అన్వేషించండి

Ali political future : ఒక్క రాంగ్ స్టెప్‌తో సర్వం కోల్పోయిన అలీ - రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ !

Actor Ali : స్టార్ కమెడియన్ అలీ రాజకీయాల్లో అట్టర్ ఫ్లాప్ గా మిగిలారు. ఒక్క రాంగ్ స్టెప్ తో రాజకీయ జీవితం లేకుండా చేసుకున్నారు.

Ali has remained an utter flop in politics :  రాజకీయాలతో ఇక తనకు సంబంధం లేదని నటుడు అలీ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో ఓ సలహాదారునిగా ఆయన ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక సలహాదారులందర్నీ తీసేసింది. దాంతో ఆయన పదవి పోయింది. వైసీపీ కూడా ఓడిపోవడంతో ఆయన ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని అధికారిక ప్రకటన చేశారు. వైసీపీ అనే పేరు పలకడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. 

ప్రజాప్రతినిధి కావాలన్న లక్ష్యంతో అలీ రాజకీయాలు          

రాజకీయాల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యే అవ్వాలన్న లక్ష్యంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఏ పార్టీ నుంచి అవకాశం వస్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆయన సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారు. మొదటి నుంచి టీడీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఆయన.. 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీ నుంచి టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ ఎక్కడా సానుకూలత రాకపోవడంతో పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేశారు.దీంతో గెలుపు అవకాశాలు ఉండన్న ఉద్దేశంతో వైసీపీలో చేరిపోయారు. పవన్ కల్యాణ్ ఆప్తమిత్రుడు అయినప్పటికీ రాజకీయం వేరని ఆయన వైసీపీలో చేరిపోయారు. అయితే వైసీపీలో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. కానీ విస్తృతంగా ప్రచారం చేశారు. 

పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు చేసి ఆయనకు దూరమైన అలీ 

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయనతో సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆప్తమిత్రుడైన పవన్.. అలీని  పట్టించుకోవడం మానేశారు. అదే సమయంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. ఎన్నికలకు ఏడాది ముందు.. టిక్కెట్ల కసరత్తు చేస్తున్నప్పుడు ఆయనకు  సలహాదారు పదవి ఇచ్చారు. దానికే అలీ పొంగిపోయారు. అయితే అంతకు ముందు ఆయన పేరు రాజ్యసభ రేసులో కూడా వినిపించింది. అలాగే ఎన్నికల సమయంలో నంద్యాల పార్లమెంట్ కు అయినా సీటు ఇస్తారని అనుకున్నారు. కానీ ఎక్కడా ఆయనకు టిక్కెట్ కేటాయించలేదు. టిక్కెట్లు ఖరారు చేసే వరకూ ఆయన ఆశాభావంతోనే ఉన్నారు. అవకాశం కల్పించకపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు. 

సినిమా  కెరీర్ దెబ్బతినే ప్రమాదం ఉండటంతో వైసీపీకి రాజీనామా 

నిజానికి తాను నమ్మిన మిత్రుడు పవన్ వెంట ఉంటే.. ఈ  రోజు అలీ తన కలను నెరవేర్చుకుని ఉండేవారన్న అభిప్రాయం ఉంది.  పవన్ తో ఉంటే ఖచ్చితంగా ఆయన కోసం ఓ సీటు రిజర్వ్ అయి ఉండేది.  ప్రజాప్రతినిధి అయి ఉండేవారని అంటున్నారు. ఇప్పుడు వైసీపీకి భవిష్యత్ ఉందో లేదో తెలియదు. వైసీపీతోనే ఉంటే తన కెరీర్ కు కూడా మంచిది కాదు. అవకాశాలు రావన్న ఉద్దేశంతో ఆయన వైసీపీకి గుడ్ చెప్పారంటున్నారు. సినిమాల్లో ఎంతో కష్టపడి పైకి వచ్చిన ఆయన.. రాజకీయాలకు వచ్చేసరికి.. కాస్త తెలివిగా .. భవిష్యత్ వ్యూహంతో ఆలోచించలేకపోయారని అందుకే .. అట్టర్ ఫ్లాప్ అయ్యారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget