అన్వేషించండి

Tamil Nadu Assembly Elections: తమిళనాడు కూటముల్లో సీట్ల కేటాయింపు సర్కస్ - డీఎంకే, అన్నాడీఎంకే అసంతృప్తులంతా విజయ్ గూటికే !

Alliances battle for seats : తమిళనాడులో డీఎంకే , అన్నాడీఎంకే సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Alliances battle for seats in Tamil Nadu Assembly elections: తమిళనాడులో డీఎంకే ,  అన్నాడీఎంకే  సీట్ల సర్దుబాటు ప్రక్రియలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార పీఠాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ సీట్ల పంపిణీలో వేగం పెంచింది. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఇప్పటికే తన ప్రధాన మిత్రపక్షమైన  కాంగ్రెస్‌కు 28 సీట్లు  కేటాయించి ఒప్పందాన్ని ఖరారు చేశారు. అయితే, కాంగ్రెస్ మొదట 45 సీట్లు డిమాండ్ చేసినప్పటికీ, కొత్తగా వచ్చి చేరిన కమల్ హాసన్  వంటి పార్టీలకు చోటు కల్పించాల్సి రావడంతో డీఎంకే పట్టుబట్టి తగ్గించింది. కాంగ్రెస్‌కు అదనంగా ఒక రాజ్యసభ స్థానాన్ని ఇస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఆ వివాదం సద్దుమణిగింది.

మిత్రపక్షాలకు సీట్లు తగ్గిస్తున్న డీఎంకే

కమ్యూనిస్టు పార్టీల విషయంలో డీఎంకే కొంత కఠినంగా వ్యవహరిస్తోంది.  సీపీఐ  కి 5 సీట్లు కేటాయించగా, గతంలో కంటే ఒక సీటు తగ్గించడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీపీఎం తమకు కనీసం 6 సీట్లు కావాలని భీష్మించుక కూర్చుంది. దళిత పార్టీ వీసీకే కూడా తమకు రెండంకెల సీట్లు  కావాలని డిమాండ్ చేస్తోంది. అయితే, డీఎంకే మాత్రం కనీసం 170 నుండి 180 స్థానాల్లో స్వయంగా పోటీ చేయాలని భావిస్తుండటంతో, మిత్రపక్షాలకు తక్కువ సీట్లు ఇచ్చి సర్దుబాటు చేసేందుకు స్టాలిన్ టైట్ రోప్ వాక్ చేస్తున్నారు.

అన్నాడీఎంకేపై బీజేపీ ఒత్తిడి

ప్రతిపక్ష అన్నాడీఎంకే  కూటమిలో సమీకరణాలు మరింత క్లిష్టంగా ఉన్నాయి. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో అన్నాడీఎంకే..  బీజేపీ ,  పీఎంకే  తో కలిసి పటిష్టమైన కూటమిని ఏర్పాటు చేసింది. పీఎంకే ఇప్పటికే కూటమిలోకి అధికారికంగా చేరినప్పటికీ, ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తర తమిళనాడులో పట్టున్న పీఎంకే, సామాజిక వర్గాల ప్రాతిపదికన కీలక సీట్ల కోసం పట్టుబడుతోంది. అటు బీజేపీ కూడా గత ఎన్నికల కంటే ఎక్కువ సీట్లు ఆశిస్తోంది, కానీ అన్నాడీఎంకే మాత్రం మెజారిటీ సీట్లను తన వద్దే ఉంచుకోవాలని చూస్తోంది.

అసంతృప్తులకు చాయిస్ విజయ్ టీవీకే 

 డీఎంకే కూటమిలోని  కమల్ హాసన్ పార్టీ  MNM  తమ సొంత గుర్తు  మీదనే పోటీ చేస్తామని, డీఎంకే గుర్తుపై కాదని స్పష్టం చేయడం కూటమిలో చిన్నపాటి చిచ్చుకు దారితీసింది. అలాగే, సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత దక్కని చిన్న పార్టీలు అన్నాడీఎంకే లేదా కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసిన విజయ్  పార్టీ వైపు చూస్తున్నాయి.  ముఖ్యంగా డీఎంకే తిరుగుబాటు నేతలు కొందరు అన్నాడీఎంకేతో టచ్‌లోకి వెళ్లడం కూడా చర్చనీయాంశంగా మారింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన  తమిళగ వెట్రి కజగం ఈసారి ఎన్నికల్లో ఎక్స్-ఫ్యాక్టర్ గా మారనుంది. ఆయన ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్తారా లేక ఆఖరి నిమిషంలో ఏదైనా కూటమికి మద్దతు ఇస్తారా అన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సీట్ల సర్దుబాటులో అసంతృప్తికి లోనైన చిన్న పార్టీలు విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇది ప్రధాన కూటముల ఓట్లను చీల్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. 

 ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందు ఈ నెల ఆఖరుకల్లా రెండు కూటములు తమ పూర్తి అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది. సీట్ల సర్దుబాటులో వచ్చే అసంతృప్తులు అభ్యర్థుల గెలుపు ఓటములపై ఎంతవరకు ప్రభావం చూపుతాయో చూడాలి.

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
YSRCP: ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
ఏపీ మున్సిపల్ పోలింగ్.. పలుచోట్ల వైసీపీ నేతల హౌస్ అరెస్ట్! విజయవాడలో గుర్తులు తారుమారు
AP Urban Local Body Elections: 92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు
92 పట్టణ స్థానిక సంస్థలకు ఆదివారం పోలింగ్.. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు: AP SEC
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Seifert, Phillips Carnage:  ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
ప్ర‌త్య‌ర్థి బ్యాటర్ల ఊచకోతతో టీమిండియాకు మ‌రో ఓట‌మి.. ఐదో టీ20లో కివీస్ ఘ‌న విజ‌యం.. సత్తా చాటిన సీఫెర్ట్, ఫిలిఫ్స్, మిల్నే
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Lokesh Visits Raptadu Victim: రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
రాప్తాడు బాలికకు లోకేశ్ పరామర్శ - మా బిడ్డలా భావించండి.. డాక్టర్లకు విజ్ఞప్తి !
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
YS Jagan Protest: పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
పులివెందుల ఆర్వో ఆఫీసుకు తాళం! వైసీపీ అభ్యర్థులతో జగన్ బైఠాయింపు
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Anakapalli Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'అనకాపల్లి' - విలేజ్ రొమాంటిక్ డ్రామా ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Dastagiri Intercepts Jagan: వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
వివేకాను చంపించింది మీరే.. పులివెందులలో జగన్ కాన్వాయ్‌ను అడ్డుకున్న దస్తగిరి !
Embed widget