Chandrababu On Jagan : హోదా కోసం యుద్ధం ఎప్పుడు ప్రారంభిస్తారు జగన్ ?
ప్రత్యేకహోదా కోసం జగన్ ఎప్పుడు యుద్ధం ప్రారంభిస్తారో చెప్పాలని టీడీపీ డిమాండ్ చేసింది. అసమర్థ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని స్ట్రాటజీ కమిటీ భేటీలో చంద్రబాబు విమర్శించారు.
![Chandrababu On Jagan : హోదా కోసం యుద్ధం ఎప్పుడు ప్రారంభిస్తారు జగన్ ? TDP demanded Jagan tell them when start war for special status Chandrababu On Jagan : హోదా కోసం యుద్ధం ఎప్పుడు ప్రారంభిస్తారు జగన్ ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/24/679dbac026410678820f2192db2babf4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్ ఎప్పుడు యుద్దం మొదలు పెడతారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ( Chandra babu ) ప్రశ్నించారు. ప్రధానికి ఇచ్చే వినతి పత్రంలో కూడా హోదా అంశాన్ని జగన్ ఎందుకు పెట్టలేకపోయారని ప్రశ్నించారు. తమ పోరాటం వల్లనే హోదా విషయంలో కేంద్ర కమిటీ వేశారన్న వైఎస్ఆర్‌సీపీ ( YSRCP ) నేతలు తర్వాత అజెండా ఎందుకు మారిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కేంద్ర త్రిసభ్య కమిటీ అజెండాలో ప్రత్యేక హోదా అంశం రావడానికి సీఎం చేసిన కృషే కారణమని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీడియాలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు డబ్బా కొట్టించుకుని.. సాయంత్రానికి టీడీపీపై బురదజల్లడం జగన్ రెడ్డి అసమర్థతకు, లాలూచీకి నిదర్శనమని చంద్రబాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు సినీ రంగాన్ని జగన్ కించ పర్చడం బాధాకరం : చంద్రబాబు
తెలుగు సినీ హీరోలను, ప్రముఖులను సీఎం జగన్ మీటింగ్ పేరుతో పిలిపించి అవమానించడాన్ని చంద్రబాబు తీవ్రంగా తప్పు పట్టారు. ప్రపంచ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమా ( Tollywood ) పరిశ్రమను జగన్ తన వైఖరితో కించపరిచారని అన్నారు. లేని సమస్యను సృష్టించి సినిమా రంగాన్ని కించపరిచేలా జగన్ వ్యవహరించారని మండిపడ్డారు. స్వశక్తితో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ( Chiranjeevi ) వంటి వారు సిఎంకు చేతులు జోడించి వేడుకోవాలా అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు పాల్గొన్న ఆ సమావేశంలో జగన్ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు మమండిపడ్డారు. ప్రపంచ స్థాయికి చేరిన తెలుగు సినిమా రంగ ప్రతిభపై కొద్దిరోజుల క్రితం ప్రధాని మోడీ ( PM Modi) చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.
ఈశాన్య రాష్ట్రాల స్థాయికి ఆర్థిక పరిస్థితిని దిగజార్చిన సీఎం జగన్ !
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఏమాత్రం తగ్గకపోయినా ఆర్థిక వ్యవస్థ ( AP Financial Situation ) నాశనం అవ్వడానికి జగన్ విధానాలే కారణం అని నేతలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 112 సార్లు ఒవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిందని....193 సార్లు వేస్ అండ్ మీన్స్ తీసుకున్నారని...వెనుక బడిన ఈశాన్య రాష్ట్రాల స్థాయికి రాష్ట్రాన్ని జగన్ తీసుకువెళ్లారని నేతలు వివరించారు. పాఠశాలల విలీనం విద్యార్థులకు స్కూళ్లు దూరం అవుతున్నాయని.. ఎస్సీ, బీసీ కాలనీల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలు ( Schools ) రద్దు చేయడాన్ని టీడీపీ ఖండించింది. రాష్ట్రంలో అమలువుతున్న అనధికార విద్యుత్ కోతలపైనా సమావేశంలో చర్చించారు. గ్రామాల్లో గంటల తరబడి విద్యుత్ సరఫరా తీసివేస్తున్నారని....విద్యుత్ రంగంలో మళ్లీ రాష్ట్రం తిరుగమనంలోకి వెళ్లిందన్నారు. కరెంట్ సరఫరా లేకపోయినా....కరెంట్ బిల్లులు అధికంగా వస్తున్నాయని అన్నారు. వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు తిరస్కరించిన కేసీఆర్‌లాగే ఏపీలో జగన్ రెడ్డి మోటార్లకు మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేశారు.
ఆటోనగర్ స్థలాలు లాక్కోవడం కబ్జా చేయడమే !
రాష్ట్రంలోని వివిధ నగరాలు, పట్టణాల్లోని ఆటోనగర్ ల ( Auto Nagars ) స్థలాలను కబ్జా చేసేందుకు జగన్ రెడ్డి కుట్ర పన్నడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధికి మార్గం చూపకపోగా... ప్రైవేటు ఆస్థులు లాక్కునేందుకు ప్రయత్నించడానికి నేతలు తప్పు పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని...మందుల కొరత, ఆర్థిక సమస్యలతో అసుపత్రుల్లో వివిధ చెల్లింపులు లేవన్నారు. ఉపాధి నిధుల్లో పేదలకు చేరాల్సిన డబ్బును అవినీతితో తినేస్తున్నారని నేతలు సమావేశంలో వివరించారు. ఉపాధి హామీ నిధులు ఏపీలో రూ. 261 కోట్లు అవినీతి పాలయ్యాయని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ప్రకటించింది. ఇది దేశంలో మొదటి స్థానంగా ఉందని రానున్న రోజుల్లో నిధులు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)