News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

కన్నా కామెంట్స్‌పై బీజేపీలో తీవ్ర చర్చ- ఆచితూచి వ్యవహరిస్తున్న పార్టీ నాయకత్వం!

కన్నా లక్ష్మీనారాయణ విషయంలో బీజేపీ నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత ఆయన సామాజిక వర్గం అవసరం పార్టీకి ఉండటంతో పార్టీ పెద్దలు కూడా కన్నా కామెంట్స్‌ను భరిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. 

FOLLOW US: 
Share:

ఆంధ్రప్రదేశ్‌ పాలిటిక్స్‌లో నిరసన స్వరాలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు అసలు ఉన్నమా లేదా అనే వారికి వారే అనుమానపడే విధంగా ఉన్న నేతలు ఇప్పుడు వాయిస్ పెంచుతున్నారు. ఏం జరిగినా మన మంచికే అనే రేంజ్‌లో నాయకులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా బీజేపీలో కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతల మాటలు ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. 

కన్నా లక్ష్మీనారాయణ అంటే తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ సెక్టార్‌లో తెలియని వారు ఉండరేమో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసి కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలగటంతోపాటుగా ముఖ్యమంత్రి అభ్యర్ధుల టాప్ త్రీ పేర్లలో కన్నా పేరు కూడ వినపడేది. అలాంటిది రాజకీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగా కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. అంతకంటే ముందు వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆఖరి నిమిషంలో బీజేపిలో చేరి రాష్ట్ర అధ్యక్ష పదవిలో పని చేశారు. ఆయన పదవి కాలం ముగియటంతో కోర్ కమిటీలో స్థానం కల్పించారు. 

అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత చాలా రోజులు సైలెంట్‌ అయిన కన్నా లక్ష్మీనారాయణ... ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కన్నా చేసే కామెంట్స్ ఇప్పుడా పార్టీలో హీట్ పుట్టిస్తున్నాయి. నేరుగా పార్టీ అధ్యక్షుడినే టార్గెట్ చేస్తూ విమర్శల బాణాలు సంధిస్తున్నారు. సోము వీర్రాజు పనితీరు బాగోలేదంటూ పెదవి విరుస్తున్నారు. వరుసగా రెండుసార్లు ఆయన చేసిన కామెంట్స్ వెనుక కారణాలు ఏంటనేది పార్టీ నేతల్లో చర్చ జరుగతుంది.

పార్టీ వ్యవహరాలు ఏమైనా ఉంటే వాటిని పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సి ఉంటుంది. ప్రధానంగా బీజేపి వంటి పార్టీల్లో క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. పార్టీలో మొదటి నుంచి ఉండే నేతలు కూడా తమ సమస్యలను పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని పరిష్కరించుకునేందుకు ప్రయార్టీ ఇస్తారు. అలాంటిది కన్నా వంటి సీనియర్ నేత ఎందుకు ఇలాంటి కామెంట్స్‌ను చేస్తున్నారనే చర్చ నడుస్తోంది. 

కాంగ్రెస్ ఫ్లేవర్ పోలేదా 
కన్నా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో పని చేశారు. అక్కడే మంత్రిగా కూడా కీలకంగా వ్యవహరించి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. విభజన తరువాత తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చిందని అంటారు. అయితే ఆ తరువాత ఆయన బీజేపిలో చేరారు. రెండూ జాతీయ పార్టీలు అయినప్పటికి పార్టీ విధివిధానాల్లో, క్రమశిక్షణలో చాలా తేడా ఉంది. కాంగ్రెస్‌లో అంతర్గత ప్రజాస్వాయ్యం పేరుతో నేతలు, ఎవరైనా ఎవరిపైనైనా కామెంట్స్ చేయటం పరిపాటి. బీజేపీలో మాత్రం అలాంటి పరిస్థితులు చాలా తక్కవుగా ఉంటాయి. ఏదైనా సరే పార్టీలో అంతర్గతంగానే చర్చించుకోవాలి. బాహాటంగా మాట్లాడటానికి ఆస్కారం ఉండదు. దీంతో పార్టీ నేతలు ఎవరైనా కాస్త గీత దాటి మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ పరిగణిస్తుంది. అలా కాదని ఇంకా పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే చర్యలు తీసుకోవటం చాలా స్పీడ్ గా జరుగుతుంది.

కానీ కన్నా విషయంలో....

కన్నా లక్ష్మీనారాయణ విషయంలో మాత్రం బీజేపి నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. సీనియర్ పొలిటిషియన్ కావటంతో పాటుగా ఆయన సామాజిక వర్గపరంగా ప్రభావితం చేయగల స్థాయిలో ఉండటంతో వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఆయన సామాజిక వర్గం అవసరం పార్టీకి ఉండటంతో పార్టీ పెద్దలు కూడా కన్నా కామెంట్స్‌ను భరిస్తున్నారని ఇన్‌సైడ్ టాక్. 

అదే సమయంలో కన్నా చేసిన కామెంట్స్ వెనుక ఉన్న పరిస్థితులు, వాటి పరిణామాలను కూడా నేతలు పరిశీలిస్తున్నట్లుగా చెబుతున్నారు. 2019 ఎన్నికల తరువాత నుంచి జనసేన, బీజేపి పొత్తులో ఉన్నాయి. అవసరమైన పరిస్థితుల్లో పవన్ సేవలను వినియోగించుకోవటంలో బీజేపి నాయకత్వం ఫెయిల్ అయిందన్న కన్నా కామెంట్స్‌పై చర్చ నడుస్తోంది. పవన్‌ను బీజేపీ శ్రేణులతో కలపడంలో సోము వీర్రాజు ఫెయిల్ అయ్యారని అందుకే టీడీపీకి పవన్ దగ్గర అయ్యారని ఆయన విమర్శించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు పెరిగడం కూడా వీర్రాజు ఖాతాలోకే వెళుతుందని కన్నా మండిపడ్డారు. ఈ రెండు అంశాలు పార్టీ పరంగా కీలకమైనవే కావటంతో కన్నా కామెంట్స్ చేశారని అంటున్నారు. దీంతో పార్టీ అగ్ర నాయకత్వం కూడా పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తోందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ వ్యవహరాలపై వీర్రాజు కూడా తన వైఖరిని పార్టీకి స్పష్టం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Published at : 06 Jan 2023 09:44 AM (IST) Tags: BJP Pawan Kalyan Janasena Somu Veeraraju BRS Kanna Lakshmi Narayana

ఇవి కూడా చూడండి

Telangana Power Politics :  తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు -  సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

Telangana Power Politics : తెలంగాణలో విద్యుత్ అప్పుల రాజకీయాలు - సంక్షోభాన్ని కేసీఆర్ సర్కార్ దాచి పెట్టిందా?

General elections in February : ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ? కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

General elections in February :  ఫిబ్రవరిలోనే సాధారణ ఎన్నికలు ?  కేంద్ర  ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోందా ?

Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్

Fake Votes in AP: రాప్తాడులో ఆధార్ కార్డు మార్ఫింగ్, దొంగ ఓట్ల నాటకాలు ఆపాలి: ఎమ్మెల్యేపై పరిటాల సునీత ఫైర్

Balineni YSRCP : మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Balineni YSRCP :  మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నా  - వైసీపీ మాజీ మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

Telangana Assembly : 15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?

Telangana Assembly :  15న స్పీకర్ ఎన్నిక - విపక్షాలు పోటీ పెడతాయా ?

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Special Train To Sabarimala: అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్- శబరిమలకు ప్రత్యేక ట్రైన్ నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!