‌హౌస్‌లోనే అసెంబ్లీని అడ్డుకునే కుట్ర జరిగింది' అని రేవంత్ చేసిన ఆరోపణలు బీఆర్ఎస్‌ను మరింత ఇరుకున పెట్టాయి. సాధారణంగా ప్రతిపక్షాలు రోడ్డెక్కి అరెస్టులు అయినప్పుడు, వారిపై కేసులు పడ్డప్పుడు ప్రజల్లో కొంతైనా సానుభూతి వ్యక్తమవుతుంది. కానీ ఈసారి బీఆర్ఎస్ విషయంలో అది తలకిందులైంది. హక్కుల కోసం పోరాడుతున్నాం అని చెప్పుకునే ప్రయత్నంలో.. దళిత స్పీకర్‌ను అవమానించారన్న ముద్ర, పసుపు నీళ్ల వివాదం వారి మెడకు చుట్టుకున్నాయి. బాధితులుగా మిగలాల్సిన బీఆర్ఎస్ నేతలు, చివరికి సామాజిక ఉల్లంఘనకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది.

 విజేతగా నిలిచిన కాంగ్రెస్ స్ట్రాటజీ 

సమగ్రంగా చూస్తే, ఈ అసెంబ్లీ రచ్చలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పొలిటికల్ మైండ్ గేమ్‌లో స్పష్టమైన విజయం సాధించింది. ప్రతిపక్షం తెచ్చిన నిరసన సెగను, తమకు అనుకూలమైన సామాజిక సమీకరణాలుగా మలచుకోవడంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శించింది. బీఆర్ఎస్ ఎంత నిరసన తెలిపినా, ఆ అంశాల కంటే వారు చేసిన పొరపాట్లే హైలైట్ అయ్యేలా కాంగ్రెస్ గేమ్‌ప్లాన్ వర్కవుట్ అయింది. ఫలితంగా, అసెంబ్లీ గేట్ల వద్ద జరిగిన యుద్ధంలో శ్రమ బీఆర్ఎస్‌ది కాగా.. రాజకీయ పాయింట్లు మాత్రం కాంగ్రెస్ ఖాతాలోనే పడ్డాయని చెప్పవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections: కూటమి స్పూర్తిని చాటేలా సీట్ల సర్దుబాటు, చంద్రబాబు అనుభవంతో కుదిరిన ఏకాభిప్రాయం: పవన్ కళ్యాణ్
కూటమి స్పూర్తిని చాటేలా సీట్ల సర్దుబాటు, చంద్రబాబు అనుభవంతో కుదిరిన ఏకాభిప్రాయం: పవన్ కళ్యాణ్
జగన్ తీరుతో రాష్ట్రంతో పాటు ఫ్యామిలీలోనూ అన్ని ఇబ్బందులే.. కూటమితో హింస లేదు: సీఎం చంద్రబాబు
జగన్ తీరుతో రాష్ట్రంతో పాటు ఫ్యామిలీలోనూ అన్ని ఇబ్బందులే.. కూటమితో హింస లేదు: సీఎం చంద్రబాబు
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Tummidi Hatti Barrage: తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి వాటర్ డిప్లొమసీ - ఉత్తర తెలంగాణ దాహార్తి తీర్చే బిగ్ స్కెచ్ - అడుగు ముందుకు పడినట్లేనా?
తుమ్మిడిహట్టిపై రేవంత్ రెడ్డి వాటర్ డిప్లొమసీ - ఉత్తర తెలంగాణ దాహార్తి తీర్చే బిగ్ స్కెచ్ - అడుగు ముందుకు పడినట్లేనా?
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Dayakar On Bjp: 'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం
'SIR'తో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ ప్లాన్.. హైదరాబాద్‌లో అమిత్ షా పాదయాత్ర విడ్డూరం - అద్దంకి దయాకర్
YS Sharmila Letter To SEC: అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
అర్నాబ్ తుపాను హెచ్చరికలు.. ఎన్నికలు వాయిదా వేయాలని ఎస్‌ఈసీకి వైఎస్ షర్మిల లేఖ
IND VS NZ 3rd T20 Result Update: అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
అభిషేక్ మెరుపు సెంచ‌రీ.. టీమిండియా హ్యాట్రిక్ విక్ట‌రీ.. సిరీస్ కైవసం.. రాణించిన సూర్య‌వంశీ
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: గోట్స్‌కి విన్నపించుకునే వారికే నామినేషన్ హక్కు! అదిరిపోయే అర్గ్యూమెంట్స్!
Hot Stone Massage : హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
హాట్ స్టోన్ పెడిక్యూర్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఇవే, ట్రై చేయండి
Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Embed widget