అన్వేషించండి

Sharmila to Delhi : షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు - పార్టీ విలీనానికి సర్వం సిద్ధం ?

YS Sharmila : కాంగ్రెస్‌లో చేరేందుకు షర్మిల ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది.

Sharmila will go to Delhi to join Congress :  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను ఆ పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించింది. గురువారం ఆమె ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పార్టీ విలీనం, అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలపై ఆమెతో కాంగ్రెస్ పెద్దలు చర్చించనున్నట్లు సమాచారం.  ఆంధ్రప్రదేశ్   బాధ్యతలు ఇవ్వడానికి హస్తం అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీలో ఉన్నారు. 

ఏపీ కాంగ్రెస్ నేతలతో  హైకమాండ్ చర్చలు                                         

మరో వైపు ఏపీ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ తో సహా ఏపీ ముఖ్య నేతలంతా ఢిల్లీ వెళ్లారు.  అధిష్టానంతో ఏపీ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు.  అధ్యక్షుడు ఖర్గే నేతృత్వంలో ఏపీ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు, ఏపీలో పొత్తులపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీని పునరుత్తేజపరిచేలా నిర్ణయాలను అధిష్టానం తీసుకోనున్నట్లుగా చెబుతున్నారు. 

తెలంగాణకు బదులుగా ఇక ఏపీలోనే రాజకీయాలు చేసే చాన్స్                                 

షర్మిల తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీలో  తన పార్టీవి విలీనం చేయాలనుకున్నారు. ఈ అంశంపై డీకే శివకుమార్ సాయంతో హైకమాండ్ తో చర్చలు జరిపారు. ఓ సారి ఢిల్లీకి వెళ్లి సోనియాతో కూడా సమావేశం అయ్యారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో ఆగిపోయారు. తర్వాత ఆమెను తెలంగాణ రాజకీయాల్లో కంటే.. ఏపీ రాజకీయాల్లో పార్టీ బలోపేతం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు. షర్మిల వల్ల ఏపీలో పార్టీకి మేలు జరుగుతుందని సూచించారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ సంప్రదింపులు జరపడంతో ఏపీలో రాజకీయాలు చేసేందుకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 

వైసీపీ వెళ్లిన కాంగ్రెస్ ఓటు బ్యాంక్ తిరిగి  వస్తుందా ?                                   

ఏపీలో సీఎం జగన్ సొంత పార్టీ వైసీపీని పెట్టుకోవడంతో అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం అయింది. కాంగ్రెస్ కు సరైన నాయకుడు లేకపోవడంతో  క్యాడర్ , లీడర్లు అంతా జగన్ వెంట వెళ్లిపోయారు. అప్పట్నుంచి నాయకత్వ సమస్య ఉంది. ఇప్పుడు షర్మిల రాకపోతే.. ఆ సమస్య తీరుతుందని .. కాంగ్రెస్ పార్టీని గతంలో ఆదరించిన వర్గాలన్నీ మళ్లీ కాంగ్రెస్ వైపు వస్తాయని నమ్ముతున్నారు. షర్మిల కూడా గట్టిగా  తన రాజకీయ భవిష్యత్ కోసం ప్రయత్నించాలని.. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుకుంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

E20 Petrol Controversy: ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
ఇప్పుడు E20 పెట్రోల్‌పై నిరసనలు - కోర్టుకెళ్లిన గడ్కరీ - అసలు ముప్పు ఎవరికి?
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
Mudragada Kapu Reservation Legacy: కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
కాపు రిజర్వేషన్లపై వైసీపీ నేతల భారీ ప్రకటనలు - పార్టీ విధానాన్ని మార్పించగలరా?
GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget