అన్వేషించండి

Addanki Dayakar : తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ - అద్దంకి దయాకర్‌పై చర్యలకు సీనియర్ల డిమాండ్ !

అద్దంకి దయాకర్‌పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరుతున్నారు. చండూరు సభలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని వారంటున్నారు.

 

Addanki Dayakar :  తెలంగాణ కాంగ్రెస్‌లో వివాదాలు ఒకదాని వెంట ఒకటి వరుసగా వస్తూనే ఉన్నాయి. తాజాగా మునుగోడు నియోజకవర్గం చండూరులో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి సోదరులను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారని  ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ప్రారంభయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పార్టీలో ఉంటే ఉండు.. లేకపోతే లేదన్నట్లుగా అద్దంకి దయాకర్ మాట్లాడారు. కాస్త ఘాటైన పదాలు వాడటంతో ఈ అంశం వివాదాస్పదమయింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేక వర్గంగా పేరు పడిన కొంత మంది సీనియర్ నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. 

అద్దంకి దయాకర్‌పై హైకమాండ్‌కు జానారెడ్డి ఫిర్యాదు

కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లో కనిపించని సీనియర్ నేత జానారెడ్డి అద్దంకి దయాకర్ స్పీచ్‌పై పార్టీ తెలంగాణ వ్యవహారాలను చూసే ఢిల్లీ నేతల్లో ఒకరైన బోసురాజుకు ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. అద్దంకి దయాకర్ లాంటినేతలు దూకుడుగా మాట్లాడం వల్ల పార్టీకి నష్టమని బోసురాజు దృష్టికి జానారెడ్డి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. అలాంటి నేతల్ని దూరం పెట్టాలని ఆయన సూచించారని జానారెడ్డి వర్గీయులు చెబుతున్నారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇంకా స్పందించలేదు. 

తమను తిట్టిస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపాటు

అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఉద్దేశపూర్వకంగా తమ సోదరులను తిట్టిస్తున్నారని ఆయన పరోక్షంగా రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో తమకు అవమానాలు జరుగుతున్నా కష్టపడి పని చేశామన్నారు. మునుగోడు నియోజకవర్గంలో సభ పెట్టి ... అద్దంకి దయాకర్ తమను దూషిస్తున్నా వేదికపై ఉన్న సీనియర్ నేతలు వారించలేదన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

రేవంత్ వ్యతిరేక వర్గీయులకు మరో అస్త్రం

అద్దంకి దయాకర్ తిట్ల వ్యవహారం రేవంత్ ను వ్యతిరేకించే వర్గీయులకు ఓ ఆయుధం లభించినట్లయింది. వారు కోమటిరెడ్డి సోదరులపై దయాకర్ చేసిన వ్యాఖ్యలపై తమకు పరిచయం ఉన్న పార్టీ హైకమాండ్ నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇంత కాలం సైలెంట్‌గా ఉన్న జానారెడ్డి కూడా అద్దంకి దయాకర్ లాంటి నేతలు పార్టీకి నష్టమని హైకమాండ్‌కు ఫిర్యాదు చేయడం ఆసక్తి రేపుతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పార్టీకి నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని.. వారంతా అలా చేస్తున్నప్పుడు పార్టీకి నష్టమని ఎవరూ అనడం లేదని.. కానీ వారిని విమర్శించగానే అదే చాన్స్ అని చాలా మంది తెరపైకి వస్తున్నారని రేవంత్ వర్గీయులు విమర్ిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
మున్సిపల్ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. బీసీలకు కొత్త రిజర్వేషన్లు వర్తింపు
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget