అన్వేషించండి

TDP News: కోటి మంది టీడీపీ కార్యకర్తలకు కీలక సూచన - ఇవి గుర్తు పెట్టుకుంటే కుటుంబానికి రూ. 5 లక్షల ధీమా

Telugu Desam Party: తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమాను ఆ పార్టీ కల్పించింది. ఇన్సూరెన్స్ ఎలా పొందాలన్నదానిపై కీలక సూచనలు చేసింది.

TDP party:  తెలుగుదేశం పార్టీకి కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. సభ్యత్వ నమోదులో ఆ పార్టీ చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం తెలుగుదేశానికి ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని  కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాక వారికి విద్య, ఉద్యోగ, వైద్య సహాయం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని టీడీపీ తెలిపింది. 

కోటి మంది కార్యకర్తలకు ఇన్సూరెన్స్ 

2024 ఏడాది అక్టోబర్ 26న ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిసెంబర్ 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో మరో 15 రోజులు పొడిగించినట్లుగా టీడీపీ ప్రకటించారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో దాదాపు కోటి మంది వరకు సభ్యత్వం తీసుకున్నారు. కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఆదుకోవడానికి సభ్యత్వ నమోదు ఉపయుక్తంగా ఉంటుంది. ఈ మేరకు కోటి మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం చేసుకున్నారు.  

ప్రమాద బీమా పొందడానికి అవసరమైన పత్రాలు 

టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ప్రమాదాల్లో చనిపోతే పార్టీ ఆఫీసును సంప్రదించడం లేట్ కావడంతో పాటు పలు పత్రాలను సేకరించడంలో ఇబ్బంది పడుతూంటారు. అందుకే అవగాహన కోసం ముందుగానే టీడీపీ కీలక విషయాలను వెల్లడించారు. కార్యకర్తలు ప్రమాద బీమా పొందేందుకు అవసరమైన పత్రాలు, మార్గదర్శకాలను వెల్లడించింది. ప్రమాద బీమా పొందేందుకు బాధిత కుటుంబం ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఎస్.ఐ సంతకం, స్టాంప్ తో కూడిన ఫిర్యాదు లేఖ, శవ పంచనామా, పోస్ట్ మార్టమ్ నివేదిక, మండల రెవెన్యు అధికారి జారీ చేసిన అసలు మరణ ధృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం(ఫ్యామిలీ సర్టిఫికెట్) సమర్పించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాల్సి ఉంటుంది. 

ప్రమాదం జరిగిన పదిహేను రోజుల్లో తెలియచేస్తే మంచిది ! 

ప్రమాద వార్తను కవర్ చేసిన న్యూస్ పేపర్ కటింగ్ లు, ప్రమాదం జరిగినప్పుడు తీసిన 2 ఫోటోలను జత చేయాలి. వీటితో పాటు నామినీ ఆధార్, ఓటర్ కార్డ్, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్, పాన్ కార్డు అందించాలి. ఆయా పత్రాలన్నీ ఒక సెట్ ఒరిజినల్, 2 సెట్లు జిరాక్స్ కాపీలు జతపరచాలి. ఏదైనా ప్రమాదంలో వ్యక్తి మరణించినప్పుడు 15 రోజుల్లో తెలియపరచాలని, ప్రమాదం జరిగిన 30 రోజుల్లోగా నామినీ స్వయంగా డాక్యుమెంట్లు తీసుకుని గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని వెల్లడించింది. ఏదైనా సమాచారం కోసం 7306299999 నెంబర్ కు ఫోన్ చేయాలని తెలిపింది.  

 

టాప్ హెడ్ లైన్స్

Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget