అన్వేషించండి

'Ganta Resign Letter Story : గంటా రాజీనామా ఏమైంది ? ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యేల రాజీనామా ఆమోదం పొందుతుందా ?

స్పీకర్ ఫార్మాట్‌లో ఇచ్చిన గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఇంత వరకూ ఆమోదించలేదు. మరి నిబంధనలకు అనుగుణంగా లేని రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా?

 
Ganta Resign Letter Story :  మూడు రాజధానుల కోసం అంటూ వశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. ఆయన లేఖ స్పీకర్ ఫార్మాట్‌లో లేదు. దాన్ని స్పీకర్‌కు కూడా  పంపలేదు. నాన్ పొలిటికల్ జేఏసీకి ఇచ్చారు. ఈ రాజీనామా రాజకీయమా.. లేకపోతే ఇంకేదైనా వ్యూహమా అన్నది పక్కన పెడితే ఇప్పుడు ధర్మశ్రీ చేసిన రాజకీయం.. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో గంటా శ్రీనివాసరావు చేసిన రాజీనామా వ్యవహారమే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు లేఖ స్పీకర్ వద్దనే ఉంది. ఉపఎన్నిక  తేవాలనుకుంటే.. గంటా రాజీనామా ఆమోదిస్తే ఉపఎన్నిక వస్తుంది. 

 గంటా ఎమ్మెల్యే రాజీనామా లేఖ స్పీకర్ వద్ద ! 
 
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. మొదట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటైన జేఏసీకి చేతిరాతతో రాజీనామా లేఖ రాసిచ్చారు. తర్వాత నిబంధనల ప్రకారం స్పీకర్ ఫార్మాట్‌లో రాసిచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అసెంబ్లీకే గంటా శ్రీనివాసరావు హాజరు కావడంలేదు.  స్టీల్ ప్లాంట్ నుప్రైవేటీకరణ నిర్ణయం కేంద్రం తీసుకున్నప్పుడు గంటా శ్రీనివాస్ రాజీనామా చేశారు. ప్రైవేటైజేషన్‌కు సంబంధించి కేంద్రం నిర్ణయం అమలులోకి రాగానే తన రాజీనామాను ఆమోదించాలని అసెంబ్లీ స్పీకర్‌ను గంటా కోరారు. అయితే మొదట ఆయన రాసిన లేఖ ఫార్మాట్‌లో లేదన్న విమర్శలు రావడంతో ..తర్వతా ఫార్మాట్‌లో రాజీనామా లేఖ ఇచ్చారు. తర్వాత గంటా శ్రీనివాసరావు ఓ సారి ఆముదాల వలస వెళ్లి స్పీకర్‌తో సమావేశమయ్యారు. తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. అయితే ఇంత వరకూ స్పీకర్ ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు.   ఆయన పదే పదే స్పీకర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ప్రయోజనం ఉండటంలేదు. దీంతో  ఆయన కోర్టుకెళ్లాలని కూడా అనుకున్నారు. కానీ రాజీనామా ఆమోదించడం..ఆమోదించకపోవడం స్పీకర్ పరిధిలోనిది కాబట్టి... వెనుకడుగు వేశారు. నిజానికి గంటా రాజీనామాను ఆమోదించడం స్పీకర్ తమ్మినేని సీతారాంకు నిమిషం పని. కానీ ఎందుకో కానీ ఆయన నిర్ణయం తీసుకోవడం లేదు. 

గంటా రాజీనామాపై నిర్ణయం తీసుకుంటే ఉపఎన్నిక!
  
ఒక వేళ గంటా రాజీనామాను ఆమోదిస్తే.. ఆరు నెలల్లో ఉపఎన్నికలు వస్తాయి. మూడు రాజధానుల అంశంపై అధికార పార్టీ కోరుకున్నట్లుగా ప్రజాభిప్రాయం తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇతరులు రాజీనామాచేయాల్సిన అవసరం లేదు. అయితే స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు కాబట్టి ఆ అంశంపై ఎన్నికలు జరిగితే ఇబ్బందేనని వైఎస్ఆర్‌సీపీ భావిస్తున్నట్లుగా ఉంది.  ఈ కారణంగానే రాజీనామా విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోందని భావిస్తున్నారు. రాజీనామా ఆమోదించకపోయినా .. గంటా శ్రీనివాస్ అసెంబ్లీకి హాజరు కావడం లేదు. అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కన్నా... మూడు రాజధానుల అంశాన్నే వైఎస్ఆర్‌సీపీ ఎక్కువగా ప్రస్తావిస్తోంది.  ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ప్రకటించినందన విశాఖలో దుమ్మురేపే విజయం వస్తుందని వైసీపీ చెబుతోంది. కానీ అంది వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎందుకు కాలదన్నుకుంటోందో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. 

మూడు రాజధానుల పోరాటంలో సీరియస్ నెస్ లేకపోతే ప్రజలూ పట్టించుకోరు !

మూడు రాజధానుల కోసం వైసీపీ నేతలు చేస్తున్న పోరాటంలో సీరయస్ నెస్ లేకపోతే ప్రజూ పట్టించుకునే పరిస్థితి ఉండదు. కరణం ధర్మశ్రీ  ఇచ్చిన రాజీనామా లేఖ పూర్తిగా తేడాగా ఉంది. స్పీకర్ ఫార్మాట్‌లో లేదు.  నిజంగా ఆమోదించాలని స్పీకర్ అనుకున్నా సాధ్యం కాదు. కొత్త లేఖ పంపాల్సిందే. అయితే వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని అందుకే ఇలాంటి గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు సహజంగానే వస్తాయి.  పూర్తి స్థాయిలో నిబందనలకు అనుగుణంగా ఉన్న గంటా రాజీనామాను ఆమోదించకుండా పక్కన పెట్టి ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో వైసీపీ నేతల రాజకీయాలేంటనే ప్రశ్న సహజంగానే వస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 KKR VS MI Result Update:  ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
KTR about HCU Lands: హెచ్‌సీయూ భూముల కేటాయింపు వల్ల జరిగే నష్టంపై వెంటనే అధ్యయనం చేయాలి: కేటీఆర్
HCU భూముల కేటాయింపు వల్ల జరిగే నష్టంపై వెంటనే అధ్యయనం చేయాలి: కేటీఆర్
Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
IPL 2025 KKR All Out: అశ్వనీ కుమార్ దెబ్బ అదుర్స్.. కుప్పకూలిన కేకేఆర్.. సీజన్ లో లోయెస్ట్ స్కోరు నమోదు
అశ్వనీ కుమార్ దెబ్బ అదుర్స్.. కుప్పకూలిన కేకేఆర్.. సీజన్ లో లోయెస్ట్ స్కోరు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Dhoni Fan Frustration on Out | RR vs CSK మ్యాచ్ లో వైరల్ గా మారిన క్యూట్ రియాక్షన్ | ABP DesamMS Dhoni Retirement | IPL 2025 లో హోరెత్తిపోతున్న ధోని రిటైర్మెంట్ | ABP DesamSandeep Sharma x MS Dhoni in Final Overs | RR vs CSK మ్యాచ్ లో ధోనిపై Sandeep దే విజయం | ABP DesamAniket Verma Young Super Star in SRH IPL 2025 | సన్ రైజర్స్ కొత్త సూపర్ స్టార్ అనికేత్ వర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 KKR VS MI Result Update:  ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
ముంబై ఈజీ విక్ట‌రీ.. సీజ‌న్ లో తొలి విజ‌యాన్ని సాధించిన ఎంఐ.. రికెల్ట‌న్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ
KTR about HCU Lands: హెచ్‌సీయూ భూముల కేటాయింపు వల్ల జరిగే నష్టంపై వెంటనే అధ్యయనం చేయాలి: కేటీఆర్
HCU భూముల కేటాయింపు వల్ల జరిగే నష్టంపై వెంటనే అధ్యయనం చేయాలి: కేటీఆర్
Pastor Praveen Pagadala: పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
పాస్టర్ ప్రవీణ్ మృతిలో కీలక అప్ డేట్.. విజయవాడలో ఆ 4 గంటలు ఎక్కడున్నారంటే...?
IPL 2025 KKR All Out: అశ్వనీ కుమార్ దెబ్బ అదుర్స్.. కుప్పకూలిన కేకేఆర్.. సీజన్ లో లోయెస్ట్ స్కోరు నమోదు
అశ్వనీ కుమార్ దెబ్బ అదుర్స్.. కుప్పకూలిన కేకేఆర్.. సీజన్ లో లోయెస్ట్ స్కోరు నమోదు
Rains Alert: తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట
తెలంగాణకు చల్లని వార్త, మూడు రోజులపాటు వర్షాలు- ఎండల నుంచి ఊరట
Akkada Ammayi Ikkada Abbayi Trailer: యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
యాంకర్ ప్రదీప్ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ట్రైలర్ చూశారా? - ఊరు మొత్తానికి ఒకే అమ్మాయి ఉంటే!
Social Exam Date: ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్
ఏప్రిల్ 1న యథావిధిగా పదవ తరగతి సోషల్ ఎగ్జామ్
Nara Lokesh: అలకలు మాని, పార్టీ కోసం పనిచేయండి- టీడీపీ నేతలకు నారా లోకేష్ క్లాస్
అలకలు మాని, పార్టీ కోసం పనిచేయండి- TDP నేతలకు నారా లోకేష్ క్లాస్
Embed widget